[racchabanda] మాత్రాసమక కుసుమషట్పదీ అర్ధసమ వృత్తములో పాట #mAtrAsamaka kusumashaTpadI ardhasama vRttamulO pATa #

 

మాత్రాసమక కుసుమషట్పదీ అర్ధసమ వృత్తములో పాట - 

బేసి పాదములు - పం/పం - పం/పం 
సరి పాదములు - పం/పం - పం/గ 
పాదాంత లఘువులు గురు తుల్యము 

నాయికతో ఇష్టసఖి నుడివిన పలుకులు - 

పల్లవి. 
ఎందుకే తత్తర - మ్మెందుకే బిత్తరం 
మ్మెందుకే చిత్తమున - నిటుల భయము 

చరణము 1 - 
సద్దు లణఁగిన రేయి - చంద్రకౌముది హాయి 
నిద్దురించెను నగరి - నీవుతప్ప 
వద్దులే సంశయము - వాఁడె నీ యాశయము 
ముద్దిచ్చు మోముపై - మోద మలర 

చరణము 2 - 
ఆనంద సంద్రమున - నాశలను నావలో 
గానమ్ము సేయుచును - గంతు లిడుమా 
మీనమ్ము లెగురఁగా - మెలమెల్ల నీటిలో 
మేనుపై నలలు పడ - మెఱసిపొమ్మా 

మోహనమ్మగు నవ్వు - మురిపె మొలికెడు పువ్వు 
దేహమ్ము నర్పించు - దేవుఁ డతఁడు 
దాహమ్ము తగ్గఁగాఁ - దానిచ్చు సుధ నీకు 
మోహంపు టెల్లలో - మోక్ష మొదవు 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
mAtrAsamaka kusumashaTpadI ardhasama vRttamulO pATa - 

bEsi pAdamulu - paM/paM - paM/paM 
sari pAdamulu - paM/paM - paM/ga 
pAdAMta laghuvulu guru tulyamu 

nAyikatO ishTasakhi nuDivina palukulu - 

pallavi. 
eMdukE tattara - mmeMdukE bittaraM 
mmeMdukE chittamuna - niTula bhayamu 

charaNamu 1 - 
saddu laNa@Mgina rEyi - chaMdrakaumudi hAyi 
nidduriMchenu nagari - nIvutappa 
vaddulE saMSayamu - vA@MDe nI yASayamu 
muddichchu mOmupai - mOda malara 

charaNamu 2 - 
aanaMda saMdramuna - nASalanu nAvalO 
gAnammu sEyuchunu - gaMtu liDumA 
mInammu legura@MgA - melamella nITilO 
mEnupai nalalu paDa - me~rasipommA 

mOhanammagu navvu - muripe molikeDu puvvu 
dEhammu narpiMchu - dEvu@M Data@MDu 
dAhammu tagga@MgA@M - dAnichchu sudha nIku 
mOhaMpu TellalO - mOxa modavu 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: