[racchabanda] అర్ధసమ వృత్తముగా మానిని #ardhasama vRttamugA mAnini#

 

అర్ధసమ వృత్తముగా మానిని - 

మానినిని సంస్కృతములో మదిరా అంటారు. పురాతన సంస్కృత కవులెవ్వరు ఈ వృత్తమును వాడినట్లు లేదు. కన్నడములో నాగవర్మ దీనిని వనమంజరి అని పిలిచినాడు. తెలుగులో ఈ మానిని పేరు ఎప్పుడు ఎవరు పెట్టారో అన్నది ఊహాజనకము. నన్నయ వృత్తౌచిత్యమును పాటించి దుష్యంతుడు కణ్వాశ్రమమును సమీపించే సమయములో ఏచి తనర్చి తలిర్చిన ప్రోవుల .. అనే పద్యమును వ్రాసినాడు. మానిని యైన శకుంతలను దర్శించుటకు సూచనగా ఈ వృత్తములో వ్రాసినాడని నా ఊహ. నన్నెచోడుడు ముద్రాలంకారములో ఈ వృత్తమును వాడియున్నాడు. నన్నయాదులు ఒక్క యతిని వాడినారు. తిక్కన ఒక్క యతిని, మూడు యతులను వాడెను. కాని ప్రాస యతిని ఎవ్వరు వాడియున్నట్లు లేదు. అంతే కాక వరణమును (రెండు లఘువుల వంతెన) ఉపయోగించి పూర్వోత్తర భాగములను కలిపి వ్రాసినట్లు కూడ దాఖలాలు లేవు. నేను ఒకప్పుడు మానినితో కొన్ని కసరత్తులు చేసియున్నాను! ఈ రోజు మానినివంటి వృత్తములను అర్ధసమ వృత్తములుగా వ్రాయు పద్ధతిని తెలుపుతున్నాను. ఇందులో ప్రథమార్ధములో నాలుగు భ-గణములకు అక్షర సామ్య యతి, అదే విధముగా ద్వితీయార్ధములో మూడవ గణముపైన వడి. ఈ రెండు భాగములకు ప్రాసను ఉంచినప్పుడు మనకు ఒక అర్ధసమ వృత్తము జనిస్తుంది. ఈ సిద్ధాంతము నా ఉద్దేశములో చాల ముఖ్యమైనది. తెలుగులో షట్పదులు లేకున్నా కూడ, షట్పదుల అమరికతో ఇట్టి అర్ధసమ వృత్తములు ఉన్నాయి. అవి కావ్యములలో లేవు. పాటలలో ఉన్నాయి. అన్నమాచార్యులు, రామదాసు వంటి వాగ్గేయకారులు ఈ పద్ధతిలో మాత్రాగణములతో పాటలను వ్రాసియున్నారు. 

అర్ధసమ వృత్తముగా మానిని - 

రమ్మిట మానిని - రమ్యము రాతిరి 
యిమ్ముగ నుండఁగ - నిష్టసఖీ 
కమ్మని మాటలు - కన్నుల సైగలు 
గుమ్మను తావులు - కోమలమే 
సొమ్ముల వేలకో - సుందరి యుండఁగఁ  
జిమ్ముచు నందము - చిత్రముగా 
నిమ్మహి నామని - యెప్పుడు నీదరి 
కొమ్మల పాడెడు - కోకిలలే 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ardhasama vRttamugA mAnini - 

mAninini saMskRtamulO madirA aMTAru. purAtana saMskRta kavulevvaru ee vRttamunu vADinaTlu lEdu. kannaDamulO nAgavarma dInini vanamaMjari ani pilichinADu. telugulO ee mAnini pEru eppuDu evaru peTTArO annadi UhAjanakamu. nannaya vRttauchityamunu pATiMchi dushyaMtuDu kaNvASramamunu samIpiMchE samayamulO Echi tanarchi talirchina prOvula .. anE padyamunu vrAsinADu. mAnini yaina SakuMtalanu darSiMchuTaku sUchanagA ee vRttamulO vrAsinADani nA Uha. nannechODuDu mudrAlaMkAramulO ee vRttamunu vADiyunnADu. nannayAdulu okka yatini vADinAru. tikkana okka yatini, mUDu yatulanu vADenu. kAni prAsa yatini evvaru vADiyunnaTlu lEdu. aMtE kAka varaNamunu (reMDu laghuvula vaMtena) upayOgiMchi pUrvOttara bhAgamulanu kalipi vrAsinaTlu kUDa dAkhalAlu lEvu. nEnu okappuDu mAninitO konni kasarattulu chEsiyunnAnu! ee rOju mAninivaMTi vRttamulanu ardhasama vRttamulugA vrAyu paddhatini teluputunnaanu. iMdulO prathamArdhamulO nAlugu bha-gaNamulaku axara sAmya yati, adE vidhamugA dvitIyArdhamulO mUDava gaNamupaina vaDi. ee reMDu bhaagamulaku prAsanu uMchinappuDu manaku oka ardhasama vRttamu janistuMdi. ee siddhAMtamu naa uddESamulO chAla mukhyamainadi. telugulO shaTpadulu lEkunnA kUDa, shaTpadula amarikatO iTTi ardhasama vRttamulu unnAyi. avi kAvyamulalO lEvu. pATalalO unnAyi. annamAchaaryulu, rAmadAsu vaMTi vAggEyakArulu ee paddhatilO mAtrAgaNamulatO pATalanu vraasiyunnAru. 

ardhasama vRttamugA mAnini - 

rammiTa mAnini - ramyamu rAtiri 
yimmuga nuMDa@mga - nishTasakhI 
kammani mATalu - kannula saigalu 
gummanu tAvulu - kOmalamE 
sommula vElakO - suMdari yuMDa@Mga@M  
jimmuchu naMdamu - chitramugA 
nimmahi nAmani - yeppuDu nIdari 
kommala pADeDu - kOkilalE 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: