[racchabanda] శతదళషట్పది #SatadaLashaTpadi#

 

శతదళషట్పది - 

రత్నాల సరాలలో మొదటి మూడు పాదములలో 3 X (6 +8) = 42 మాత్రలు ఉంటాయి, చివరి పాదములో కనీసము 8 మాత్రలు. మొత్తము 50 మాత్రలు గల రత్నాలసరములు రెండింటిని చేర్చి ఒక షట్పదిని కల్పించ వీలగును. దీనికి నేను శతదళ షట్పది అని పేరుంచాను. క్రింద రెండు శతదళ షట్పదులు - 

శతదళ షట్పది - (6+8) + (6+8) + (6+8 + 8) మాత్రలు 

మాయావన-మందున హరిణీ 
నాయాశా-నగవిహారిణీ 
రాయంచకు - రాసము నేర్పెడు - ప్రాయమ్మిదియో 
మాయమ్మగు - మనసునఁగల యీ 
గాయమ్ములు - కరములు దాఁకన్ 
రాయతివా - రతిచిత్రములన్ - వ్రాయన్ ద్వరగా 

పంకజ మా - వదన మ్మదియును 
బంకజ మా - పదములు రెండును 
బంకజ మా - వర నేత్రమ్ములు - పంకజహస్తా 
శంకవలదు - శంకరమిత్రా 
సంకటముల - స్వామీ మాన్పుము 
బింకమేల - ప్రేమను గనురా - వేంకటేశ్వరా  

వీటిని రత్నాల సరాలుగా కూడ వ్రాయ వచ్చును.. ఒక ఉదాహరణము - 

పంకజ మా - వదన మ్మదియును 
బంకజ మా - పదములు రెండును 
బంకజ మా - వర నేత్రమ్ములు  
పంకజహస్తా 

శంకవలదు - శంకరమిత్రా 
సంకటముల - స్వామీ మాన్పుము 
బింకమేల - ప్రేమను గనురా 
వేంకటేశ్వరా  

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
SatadaLashaTpadi - 

ratnAla sarAlalO modaTi mUDu pAdamulalO #3 X (6 +8) = 42# mAtralu uMTAyi, chivari pAdamulO kanIsamu 8 mAtralu. mottamu 50 mAtralu gala ratnAlasaramulu reMDiMTini chErchi oka ShaTpadini kalpiMcha vIlagunu. dIniki nEnu SatadaLa shaTpadi ani pEruMchAnu. kriMda reMDu SatadaLa ShaTpadulu - 

SatadaLa shaTpadi - (6+8) + (6+8) + (6+8 + 8) mAtralu 

mAyAvana-maMduna hariNI 
nAyASA-nagavihAriNI 
rAyaMchaku - rAsamu nErpeDu - prAyammidiyO 
mAyammagu - manasuna@Mgala yI 
gAyammulu - karamulu dA@Mkan 
rAyativA - ratichitramulan - vrAyan dvaragA 

paMkaja mA - vadana mmadiyunu 
baMkaja mA - padamulu reMDunu 
baMkaja mA - vara nEtrammulu - paMkajahastA 
SaMkavaladu - SaMkaramitrA 
saMkaTamula - svAmI mAn&pumu 
biMkamEla - prEmanu ganurA - vEMkaTESvarA  

vITini ratnAla sarAlugA kUDa vrAya vachchunu. oka udAharaNamu - 

paMkaja mA - vadana mmadiyunu 
baMkaja mA - padamulu reMDunu 
baMkaja mA - vara nEtrammulu  
paMkajahastA 

SaMkavaladu - SaMkaramitrA 
saMkaTamula - svAmI mAn&pumu 
biMkamEla - prEmanu ganurA 
vEMkaTESvarA  

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: