[racchabanda] ఉత్సాహ, తేటగీతులతో అర్ధసమగీతి #utsAha, tETagItulatO ardhasamagIti#

 

ఉత్సాహ, తేటగీతులతో అర్ధసమగీతి - 

రెండు ఇంద్ర గణములను మూడు సూర్య గణములుగా వ్రాయ వీలగును. అదెట్లనిన - పక్క పక్కన రెండు ఇంద్ర గణములను 36 విధములుగా నుంచవచ్చును. అందులో క్రింది నాలుగు అమరికలు మూడు సూర్య గణములకు దారి తీస్తాయి. 

IIII IIUI = III III UI
IIIU IIII = III UI III
UII IIUI  = UI III UI
UIU IIII = UI UI III

ఈ అమరికలతో ఆటవెలది బేసి పాదములు, తేటగీతి పాదములు (యతి స్థానములు వేఱైనా) ఆఱు సూర్య గణములతో ఉంటాయి. ఈ ఉపోద్ఘాతముతో ఒక అర్ధసమగీతిని మీకు ఈ రోజు పరిచయము చేస్తున్నాను. బేసి పాదములలో ఉత్సాహ, సరి పాదములలో తేటగీతి పాదములు ఈ అర్ధసమగీతిలో. తేటగీతిలోని రెండు ఇంద్ర గణములను పైన వివరించిన రీతిగా వ్రాస్తే మనకు పద్యమంతా త్ర్యస్రగతితో. అనగా మూడు మాత్రలతో, ఉంటుంది. క్రింద అలా ఉంచి వ్రాసిన వాటికి, అలా ఉంచక వ్రాసిన వాటికి నా ఉదాహరణములు - 

నిన్ను జూడ వేచియుంటి - నీవు రమ్ము వేగమే 
వెన్న మనసు కరుగ నిమ్ము - ప్రేమతోడ (IIII IIUI)
సన్నుతించుచుందుఁ గదర - శరణనుచును నిన్ను నే 
వన్నెకాఁడ వ్యధలతోడ - వాడిపోతి (UII IIUI)

ఏమి జీవితమ్మొ యిదియు - నిట్టులుంటిఁ బుడమిపై 
స్వామికొఱకుఁ దపనతోడ - సాగుచుంటి (IIII IIUI)
స్వామి రాఁడు సరస నెపుడు - వదనమందు నవ్వుతో 
లేమి బ్రతుకు లేదు ముదము - లేదు కోర్కె (IIIU IIII)

వేదనలను బాపుమయ్య - వేంకటేశ కరుణతో 
నాదమయుఁడ నీవెప్పుడు - నాకుఁ దోడు 
ఖేదమందు మోదమందుఁ - గృష్ణ యనఁగఁ జాలుఁగా 
బాధలన్ని మాయమ్మగు - భవమునందు 

చెట్టులెల్లఁ బచ్చగాను - శ్రీలఁ జూపెఁ బూలతో 
పిట్టలెన్నొ పిలిచెనుగా - ప్రియతములన్ 
గట్టుపైనఁ గలకలమని - కామినులు హసించఁగా 
నట్టు లిట్టు లాడిరి పిల్ల - లందఱిందు 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
utsAha, tETagItulatO ardhasamagIti - 

reMDu iMdra gaNamulanu mUDu sUrya gaNamulugA vrAya vIlagunu. adeTlanina - pakka pakkana reMDu iMdra gaNamulanu 36 vidhamulugA nuMchavaccunu. aMdulO kriMdi nAlugu amarikalu mUDu sUrya gaNamulaku dAri tIstAyi. 
#
IIII IIUI = III III UI
IIIU IIII = III UI III
UII IIUI  = UI III UI
UIU IIII = UI UI III
#
ee amarikalatO aaTaveladi bEsi pAdamulu, tETagIti pAdamulu (yati sthaanamulu vE~rainA) aa~ru sUrya gaNamulatO uMTAyi. ee upOdghAtamutO oka ardhasamagItini mIku ee rOju parichayamu chEstunnAnu. bEsi pAdamulalO utsAha, sari pAdamulalO tETagIti pAdamulu ee ardhasamagItilO. taeTagItilOni reMDu iMdra gaNamulanu paina vivariMchina rItigA vrAstE manaku padyamaMtA tryasragatitO. anagA mUDu mAtralatO, uMTuMdi. kriMda alA uMchi vrAsina vATiki, alA uMchaka vrAsina vATiki nA udAharaNamulu - 

ninnu jUDa vEchiyuMTi - nIvu rammu vEgamE 
venna manasu karuga nimmu - prEmatODa (#IIII IIUI#)
sannutiMchuchuMdu@M gadara - SaraNanuchunu ninnu nE 
vannekA@MDa vyadhalatODa - vADipOti (#UII IIUI#)

Emi jIvitammo yidiyu - niTTuluMTi@M buDamipai 
svAmiko~raku@M dapanatODa - sAguchuMTi (#IIII IIUI#)
svAmi rA@MDu sarasa nepuDu - vadanamaMdu navvutO 
lEmi bratuku lEdu mudamu - lEdu kOrke (#IIIU IIII#)

vEdanalanu bApumayya - vEMkaTESa karuNatO 
nAdamayu@MDa nIveppuDu - nAku@M dODu 
khEdamaMdu mOdamaMdu@M - gRshNa yana@Mga@M jAlu@MgA 
bAdhalanni mAyammagu - bhavamunaMdu 

cheTTulella@M bachchagAnu - SrIla@M jUpe@M bUlatO 
piTTalenno pilichenugA - priyatamulan 
gaTTupaina@M galakalamani - kAminulu hasiMcha@MgA 
naTTu liTTu lADiri pilla - laMda~riMdu 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: