[racchabanda] తత (లలిత) #tata (lalita)#

 

తత (లలిత) - 

ఆధారము - పింగళ ఛందస్సు, వృత్తరత్నాకరము
(తతము అంటే గాలి)

తత (లలిత) - న/న/మ/ర IIII IIU - UU UIU
12 జగతి 1088

మిలమిల మెఱిసెన్ - మింటన్ మేఘముల్ 
తళతళ మనె నా - తారా చంద్రులున్ 
మెలమెల తతముల్ - మేలై వీచఁగా 
కిలకిల మనియెన్ - గృష్ణుం డప్పుడే 

లలితముగద నీ - లాస్యమ్ముల్ హరీ 
లలితముగద నీ - లావణ్యమ్ములున్ 
లలితముగద నీ - రమ్యాకారముల్ 
లలితముగద యీ - రాత్రుల్ నీదరిన్ 

వనజనయన నా - ప్రాణమ్మీవెగా 
దినము రజని యా - తేనెల్ చాలుగా 
ప్రణయసరసిలోఁ - బద్మమ్మైతి నేఁ  
గనఁగ రవిని స-త్కాంతుల్ చిమ్మఁగా 

పవనముగ తృణా-వర్తుం డాతఱిన్ 
గువకువమను యా - కూనన్ మ్రుచ్చిలన్ 
బవనుని కొక పె-న్భారమ్మై ధరన్ 
జవమున దునిమెన్ - సర్వుల్ మెచ్చఁగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
tata (lalita) - 

aadhAramu - piMgaLa ChaMdassu, vRttaratnAkaramu
(tatamu aMTE gAli)

tata (lalita) - na/na/ma/ra #IIII IIU - UU UIU#
12 jagati 1088

milamila me~risen - miMTan mEghamul 
taLataLa mane nA - tArA chaMdrulun 
melamela tatamul - mElai vIcha@MgA 
kilakila maniyen - gRShNuM DappuDE 

lalitamugada nI - lAsyammul harI 
lalitamugada nI - lAvaNyammulun 
lalitamugada nI - ramyAkAramul 
lalitamugada yI - rAtrul nIdarin 

vanajanayana nA - prANammIvegA 
dinamu rajani yA - tEnel chAlugA 
praNayasarasilO@M - badmammaiti nE@M  
gana@Mga ravini sa-tkAMtul chimma@mgA 

pavanamuga tRNA-vartuM DAta~rin 
guvakuvamanu yA - kUnan mruchchilan 
bavanuni koka pe-n&bhArammai dharan 
javamuna dunimen - sarvul mecca@MgA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: