[racchabanda] మార్గబంధు లేక శంకరభారతి #mArgabaMdhu lEka SaMkarabhArati#

 

మార్గబంధు లేక శంకరభారతి - 

సుమారు రెండు సంవత్సరములకు ముందు (01 మే 2017) శ్రీమతి సుప్రభగారు భారతీతీర్థులు వ్రాసిన శంకరాచార్య స్తవమును ద్విపది రూపములో పంపినారు. దాని ఛందస్సు (త/త/మ/య/య/య/య) నాకెక్కడ కనబడ లేదు. దానికి శంకరభారతి అని పేరునుంచి ఉదాహరణములను ఇచ్చినాను. ఆ సందేశమును ఇక్కడ చదువ వచ్చును - 
 https://groups.yahoo.com/neo/groups/Chandassu/conversations/messages/8539 

Fast forward మొన్న నా తమిళ స్నేహితులు శ్రీ సుబ్రమణ్యన్‌గారు అప్పయదీక్షితులు వ్రాసిన మార్గబంధు స్తోత్రమును పంపి దాని ఛందస్సును వివరించమని అడిగారు ( http://stotram.co.in/margabandhu-stotram/ ). అది ఒక అర్ధసమ వృత్తము. నావద్ద ఉండే ఏ గ్రంథములో దాని ఛందస్సు వివరించబదలేదు. ద్విపదియైన శంకరభారతిలోని ఒక పాదము ఇందులోని రెండు పాదములకు సమానము. 

బేసి పాదములకు గణములు - త/త/గగ
సరి పాదములకు గణములు - ర/ర/ర/ర/గ 

బేసి పాదములు - కేతుమాల (లేక కరాళీ వృత్తము)
సరి పాదములు - శ్రద్ధరాంత

ఈ శ్రద్ధరాంతను గుఱించి ఇప్పుడే వివరించినాను. 
మొదటి రెండు పాదములను క్రింది విధముగా అమర్చవచ్చును - 

UUI UUI UU
UI UUI 
UUI UUI UU

ఇలా చేసినప్పుడు మొదటి ఎనిమిది అక్షరములకు చివరి ఎనిమిది అక్షరములకు గణస్వరూపము ఒక్కటే. మధ్య ఉండే వంతెనకు ప్రాసయతిని (శంకరభారతిలో ఇది అక్షరసామ్య యతి) ఉంచి వ్రాసినప్పుడు ఇది చెవుల కింపుగా నుంటుంది. దీనికి మార్గబంధు అని పేరు నుంచినాను. 

ఇక్కడ ఒక విషయము చెప్పాలి. సంస్కృతములో అప్పయదీక్షితులు ఛందశ్శాస్త్రములో దిట్ట. వీరు వారి నయమంజరిని 189 ఛందస్సులలో వ్రాసినారు. అంతే కాదు, కొన్ని కల్పనలను కూడ చేసినారు. వారికి తెలుగు ఛందస్సు కూడ బాగుగా తెలుసు అనుకొంటాను. వారు మంగళమహాశ్రీవంటి వృత్తమును ఉపయోగించారు. అంతే కాదు తెలుగు పేరులైన మానిని (సంస్కృతములో మదిరా), కవిరాజవిరాజితము (సంస్కృతములో హంసపద) వాడినారు. ఈ మార్గబంధుస్తోత్రములోని అర్ధసమ వృత్తము వారి కల్పనగ నుండవచ్చును. మార్గబంధుస్తోత్రమును ఇక్కడ వినవీలగును - 
 
https://www.youtube.com/watch?v=0VhRfh0K8w8 

మార్గబంధు (శంకరభారతి) - 
బేసి పాదములు - కేతుమాల - త/త/గగ - నేను యతిని ఉపయోగించలేదు. 
సరి పాదములు - శ్రద్ధరాంత - ర/ర/ర/ర/గ - ఆఱవ అక్షరముతో ప్రాసయతి (2, 7 ప్రాసాక్షరములు). 

రావేల గోపాలబాలా 
నీవు రావేల 
దేవాధిదేవా సునీలా 
భావాల సంద్రమ్ము నీవే
జీవనాధార 
జీవాల కేంద్రమ్ము నీవే

వేణూవినోదా ముకుందా 
గాన నాదాబ్ధి 
యానంద సూర్యప్రకాశా 
శ్రీనాథ సత్యప్రసాదా 
దీనమందార 
యీనన్ను గావంగ రావా 

రాకేందు బింబ స్వరూపా 
నాకు నీదైన 
రాకల్ సదా మోద మిచ్చున్ 
శ్రీకాంత వెల్గించు త్రోవన్ 
నాకు నేవేళ 
నీ కాంతితో మార్గబంధూ 

ఈనాదు ప్రేమమ్ము నీకే 
మానసమ్మందు 
నేనాఁడు జన్మించెనోగా 
కానంగ నౌనా లతాంగీ 
నేను నిన్నిందుఁ 
గానంగ నౌనా ప్రియాంగీ 

దీపమ్ము లీరేయి వెల్గెన్ 
రా పయోజాక్షి 
యీ పూలతో మాల నీకే 
నాపక్క నీవుండరాదా 
యోపలేనింక 
యీపక్క నిన్ బిల్చె దేవీ

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
mArgabaMdhu lEka SaMkarabhArati - 

sumAru reMDu saMvatsaramulaku muMdu (01 mE 2017) SrImati suprabhagAru bhAratItIrthulu vrAsina SaMkarAchArya stavamunu dvipadi ruupamulO paMpinAru. dAni ChaMdassu (ta/ta/ma/ya/ya/ya/ya) nAkekkaDa kanabaDa lEdu. dAniki SaMkarabhArati ani pErunuMchi udAharaNamulanu ichchinAnu. aa saMdESamunu ikkaDa chaduva vachchunu - 
# https://groups.yahoo.com/neo/groups/Chandassu/conversations/messages/8539 #

#Fast forward# monna nA tamiLa snEhitulu SrI subramaNyan^gAru appayadIxitulu vrAsina mArgabaMdhu stOtramunu paMpi dAni ChaMdassunu vivariMchamani aDigAru (# http://stotram.co.in/margabandhu-stotram/ #). adi oka ardhasama vRttamu. nAvadda uMDE E graMthamulO dAni ChaMdassu vivariMcabadalEdu. dvipadiyaina SaMkarabhAratilOni oka pAdamu iMdulOni reMDu pAdamulaku samAnamu. 

bEsi pAdamulaku gaNamulu - ta/ta/gaga
sari pAdamulaku gaNamulu - ra/ra/ra/ra/ga 

bEsi pAdamulu - kEtumAla (lEka karALI vRttamu)
sari pAdamulu - SraddharAMta

ee SraddharAMtanu gu~riMchi ippuDE vivariMchinAnu. 
modaTi reMDu pAdamulanu kriMdi vidhamugA amarchavachchunu - 

#UUI UUI UU
UI UUI 
UUI UUI UU#

ilA chEsinappuDu modaTi enimidi axaramulaku chivari enimidi axaramulaku gaNasvarUpamu okkaTE. madhya uMDE vaMtenaku prAsayatini (SaMkarabhAratilO idi axarasAmya yati) uMchi vrAsinappuDu idi chevula kiMpugA nuMTuMdi. dIniki mArgabaMdhu ani pEru nuMchinaanu. 

ikkaDa oka vishayamu cheppAli. saMskRtamulO appayadIxitulu ChaMdaSSAstramulO diTTa. vIru vAri nayamaMjarini 189 ChaMdassulalO vrAsinAru. aMtE kAdu, konni kalpanalanu kUDa chEsinAru. vAriki telugu ChaMdassu kUDa bAgugA telusu anukoMTAnu. vAru maMgaLamahASrIvaMTi vRttamunu upayOgiMchAru. aMtE kAdu telugu pErulaina mAnini (saMskRtamulO madirA), kavirAjavirAjitamu (saMskRtamulO haMsapada) vADinAru. ee mArgabaMdhustOtramulOni ardhasama vRttamu vAri kalpanaga nuMDavachchunu. mArgabaMdhustOtramunu ikkaDa vinavIlagunu - 
https://www.youtube.com/watch?v=0VhRfh0K8w8 #

maargabaMdhu (SaMkarabhArati) - 
bEsi pAdamulu - kEtumAla - ta/ta/gaga - nEnu yatini upayOgiMchalEdu. 
sari pAdamulu - SraddharAMta - ra/ra/ra/ra/ga - aa~rava axaramutO prAsayati (2, 7 prAsAxaramulu). 

rAvEla gOpAlabAlA 
nIvu rAvEla 
dEvAdhidEvA sunIlA 
bhAvAla saMdrammu nIvE
jIvanAdhAra 
jIvAla kEMdrammu nIvE

vENUvinOdA mukuMdA 
gAna nAdAbdhi 
yAnaMda sUryaprakASA 
SrInAtha satyaprasAdA 
dInamaMdAra 
yInannu gAvaMga rAvA 

rAkEMdu biMba svarUpA 
nAku nIdaina 
rAkal sadA mOda michchun 
SrIkAMta velgiMchu trOvan 
nAku nEvELa 
nI kAMtitO mArgabaMdhU 

InAdu prEmammu nIkE 
mAnasammaMdu 
nEnA@MDu janmiMchenOgA 
kAnaMga naunA latAMgI 
nEnu ninniMdu@M 
gAnaMga naunA priyAMgI 

dIpammu lIrEyi velgen 
rA payOjAxi 
yI pUlatO mAla nIkE 
nApakka nIvuMDarAdA 
yOpalEniMka 
yIpakka nin bilche dEvI

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: