[racchabanda] నటచరణ #naTacharaNa#

 

నటచరణ - 

ఆధారము - అజ్ఞాతకవికృత రత్నమంజూష 
(పింగళుని త్రిక గణములను అనుసరించక స్వతంత్రముగా క్రొత్త గణములను సృష్టించిన ఇరువురిలో ఇతడొకడు, మఱొకరు జ(జా)నాశ్రయి కర్త.)
గణములు - మూడు చతుర్మాత్రలు (ఏవైనా), పాదాంతగురువు

కటకమ్ముల నందెల ధీం 
కిటధీంకిటలాడెడు యా  
నటచరణమ్ములఁ గనఁగా 
మటుమాయము సర్వమ్మున్ 

నవనీతము నీ కృపయే 
నవమౌ నటనలు బ్రతుకే 
భవబంధమోచనా రా 
నవముగఁ జేయఁగ నన్నున్ 

చంద్రునివలె వృత్తపు టా
కేంద్రములో నుందువుగా 
సంద్రములో నలలుగా నా-
మంద్రపుసడి దెసలందున్ 

వాసన చూడని పూవా 
బాసట కానని తీవా 
రాసకి సుగమీయంగా 
రాసపు మధు వొలుకంగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
naTacharaNa - 

aadhAramu - aj~nAtakavikRta ratnamaMjUsha 
(piMgaLuni trika gaNamulanu anusariMchaka svataMtramugA krotta gaNamulanu sRshTiMchina iruvurilO itaDokaDu, ma~rokaru ja(jA)nASrayi karta.)
gaNamulu - mUDu chaturmAtralu (EvainA), pAdAMtaguruvu

kaTakammula naMdela dhIM 
kiTadhIMkiTalADeDu yA  
naTacharaNammula@M gana@mgA 
maTumAyamu sarvammun 

navanItamu nI kRpayE 
navamau naTanalu bratukE 
bhavabaMdhamOchanA rA 
navamuga@M jEya@Mga nannun 

chaMdrunivale vRttapu TA
kEMdramulO nuMduvugA 
saMdramulO nalalugA nA-
maMdrapusaDi desalaMdun 

vAsana chUDani pUvA 
bAsaTa kAnani tIvA 
rAsaki sugamIyaMgA 
rAsapu madhu volukaMgA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: