www.telugubhakti.com Satsangam [2 Attachments]

 
[Attachment(s) from p_gopi_krishna@yahoo.com [TeluguBhaktiPages] included below]

పరిపూర్ణ శ్లోకం

అన్నపూర్ణే! సదాపూర్ణే!
శంకర ప్రాణ వల్లభే!
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం
భిక్షాం దేహి చ పార్వతి!

"అన్న సమ్రుద్ధిగల తల్లీ! ఎల్లవేళలా మరియు ఎన్నడూ కోశాగారం ఖాళీగాని నిండైన జగదంబ! పతిస్తుతితో ప్రరవశించే పతివ్రత అయిన శంకరునికి ప్రాణప్రియమైన దేవీ!, ఓ పార్వతీదేవీ! జ్ఞానవైరాగ్యాలు సిద్ధించడానికి మాకు భిక్షనీయవమ్మా"

ప్రకృతి అయిన జగదంబ అన్నాల భాండారం (అన్నపూర్ణ). ఎన్ని జీవులు ఎన్ని రకాలుగా తిని తిరుగుతున్నా తరగని భాండారం (సదా పూర్ణ). ఈ ప్రకృతి అంతా పరమేశ్వరుని శక్తి (శంకర ప్రాణవల్లభ). పవిత్రమైన ఈ చింతనతో అన్నాన్ని స్వీకరించేవాడు - అన్నం ఎందుకు తినాలో తెలిసినవాడు. 'జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం' - జ్ఞానవైరాగ్యాలు సిద్ధించడానికి (మాత్రమే) అన్నం తినాలి.

తినే తిండి బుద్ధిని చైతన్యవంతం చేసి చక్కని జ్ఞానాన్ని కలిగించాలి. ఆ జ్ఞానం ఏది సత్యమో, ఏది అసత్యమో గ్రహించి మోహశోకాలను, రాగద్వేషాలను వదిలే దివ్యానుభవం పొందించాలి. అందుకే ఆహార స్వీకారం.

వండుకు తింటున్నామన్న అహంకారం తొలిగి, 'అన్నం అమ్మ పెట్టింది' అనే భావనే వాత్సల్యాన్నీ, మాధుర్యాన్నీ కలగలిపిన అమృతత్వాన్ని అందిస్తుంది.

అన్నపూర్ణ వడ్డిస్తుంటే ఈశ్వరుడు స్వీకరిస్తున్నట్టుగా ఉన్న చిత్రపటం మనకు సుపరిచితం. ఇందులో మర్మమేమిటంటే, "ప్రకృతి నుంచి తయారైన ఆహారం ముందుగా ఈశ్వరునికి నివేదించిన పిదప మనం స్వీకరించాలి". ఈ ప్రపంచంలో మనం అనుభవించేవన్నీ అన్నపూర్ణ ప్రసాదాలే. వీటిని ఈశ్వరార్పణ బుద్ధితో గ్రహించేవాడు ధన్యుడు.

ఇలా ప్రతి నిత్యం అన్నం తినేముందు మన భావనలో అమ్మ కరుణ కదలాడితే, జీవితాంతం ఆ తల్లి వాత్సల్యం అనుభవించగలం.

డా. సామవేదం షణ్ముఖశర్మ.శ్రీశైల ప్రభ, ఫిబ్రవరి 2019

__._,_.___

Attachment(s) from p_gopi_krishna@yahoo.com [TeluguBhaktiPages] | View attachments on the web

2 of 2 Photo(s)


Posted by: p_gopi_krishna@yahoo.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (107)

Check out the automatic photo album with 2 photo(s) from this topic.
Annapurna.jpg Annapurna Siva.jpg

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

SPONSORED LINKS
.

__,_._,___

No comments: