[racchabanda] రచ్చబండ కవితలు

 

Charging

 

కాటన్ షర్ట్, షార్ట్స్ వేసుకుని

కామ్ గా ఆరామ్ గా ఉన్నాను.  

సాయంకాలం! అబ్బో! ఇంకా చాలా గంటలుంది;

ఏడింటికి కూడా ఎండ ఉంటూంది.

ఏం తొందర! బైటికి వెళ్లేందుకు!

 

సాయంత్రం ఉంది -ఎంతో అందమైన సంధానమే!

I look forward to our meeting - అన్న సమాగమమే!

ఐనా ఈ లోపల అతి చక్కని కాండోలో ఈ ఎండ

నేను దండగ అనుకోను. అలా నే విరహించను ప్రియా!

 

కావచ్చు, నువ్వూ నేనూ కలిసినప్పుడు

కరువు తీరా మనం కౌగిలించొచ్చు;

కడుపారా తినొచ్చు, తాగొచ్చు.

 

కానీ ఇప్పటి ఈ ఏకాంతం,

ఈ స్లోయింగ్ డౌన్,   

నేనే ఆఘ్రాణించే నా జుట్టు సుగంధాల కాముకత

నాతోనే ఈ నా సన్నిహిత సమయం

నాకత్యంత ప్రియం. 


- Lyla


__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (168)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: