[racchabanda] Abburi Chaayadevi no more

 

Renowned writer, Saahithya Academy award recipient, Smt. Abburi Chaayadevi no more. 

Recall an incident that occurred when her husband, another literary giant Sri Abburi Varadarajeshwara Rao garu was very ill.
Sri Varada garu was hospitalized with tubes without means to even talk and to bring up his spirits, Smt. Chaayadevi garu
told him to keep up the will power even in the most difficult trying time. And Sri Varada garu, as he was not able to talk,
scribbled on a piece of paper in Telugu, of course - cheering Chaayadevi garu in turn,  "Will power is not enough, Bill power is needed", and we know
how high medical bills are when one is hospitalized.  Not long after writing that line, he passed away, leaving that line as the last line the
literary giant wrote bringing out humor in most difficult situation one can imagine.

అబ్బూరి దంపతుల అన్యోన్య బంధానికి, దృక్పథానికీ, క్లిష్ట సమయాల్లో సైతం సడలని సాత్విక సంస్కారానికీ, ఆ ఉదంతం చిన్న అద్దంలో కొండను చూపించినట్టుగా చూపిస్తుంది, కాదు, ఒక ఆదర్శంగా నిలుస్తుంది.

 "పరోపకారాయమిదం శరీరం" అన్నది ఆచరణపూర్వకంగా అనుసరిస్తూ సొంత కళ్ళు, వళ్ళు ను కూడా దానం చేసిన మహోన్నత మానవతామూర్తికి,
సాహితీమూర్తికి, ఇవే చేతులు జోడించి హృదయపూర్వకమైన నమస్సులు, నివాళి.




[Source: Today's eenaadu]

అబ్బూరి ఛాయాదేవి కన్నుమూత

పురుషాధిక్యంపై 'కలమెత్తిన' రచయిత్రి 
ఎన్నో పురస్కారాలు ఆమె సొంతం

రవీంద్రభార[తి, న్యూస్‌టుడే:  ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, గొప్ప మానవతామూర్తి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అబ్బూరి ఛాయాదేవి (86) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1933 అక్టోబరు 13న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జన్మించారు. ఆమె భర్త అబ్బూరి వరదరాజేశ్వరరావు సైతం ప్రముఖ రచయితే. కోట్ల విజయభాస్కరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పని చేశారు. 
స్త్రీవాద రచయిత్రిగా గుర్తింపు 
1951-53 మధ్య కాలంలో ఛాయాదేవి నిజాం కళాశాలలో ఎంఏ చదివారు. 1953లో కళాశాల ప్రత్యేక సంచికలో 'అనుభూతి' అనే ఆమె మొదటి కథ ప్రచురితమైంది. అనంతరం ఛాయాదేవి మధ్యతరగతి కుటుంబాలలోని స్త్రీలు ఎదుర్కొనే సమస్యలను, పురుషుల ఆధిపత్యంలో అణచివేతకు గురవుతున్న స్త్రీలను గురించి ఎన్నో కథలు రాశారు. ఇలా స్త్రీవాద సాహిత్యానికి సంబంధించి చేసిన రచనలు ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆమె కథలు హిందీ, తమిళం, మరాఠీÈ, కన్నడ తదితర భాషల్లోకి అనువాదమయ్యాయి. వివిధ భాషల్లోని రచనలను ఛాయాదేవి తెలుగులోకి అనువదించారు. ప్రధానంగా పురుషాధిక్యం స్త్రీలను ఎదగనివ్వకుండా చేస్తోందనే ఆలోచనతో ఛాయాదేవి 'బోన్సాయ్‌ బతుకులు' పేరిట చక్కటి సంపుటి తీసుకొచ్చారు. దీనిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2000 సంవత్సరంలో 10వ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా పెట్టింది. 'తన మార్గం', 'అబ్బూరి ఛాయాదేవి కథలు', పిల్లల కోసం 'అనగనగా జానపద గాథలు' జిడ్డు కృష్ణమూర్తిపై పుస్తకం, అఖరికి అయిదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్‌ కథలు తదితర రచనలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2005 సంవత్సరంలో 'తన మార్గం' అనే కథా సంకలనానికి 'కేంద్ర సాహిత్య అకాడమి' పురస్కారం ఆమెను వరించింది. అనంతరం కేంద్ర సాహిత్య అకాడమి సభ్యురాలిగా ఛాయాదేవి సేవలు అందించారు. ఆమె దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో లైబ్రెరియన్‌గా పనిచేసి 1982లో స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. 1993లో వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం, 1996లో మృత్యుంజయ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత్రి పురస్కారం, 2000 సంవత్సరంలో కళాసాగర్‌ పందిరి సాహితీ పురస్కారం అందుకున్నారు.ఆమె చివరిరోజుల్లో కొండాపూర్‌లోని సీఆర్‌ ఫౌండేషన్‌లో గడిపారు.అబ్బూరి ట్రస్టును నెలకొల్పి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా 'భాషాచ్ఛంధస్సాహిత్య విమర్శ'లో పురస్కారాన్ని ప్రవేశపెట్టారు. 
కేసీఆర్‌ నివాళి.. 
అబ్బూరి ఛాయాదేవి మృతిపై సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. తెలుగు సాహిత్యానికి ఆమె ఎనలేని సేవలందించారని అన్నారు. ఛాయాదేవి మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.నందిని సిధారెడ్డి, డా.ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్ష, కార్యదర్శులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డా.జుర్రు చెన్నయ్య తదితరులు తమ సంతాపాన్ని ప్రకటించారు. కొండాపూర్‌లోని సీఆర్‌ ఫౌండేషన్‌లో ఉంచిన ఆమె భౌతికకాయాన్ని ప్రముఖ రచయితలు ఓల్గా, కొండవీటి సత్యవతి, వసంత కన్నాభిరాన్‌ సందర్శించి నివాళులర్పించారు. 
తాను ఆరిపోతూ వెలుగులు నింపేలా.. 
తాను ఆరిపోయినా మరొకరి జీవితంలో వెలుగులు నింపాలనే ఆలోచనతో ఛాయాదేవి నేత్రాలను దానం చేశారు. ఆమె కన్నుమూశారని తెలిసిన వెంటనే ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రికి చెందిన వైద్యనిపుణులు సీఆర్‌ ఫౌండేషన్‌కు వెళ్లి ఆమె కళ్లను సేకరించారు. సాధించిన కీర్తితోపాటు భౌతికకాయానికి శాశ్వతత్వం కల్పించాలనే ఆదర్శప్రాయమైన ఆలోచనతో మరణానంతరం తన శరీరాన్ని ఛాయాదేవి ఎస్‌ఆర్‌నగర్‌ (ఎర్రగడ్డ) 'ఈఎస్‌ఐ బోధనాసుపత్రి'కి ఇవ్వాలని వీలునామా రాశారు. ఆమె కోరిక మేరకు ఛాయాదేవి పార్థివ దేహాన్ని ఈఎస్‌ఐ బోధనాసుపత్రికి అప్పగించినట్లు సీఆర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి సి.కె.రావు తెలిపారు.


__._,_.___

Posted by: Srini Nagul <srini_nagul@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: