[racchabanda] పంచమాత్రల సీసము, తేటగీతి #paMchamAtrala sIsamu, tETagIti#

 

పంచమాత్రల సీసము, తేటగీతి - 

శ్రీరామ రఘురామ - శృంగార రామ నా 
ఆరాధ్య దైవమా - అంబుజాక్ష 
వారములు వర్షములు - బ్రతుకులోఁ బూర్తి యయె 
నేరమ్ము లెన్నియో - నేను జేయ 
వారాశి జీవనము - భంగము లభంగముగఁ 
దీరమ్ము గనఁబడదు - దేవదేవ 
ఘోర పాపిని నేను - గోరిక యదొక్కటే 
నీరమ్య రూపమును - నీవు జూపు 

హారములు నాతలంపులే - అమలహృదయ 
మేరలేనట్టి ప్రేమతో - మేనిఁ దాఁకు 
భారములు తగ్గఁ బులకింతు - వ్యధలు లేక 
ధారుణీతనయ చెప్పుమా - ధవునితోడ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
paMchamAtrala sIsamu, tETagIti - 

SrIrAma raghurAma - SRMgAra rAma nA 
aarAdhya daivamA - aMbujAxa 
vAramulu varshamulu - bratukulO@M bUrti yaye 
nErammu lenniyO - nEnu jEya 
vArASi jIvanamu - bhaMgamu labhaMgamuga@M 
dIrammu gana@MbaDadu - dEvadEva 
ghOra pApini nEnu - gOrika yadokkaTE 
nIramya rUpamunu - nIvu jUpu 

hAramulu nAtalaMpulE - amalahRdaya 
mEralEnaTTi prEmatO - mEni@M dA@Mku 
bhAramulu tagga@M bulakiMtu - vyadhalu lEka 
dhAruNItanaya cheppumA - dhavunitODa 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: