[racchabanda] రచ్చబండ కవితలు

 

Disillusioned

 

వందల పక్షులు ఎగురుతుంటాయిక్కడ

ఏరోజూ చూడూ, చుట్టూ వందల వందల పక్షులు.

జైల్లో కూర్చుని ఓ గుడ్డిగువ్వ మీద ఏదో గిలికి

అది కవిత్వమంటాడొకడు.

 

నే జైలుకెళ్లిన విప్లవ వీరుడిని, అందుకు నే వేసిన కేకలు

కవిత్వం అనుకోమంటాడు

ఆ విప్లవమేందో నాకు తెలియదు, ఆ కేకలు విసిగిస్తాయి


ఎప్పుడో వాళ్లావిడో! విప్లవ మేటో, కామ్రేడో

వరండాలో పెంచితే, ఒక్కటంటే ఒక్క కుండీలో చేమంతి మీద

వరవరరావు వరద కవిత్వం

వింటానికి కమ్యూనిస్టుల ఖర్మ కాలింది. నాకెందుకా సోది!


ఇంటో కూర్చుని, ఓ ఏజ్ ఓల్డ్ స్క్రీన్ సేవర్ సముద్రం చూసి

మెట్రికల్గా మాట్లాడితే, అది కవిత్వమంటే

సముద్రం పై కవిత్వమంటే

ఆర్ యూ సీరియస్! అనబుద్ధవుతుంది అలాటివారిని.

 

వందల పూలు పూస్తాయిక్కడ, ఎటు తిరిగి చూడూ

వందలు వందల పూలు. రంగురంగులు. వందలు వందలు.

నే చెప్పేది కవిత్వం కాదేమో కాని

అబద్ధం కాదు కదా!

 

ఆ గులాబీ కనీసం తను పోషించి పెంచిందన్నా కాదు

ఎవరిదో ఒక వెబ్ బ్లాగులో ఒక గులాబీ బొమ్మ

స్ఫూర్తి ఇవ్వటం;  అంతలో

ద్విపదో, మరకతమాలో, నవరత్నఖచిత సుశోభిత ధగిద్ధిగిత

దివ్య రాగమాలికో పొంగిరావటం, ఆపైన

 

స్ఫూర్తినిచ్చిన వారికి వందనాలు

పద్యమిచ్చిన వారికి వందనాలు,

అభినందించిన వారికి వందనాలు

ప్రచురించిన వారికి వందనాలు.

 

ఇదా కవిత్వం! కవితా నాకలోకం!

జైల్లో, ఇంట్లో, డెస్క్ మీది

దివ్య సుందర కంప్యూటర్ స్క్రీన్ దైవాస్థానానికి

ఎంతెంత మహాప్రస్థానం!

 

Lyla


__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (164)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: