[racchabanda] రత్నాల సరాలు #atnAla sarAlu#

 

రత్నాల సరాలు - 

మొదటి మూడు పాదములు -  6 - 8 (4/4, 5/3, 3/5) మాత్రలు 
నాలుగవ పాదము - కనీసము 8 మాత్రలు 

చూడుమటం - జుక్కల నెన్నో 
నేఁడమాస - నింగిని జీఁకటి 
రాఁడు గదా - రమణుఁడు నాదరి 
తోడు లేదుగా 

నగవులతో - నవమ్ముగను రా 
తగవెందుకు - దారుణమ్ముగా 
మొగమొక స-మ్ముదంపు విరిగా 
సుగమీయఁగ రా 
(ఇందులో మొదటి రెండు పాదములు ఒక చంపకమాల పాదమునకు, చివరి రెండు పాదములు ఒక నర్కుటకపు పాదమునకు సరిపోతాయి.)

రాగములో - రసమ్ము కిరవై 
రావెందుకు - రత్నమాలికా 
భోగములో - ముదమ్ము నొసఁగన్ 
భాగమ్ముగ రా 
(ఇందులో ఉత్పలమాల, శైలశిఖల చాయలు ఉన్నాయి.) 

సుందరమగు - సురభోగమ్ముల 
వందలుగా - పాటల మత్తుల 
చందనముల - శశికిరణమ్ముల  
విందులుగా రా 

ఆకాశపు - టంచులలోఁగల 
శ్రీకాంతులఁ - జిందిడు తారా 
నీకోసమె - నేనుంటినిగా 
నేకాకినిగా 

ముందున్నవి - ముండ్లకంపలు(లూ)
పందుల యా - పంకపు వాసన 
ఇందులకా - యిహమున బుట్టితి 
నెందుకు బ్రతుకో 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ratnAla sarAlu - 

modaTi mUDu pAdamulu -  6 - 8 (4/4, 5/3, 3/5) mAtralu 
nAlugava pAdamu - kanIsamu 8 mAtralu 

chUDumaTaM - jukkala nennO 
nE@MDamAsa - niMgini jI@MkaTi 
rA@MDu gadA - ramaNu@MDu nAdari 
tODu lEdugA 

nagavulatO - navammuganu rA 
tagaveMduku - dAruNammugA 
mogamoka sa-mmudaMpu virigA 
sugamIya@Mga rA 
(iMdulO modaTi reMDu pAdamulu oka chaMpakamAla pAdamunaku, chivari reMd'u pAdamulu oka narkuTakapu pAdamunaku saripOtAyi.)

rAgamulO - rasammu kiravai 
rAveMduku - ratnamAlikA 
bhOgamulO - mudammu nosa@Mgan 
bhAgammuga rA 
(iMdulO utpalamAla, SailaSikhala cAyalu unnAyi.) 

suMdaramagu - surabhOgammula 
vaMdalugA - pATala mattula 
chaMdanamula - SaSikiraNammula  
viMdulugA rA 

aakASapu - TaMchulalO@Mgala 
SrIkAMtula@M - jiMdiDu tArA 
nIkOsame - nEnuMTinigA 
nEkAkinigA 

muMdunnavi - muMDlakaMpalu(lU)
paMdula yA - paMkapu vAsana 
iMdulakA - yihamuna buTTiti 
neMduku bratukO 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: