[racchabanda] ఘనమౌ ....

 

ఘనమౌ ....
-------------------

--

కం.

--

వరమైనట్టిది పద్యముతో 
మురిపెంబిడు వారికెల్ల మ్రొక్కుల నిడుదున్ 
వరదాయిని భారతికిన్ 
మఱి మఱి ప్రాంజలి ఘటింతు మన్నన మీఱన్ 
--
సెలయేరులవలె నుఱుకుచుఁ 
గలగానము సేయుచుండు కవితలఁ జూడన్ 
బులకింతలె యనవరతము 
కలహాసములొల్కుచుండఁ గమలాసనియున్ 
--
తెలుఁగునఁ దీయని పద్యము
లలవోకగ వ్రాయువారి కభినందనముల్ 
కలవాణి శోభఁ జూపుచు 
నిలకును హితకరమవనవి హృదయము పొంగున్ 
--
పలురీతులఁ బద్యముతోఁ 
దెలుపఁగ లోనున్న తలఁపు తీరగు రీతిన్
గలుగక యుండునె మోదము 
గలమెత్తని వారికైనఁ గననాకవితల్ 
--
వైవిధ్యము భావములో 
వైవిధ్యము శైలి నందు, భాషను, గతులన్ 
దేవుని సృష్టిని మాదిరి
వేవిధముల నొప్పుచుండు విభవము లొప్పన్ 
--
కావ్యము లెన్నియొ వెడలును 
శ్రావ్యంబయి వీనుగవకు/వీనులకును రహిమెయిఁ బాడన్ 
దివ్యంబగు వెలుఁగులతో 
భవ్యంబగు పథముఁ జూపి ప్రజలను నడుపన్
--
చిరముగ నిలుచును భువిపై
హరిపదములఁ బాడువగుచు నానందమిడన్ 
చరితమ్మును ధన్యమగును 
పరమాత్ముని కృపను బొంది భజియించఁ దనన్
--
సిరిసంపదలిడి యశమును
విరివిగ నందించు విభుఁడె పెరిమను గనుచున్ 
దొరకును సుఖశాంతులునున్ 
వరముగ బ్రతుకంత సాగ వసుధకు హితమై 
--
స్మరియించుచు దైవమ్మును 
గురుభక్తియుఁ గలిగి సతము గుణనిధులగుచున్ 
సరియగు పదములఁ గూర్చుచు 
నిరతము రచియించు విధము నిజముగ ఘనమౌ

--

సుప్రభ 
9:03 AM
04-16-2019


__._,_.___

Posted by: suprabha u <saarada@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: