Re: [racchabanda] Must read article - షట్పదులు - మాత్రాసమక అర్ధసమ వృత్తములు #shaTpadulu - mAtrAsamaka ardhasama vRttamulu#

 

cAlA  bAgumdi  Mohana gArU.
dhanyavaadaalu,
Murty.

On Fri, May 17, 2019 at 4:58 PM 'J. K. Mohana Rao' jkmrao@yahoo.com [racchabanda] <racchabanda@yahoogroups.com> wrote:


షట్పదులు - మాత్రాసమక అర్ధసమ వృత్తములు - 

షట్పదులు కన్నడ సాహిత్యములో సుప్రసిద్ధములు, ముఖ్యముగా భోగ, శర, కుసుమ, భామినీ షట్పదులు. షట్పదులలో ప్రాస ఆభరణము. తెలుగులో ప్రాసకు బదులు అక్షరసామ్య యతిని ఉంచి వ్రాసినప్పుడు షట్పది ఒక మాత్రాసమక అర్ధసమ వృత్తము అవుతుంది. వాటిని అనువుగా లయాత్మకముగా తాళబద్ధముగా పాడుకొన వీలగును. క్రింద షట్పదులను అర్ధసమ వృత్తములుగా వ్రాయు విధానమును తెలుపుచున్నాను. 

భోగషట్పది - (సూ)4 / (సూ)4 / (సూ)4 - (సూ)2-గ

సారసాక్ష గోపబాల  
చారు రాసనాట్యలోల 
నీరజాస్య నీలదేహ - స్నేహసుందరా 
మారజనక ముగ్ధహాస  
సారసాక్షి హృన్నివాస 
శ్రీరమేంద్ర ధారుణీంద్ర - ప్రేమమందిరా 

పై షట్పది మాత్రసమక అర్ధసమ వృత్తముగా - 

సారసాక్ష గోపబాల - చారు రాసనాట్యలోల 
నీరజాస్య నీలదేహ - స్నేహసుందరా 
మారజనక ముగ్ధహాస - సారసాక్షి హృన్నివాస 
శ్రీరమేంద్ర ధారుణీంద్ర - ప్రేమమందిరా 

మఱొక మాత్రాసమక అర్ధసమ భోగషట్పదీ వృత్తము - 

వేంకటాద్రివాస శ్రీశ - ప్రేమనిలయ పాపనాశ 
సంకటమ్ము బాపుమయ్య - శర్వబాంధవా 
శంకలేక పంకజాక్ష - చక్రపాణి పీనవక్ష 
వంకలేని బాట జూపు - ప్రణవసంభవా 

శరషట్పది - చ-చ / చ-చ / చ-చ - చ-గ

మనసిది నీకే  
మనుగడ నీకే 
తనువిది నీకే - తనియఁగ రా 
వనమున నీవే  
వనజము నీవే 
కనుగవ బిలిచెను - గలవలె రా 

పై షట్పది మాత్రసమక అర్ధసమ వృత్తముగా -

మనసిది నీకే - మనుగడ నీకే 
తనువిది నీకే - తనియఁగ రా 
వనమున నీవే - వనజము నీవే 
కనుగవ బిలిచెను - గలవలె రా 

మఱొక మాత్రాసమక అర్ధసమ శరషట్పదీ వృత్తము -  

తిరువేంకటపతి - తిరునామమ్మే 
తెరువుల జూపును - దివ్యముగా 
సిరిమంగమ్మను - చిరుతానూరున 
దరిసెన మందిన - ధన్యముగా 

కుసుమషట్పది - పం-పం / పం-పం / పం-పం - పం-గ

సరసాల నదములో 
సరిగమల పరుగులో 
స్వరరాగ లహరిలో - స్నానమాడి  
మురిపాల నెమలిగా 
పురివిప్పి నృత్యమ్ము 
సరసమై సేయఁగా - సకియ రావా 

పై షట్పది మాత్రసమక అర్ధసమ వృత్తముగా -

సరసాల నదములో - సరిగమల పరుగులో 
స్వరరాగ లహరిలో - స్నానమాడి  
మురిపాల నెమలిగా - పురివిప్పి నృత్యమ్ము 
సరసమై సేయఁగా - సకియ రావా 

మఱొక మాత్రాసమక అర్ధసమ కుసుమషట్పదీ వృత్తము - 

తిరువేంకటాధీశు - దివ్యమూర్తిని జూడ 
శిరములన్ గల జుట్టు - సిరి నొసంగి 
హరుసాన జనులెల్ల - హరిహరీ గోవింద 
వరదా యనఁగ గంట - వఱలి మ్రోఁగె 

భామినీషట్పది - (త్రి-చ)2 / (త్రి-చ)2 / (త్రి-చ)2 - త్రి-చ-గ

విన్నపాలను వినఁగ రావా 
వెన్న హృదయము కరుగదేలా 
కన్నయా యన నన్ను మఱచితిఁ - గాన రావేలా 
సన్నుతింతును నిన్ను మదిలో 
సన్నజాజుల పూజ సేతును 
తిన్నఁగా నను జూడ రావా - దేవదేవ హరీ 

పై షట్పది మాత్రసమక అర్ధసమ వృత్తముగా -

విన్నపాలను వినఁగ రావా - వెన్న హృదయము కరుగదేలా 
కన్నయా యన నన్ను మఱచితిఁ - గాన రావేలా 
సన్నుతింతును నిన్ను మదిలో - సన్నజాజుల పూజ సేతును 
తిన్నఁగా నను జూడ రావా - దేవదేవ హరీ 

మఱొక మాత్రాసమక అర్ధసమ భామినీషట్పదీ వృత్తము - 

మాల వాడక ముందు రారా - మంచి గందము పూతు నీపై 
పూలపానుపు వేచె నీకై - పొంగె లలి నాలో 
చాలు చాలుర నీలవర్ణా - సమయమయ్యెను జాగుసేయకు 
మేలమాడఁగ సరియె నీకల-మేలుమంగపతీ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
shaTpadulu - mAtrAsamaka ardhasama vRttamulu - 

shaTpadulu kannaDa sAhityamulO suprasiddhamulu, mukhyamugA bhOga, Sara, kusuma, bhAminI shaTpadulu. shaTpadulalO prAsa aabharan'amu. telugulO prAsaku badulu axarasAmya yatini uMchi vrAsinappuDu shaTpadi oka mAtrAsamaka ardhasama vRttamu avutuMdi. vATini anuvugA layAtmakamugA tALabaddhamugA pADukona vIlagunu. kriMda shaTpadulanu ardhasama vRttamulugA vrAyu vidhAnamunu telupuchunnAnu. 

bhOgashaTpadi - (sU)4 / (sU)4 / (sU)4 - (sU)2-ga

sArasAxa gOpabAla  
chAru rAsanATyalOla 
nIrajAsya nIladEha - snEhasuMdarA 
mArajanaka mugdhahAsa  
sArasAxi hRnnivAsa 
SrIramEMdra dhAruNIMdra - prEmamaMdirA 

pai shaTpadi mAtrasamaka ardhasama vRttamugA - 

sArasAxa gOpabAla - chAru rAsanATyalOla 
nIrajAsya nIladEha - snEhasuMdarA 
mArajanaka mugdhahAsa - sArasAxi hRnnivAsa 
SrIramEMdra dhAruNIMdra - prEmamaMdirA 

ma~roka mAtrAsamaka ardhasama bhOgashaTpadI vRttamu - 

vEMkaTAdrivAsa SrISa - prEmanilaya pApanASa 
saMkaTammu bApumayya - SarvabAMdhavA 
SaMkalEka paMkajAxa - chakrapANi pInavaxa 
vaMkalEni bATa jUpu - praNavasaMbhavA 

SarashaTpadi - cha-cha / cha-cha / cha-cha - cha-ga

manasidi nIkE  
manugaDa nIkE 
tanuvidi nIkE - taniya@Mga rA 
vanamuna nIvE  
vanajamu nIvE 
kanugava bilichenu - galavale rA 

pai shaTpadi mAtrasamaka ardhasama vRttamugA -

manasidi nIkE - manugaDa nIkE 
tanuvidi nIkE - taniya@Mga rA 
vanamuna nIvE - vanajamu nIvE 
kanugava bilichenu - galavale rA 

ma~roka mAtrAsamaka ardhasama SarashaTpadI vRttamu -  

tiruvEMkaTapati - tirunAmammE 
teruvula jUpunu - divyamugA 
sirimaMgammanu - chirutAnUruna 
darisena maMdina - dhanyamugA 

kusumashaTpadi - paM-paM / paM-paM / paM-paM - paM-ga

sarasAla nadamulO 
sarigamala parugulO 
svararAga laharilO - snAnamADi  
muripAla nemaligA 
purivippi nRtyammu 
sarasamai sEya@MgA - sakiya rAvA 

pai shaTpadi mAtrasamaka ardhasama vRttamugA -

sarasAla nadamulO - sarigamala parugulO 
svararAga laharilO - snAnamADi  
muripAla nemaligA - purivippi nRtyammu 
sarasamai sEya@mgA - sakiya rAvA 

ma~roka mAtrAsamaka ardhasama kusumashaTpadI vRttamu - 

tiruvEMkaTAdhISu - divyamUrtini jUDa 
Siramulan gala juTTu - siri nosaMgi 
harusAna janulella - hariharI gOviMda 
varadA yana@Mga gaMTa - va~rali mrO@Mge 

bhAminIshaTpadi - (tri-cha)2 / (tri-cha)2 / (tri-cha)2 - tri-cha-ga

vinnapAlanu vina@Mga rAvA 
venna hRdayamu karugadElA 
kannayA yana nannu ma~rachiti@M - gAna rAvElA 
sannutiMtunu ninnu madilO 
sannajAjula pUja sEtunu 
tinna@MgA nanu jUDa rAvA - dEvadEva harI 

pai shaTpadi mAtrasamaka ardhasama vRttamugA -

vinnapAlanu vina@Mga rAvA - venna hRdayamu karugadElA 
kannayA yana nannu ma~rachiti@M - gAna rAvElA 
sannutiMtunu ninnu madilO - sannajAjula pUja sEtunu 
tinna@MgA nanu jUDa rAvA - dEvadEva harI 

ma~roka mAtrAsamaka ardhasama bhAminIshaTpadI vRttamu - 

mAla vADaka muMdu rArA - maMchi gaMdamu pUtu nIpai 
pUlapAnupu vEche nIkai - poMge lali nAlO 
chAlu chAlura nIlavarNA - samayamayyenu jAgusEyaku 
mElamADa@Mga sariye nIkala-mElumaMgapatI 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#__._,_.___

Posted by: Katta Murty <murty@umich.edu>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: