[racchabanda] గీతి ఛందములతో పాట - 5 #gIti ChaMdamulatO pATa - 5#

 

గీతి ఛందములతో పాట - 5 

పల్లవి - అసమగీతి - సూ/సూ/సూ - ఇం/ఇం - 5 పుష్యరాగ 8 (ఆటవెలఁది బేసి పాదము)
చరణము - మధురగీతి - సూ/సూ/సూ - సూ/సూ/సూ - 6 మరకత 64 (కొన్ని సమయములలో ఆటవెలఁది బేసి పాదమును కూడ 6 సూర్యగణములుగా వ్రాయ వీలగును) 

కనులు నిన్ను జూడఁ - గమలాక్ష వేచెరా 
మనసు నీదు పేరె - మననమ్ము సేసెరా 
దినము గడచిపోయెఁ - దిమిరమ్ము వచ్చెరా 
వినక నీదు మాట - విరహమ్ము హెచ్చెరా 

కన్నె మనసులోనఁ - గలలు నింపు మాయ 
చిన్ని యాశలన్ని - చెలువంపు ఛాయ 
తెన్ను జూచుచుంటిఁ - దెరువు నిర్జనమ్ము 
వన్నెలయ్యె నలుపు - వాడె మానసమ్ము 

కనులు నిన్ను జూడఁ - గమలాక్ష వేచెరా 
మనసు నీదు పేరె - మననమ్ము సేసెరా 

తమము నిండె బయట - తమము మనసులోన 
సుమము లెండిపోయె - సోన రాలె మేన 
రమణ నీవు లేవు - రాత్రి జాగరమ్ము
భ్రమల తెరలలోన - భ్రాంతి వాస్తవమ్ము 

కనులు నిన్ను జూడఁ - గమలాక్ష వేచెరా 
మనసు నీదు పేరె - మననమ్ము సేసెరా 

రేయి కరిగె వెలుఁగు - ఱేఁడు పొడుచు నింక 
మోయలేని నవ్వు - మోవి కగును వంక 
కాయలగును గనులు - కానలేక నిన్ను 
వేయి యాశ లింక - వెతల ముంచు నన్ను

కనులు నిన్ను జూడఁ - గమలాక్ష వేచెరా 
మనసు నీదు పేరె - మననమ్ము సేసెరా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
gIti ChaMdamulatO pATa - 5 

pallavi - asamagIti - sU/sU/sU - iM/iM - 5 pushyarAga 8 (aaTavela@Mdi bEsi pAdamu)
charaNamu - madhuragIti - sU/sU/sU - sU/sU/sU - 6 marakata 64 (konni samayamulalO aaTavela@Mdi bEsi pAdamunu kUDa 6 sUryagaNamulugA vrAya vIlagunu) 

kanulu ninnu jUDa@M - gamalAxa vEcherA 
manasu nIdu pEre - mananammu sEserA 
dinamu gaDachipOye@M - dimirammu vachcherA 
vinaka nIdu mATa - virahammu hechcherA 

kanne manasulOna@M - galalu niMpu mAya 
chinni yASalanni - cheluvaMpu ChAya 
tennu jUchuchuMTi@M - deruvu nirjanammu 
vannelayye nalupu - vADe mAnasammu 

kanulu ninnu jUDa@M - gamalAxa vEcherA 
manasu nIdu pEre - mananammu sEserA 

tamamu niMDe bayaTa - tamamu manasulOna 
sumamu leMDipOye - sOna rAle mEna 
ramaNa nIvu lEvu - rAtri jAgarammu
bhramala teralalOna - bhrAMti vAstavammu 

kanulu ninnu jUDa@M - gamalAxa vEcherA 
manasu nIdu pEre - mananammu sEserA 

rEyi karige velu@Mgu - ~rE@MDu poDuchu niMka 
mOyalEni navvu - mOvi kagunu vaMka 
kAyalagunu ganulu - kAnalEka ninnu 
vEyi yASa liMka - vetala muMchu nannu

kanulu ninnu jUDa@M - gamalAxa vEcherA 
manasu nIdu pEre - mananammu sEserA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: