[racchabanda] తేటగీతిలో అంత్యప్రాసలు #tETagItilO aMtyaprAsalu#

 

తేటగీతిలో అంత్యప్రాసలు - 

తేటగీతిలోని యతికి ముందు ఉండే ఇంద్ర గణములోని పదమునకు చివరి సూర్య్గ గణమునకు అంత్య ప్రాసను ఉంచి వ్రాస్తే పాడుకొనుటకు బాగుంటుంది. క్రింద కొన్ని ఉదాహరణములు - 

నాదమేగదా వరములు - నవ రవములు 
మోదమేగదా పులకలు - పువు మొలకలు 
హ్లాదమేగదా సరసము - లతి సురసము 
శ్రీదమేగదా చెలువము - చిఱు గెలువము 

నీలదేహుఁ దనరు  నవ్వు - నెనరు పువ్వు 
గాలిలోని గీతి సడులు - వేల నుడులు 
దినము వాని గనులఁ జూడ - మనసు వేడ 
వనజనేత్రుఁ డెపుడు వచ్చు - వరము లిచ్చు 

మాధవా యన మథనమ్ము - మధురసమ్ము 
కేశవా యన ననిశమ్ము - క్రీడనమ్ము 
అచ్యుతా యన నమరమ్ము - హర్షణమ్ము 
యాదవా యన జీవమ్ము - లనుపమమ్ము 

విధేయుదు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
tETagItilO aMtyaprAsalu - 

tETagItilOni yatiki muMdu uMDE iMdra gaNamulOni padamunaku chivari sUryga gaNamunaku aMtya prAsanu uMchi vrAstE pADukonuTaku bAguMTuMdi. kriMda konni udAharaNamulu - 

nAdamEgadA varamulu - nava ravamulu 
mOdamEgadA pulakalu - puvu molakalu 
hlAdamEgadA sarasamu - lati surasamu 
SrIdamEgadA cheluvamu - chi~ru geluvamu 

nIladEhu@M danaru  navvu - nenaru puvvu 
gAlilOni gIti saDulu - vEla nuDulu 
dinamu vAni ganula@M jUDa - manasu vEDa 
vanajanEtru@M DepuDu vachchu - varamu lichchu 

mAdhaVA yana mathanammu - madhurasammu 
kESavA yana naniSammu - krIDanammu 
achyutA yana namarammu - harshaNammu 
yAdavA yana jIvammu - lanupamammu 

vidhEyudu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: