[racchabanda] సార్థకనామ గణాక్షర వృత్తము నవాహార #sArthakanAma gaNAxara vRttamu navAhAra#

 

సార్థకనామ గణాక్షర వృత్తము నవాహార - 

ఆధారము - కల్పితము 

నవాహార - న/వ/వ/హ/హ/ర - న/జ/త/ర/లగ IIII UIUUI - UIUIU
14 శక్వరి 5424 

మధురతరమ్ము హాసమ్ము - మంగళమ్మిడున్ 
మృదువగు నా నవాహార - మింపు నిచ్చు నా 
హృదయము మెత్తనౌ వెన్న - ప్రేమ కిల్లు నే 
వదలను వాని శ్రీపాద - పంకజమ్ములన్ 

ఎగురుచునుండెఁ జూడంగ  - నెల్ల లేక యా 
గగనమునందు హారమ్ము-గాను బిత్సువుల్ 
సుగమిడు కాంతిపుంజమ్ము - సుందరమ్ము నీ 
మొగమొక తోయజమ్మయ్యె - మోహనమ్ముగా 

వదనమునందు నీబాధ - వానికోసమా 
ముదమును వీడి యీరాత్రి - పూఁట నేడ్తువా 
బధిరుఁడు శంఖనాదమ్ము - వానికెందుకే 
పద చెలి నృత్యమాడంగ - పాలవెన్నెలన్ 

హృదయమునందు నెవ్వాఁడు - నృత్యమాడెనో 
వదనమునందు పీయూష - వర్షబిందువుల్ 
మృదులముగాను నీవీణ - మేళవింతువా 
మదనుని రాగగీతాల - మాధురిన్ సకీ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
sArthakanAma gaNAxara vRttamu navAhAra - 

aadhAramu - kalpitamu 

navAhAra - na/va/va/ha/ha/ra - na/ja/ta/ra/laga #IIII UIUUI - UIUIU#
14 Sakvari 5424 

madhuratarammu hAsammu - maMgaLammiDun 
mRduvagu nA navAhAra - miMpu nichchu nA 
hRdayamu mettanau venna - prEma killu nE 
vadalanu vAni SrIpAda - paMkajammulan 

eguruchunuMDe@M jUDaMga  - nella lEka yA 
gaganamunaMdu hArammu-gAnu bitsuvul 
sugamiDu kAMtipuMjammu - suMdarammu nI 
mogamoka tOyajammayye - mOhanammugA 

vadanamunaMdu nIbAdha - vAnikOsamA 
mudamunu vIDi yIrAtri - pU@MTa nEDtuvA 
badhiru@MDu SaMkhanAdammu - vAnikeMdukE 
pada cheli nRtyamADaMga - pAlavennelan 

hRdayamunaMdu nevvA@MDu - nRtyamADenO 
vadanamunaMdu pIyUsha - varshabiMduvul 
mRdulamugAnu nIvINa - mELaviMtuvA 
madanuni rAgagItAla - mAdhurin sakI 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: