[racchabanda] శ్లోకాలలో క్రొత్త లోకాలు - 24 #SlOkAlalO krotta lOkAlu - 24#

 

శ్లోకాలలో క్రొత్త లోకాలు - 24

మతోన్మాదము మతమా 
మతదానము దానమా 
మతమేల బ్రతుకులో 
మతమేల భూమిపై 

ఈరోజు పూచె నందమ్మై 
యారోజాపూలు తీవలోఁ 
జేరెన్ భృంగాలు ఝుమ్మంచున్ 
జోరుగా నష్టకాకృతిన్ 

కుండపోతగ వర్షమ్ముల్ 
నిండె వీధులు కాల్వలై 
మెండు వేడిమి తగ్గంగా 
నిండె గాలులు చల్లఁగా 

ఎన్నికవితలన్ వ్రాయున్ 
జెన్నుగా వనదేవియున్ 
ఎన్ని చిత్రములన్ గీయున్ 
జెన్నుగాను నభేంద్రుఁడున్ 

గాలిపడగలఁ గనన్ 
బాలక్రీడల జ్ఞాపికల్ 
చాల సంతసము మదిన్ 
నేలనుండియు నింగికిన్ 

రంగురంగుల దీపమ్ముల్ 
నింగిలోఁ బలు తారకల్ 
రంగురంగుల రాగాలన్ 
రంగమీ యంతరంగమే 

సూచన - బేసి పాదములలో 5,6,7 అక్షరములు య-గణముగా, న-గణముగా వాడినాను. అనగా 6,7 అక్షరములు రెండు గురువులు లేక రెండు లఘువులు (ఉదా. జయ మాతంగతనయే).

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
SlOkAlalO krotta lOkAlu - 24

matOnmAdamu matamA 
matadAnamu daanamA 
matamEla bratukulO 
matamEla bhUmipai 

eerOju pUche naMdammai 
yArOjApUlu tIvalO@M 
jEren bhRMgAlu jhummaMchun 
jOrugaa nashTakAkRtin 

kuMDapOtaga varshammul 
niMDe vIdhulu kAlvalai 
meMDu vEDimi taggaMgA 
niMDe gAlulu challa@MgA 

ennikavitalan vrAyun 
jennugA vanadEviyun 
enni chitramulan gIyun 
jennugAnu nabhEMdru@MDun 

gAlipaDagala@M ganan 
bAlakrIDala j~nApikal 
chAla saMtasamu madin 
nElanuMDiyu niMgikin 

raMguraMgula dIpammul 
niMgilO@M balu tArakal 
raMguraMgula rAgAlan 
raMgamI yaMtaraMgamE 

sUchana - bEsi pAdamulalO 5,6,7 axaramulu ya-gaNamugA, na-gaNamugA vADinAnu. anagA 6,7 axaramulu reMDu guruvulu lEka remDu laghuvulu (udaa. jaya mAtaMgatanayE).

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: