[racchabanda] ఉజ్జ్వలా (ముద్రా) #ujjvalA (mudrA)#

 

ఉజ్జ్వలా (ముద్రా) - 

ఆధారము - జయకీర్తి, హేమచంద్రుడు 

ఉజ్జ్వలా (ముద్రా) - న/భ/భ/మ/స/స/లగ III UII UII UU - UII UII UIU
20 కృతి 373176

మనసు పిల్చెను దల్చెను నిన్నే - మానిని గాంచుము మోదమై  
వినుము ప్రీతిగ గీతము నీకై - ప్రేమగ వ్రాసితి నందమై 
దినము రమ్య మనన్యము నీతోఁ - దృప్తిగ నుండును దివ్యమై 
ప్రణయ మంత్రపు తంత్రము నీవే - ప్రాణము వెల్గును భవ్యమై 

నిదుర యెందుకు పున్నమి నేఁడే - నింగిని జంద్రుఁడు వెల్గెఁగా 
మదనమంజరి పూవుల కిల్లై - మాయల మత్తులఁ జల్లెఁగా 
ముదము నిండఁగ నిచ్చెద రావా - ముద్దుల ముద్రలు రాశిగా 
వదనమందున గెంపులు ప్రోవై - వాసము సేయఁగ వాసిగా 

సరస రమ్మిట సారసనేత్రీ - శారదరాత్రియు నుజ్జ్వలం 
బరయఁ గాముని పండుగ నేఁడే - హర్ష సుగంధము నిండెఁగా 
విరుల దండలఁ గ్రుచ్చితి నీకై - ప్రేమము సూత్రము నిక్కమై 
తరళ తారల యాకృతు లెన్నో - దర్శన మిచ్చెను జూడుమా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ujjvalA (mudrA) - 

aadhAramu - jayakIrti, hEmachaMdruDu 

ujjvalA (mudrA) - na/bha/bha/ma/sa/sa/laga #III UII UII UU - UII UII UIU#
20 kRti 373176

manasu pilchenu dalchenu ninnE - mAnini gAMchumu mOdamai  
vinumu prItiga gItamu nIkai - prEmaga vrAsiti naMdamai 
dinamu ramya mananyamu nItO@M - dRptiga nuMDunu divyamai 
praNaya maMtrapu taMtramu nIvE - prANamu velgunu bhavyamai 

nidura yeMduku punnami nE@MDE - niMgini jaMdru@MDu velge@MgA 
madanamaMjari pUvula killai - mAyala mattula@M jalle@MgA 
mudamu niMDa@mga niccheda rAvA - muddula mudralu rASigA 
vadanamaMduna geMpulu prOvai - vAsamu sEya@mga vAsigA 

sarasa rammiTa saarasanEtrI - SAradarAtriyu nujjvalaM 
baraya@M gAmuni paMDuga nE@MDE - harsha sugaMdhamu niMDe@MgA 
virula daMDala@M gruchchiti nIkai - prEmamu sUtramu nikkamai 
taraLa tArala yAkRtu lennO - darSana michchenu jUDumA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: