[racchabanda] త్రిభంగిగా చంపకమాల #tribhaMgigA chaMpakamAla#

 

త్రిభంగిగా చంపకమాల - 

చంపకమాల - 
సకి సరసమ్ముతోడ విర-సమ్ము వినా సురసమ్ము నీయవా 
సకి వరుసమ్ము నిండ పరు-సమ్ములతోఁ బరుసమ్ము నీవెగా 
సకి జలజమ్ము మోము వల-జమ్మున నాకుటజమ్ము దాల్చి రా 
సకి నిమిషమ్ములోనఁ దరి-షమ్మువలెన్ హరుషమ్ము నింపవా 

త్రిభంగిలో మూడు అంత్యప్రాసలు ఉంటాయి. 

త్రిభంగిగా - 

సకి 
సరసమ్ముతోడ 
విరసమ్ము వినా 
సురసమ్ము నీయవా 
(సురసము = తీయదనము)

సకి 
వరుసమ్ము నిండ 
పరుసమ్ములతోఁ 
బరుసమ్ము నీవెగా 
(చివరి పరుసము = పరుసవేది)

సకి
జలజమ్ము మోము 
వలజమ్మున నా
కుటజమ్ము దాల్చి రా 
(వలజము = వాకిలి)

సకి 
నిమిషమ్ములోనఁ 
దరిషమ్మువలెన్ 
హరుషమ్ము నింపవా 
(తరిషము = సముద్రము) 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
tribhaMgigA chaMpakamAla - 

chaMpakamAla - 
saki sarasammutODa vira-sammu vinA surasammu nIyavA 
saki varusammu niMDa paru-sammulatO@M barusammu nIvegA 
saki jalajammu mOmu vala-jammuna nAkuTajammu dAlchi rA 
saki nimishammulOna@M dari-shammuvalen harushammu niMpavA 

tribhaMgilO mUDu aMtyaprAsalu uMTAyi.  

tribhaMgigA - 

saki 
sarasammutODa 
virasammu vinA 
surasammu nIyavA 
(surasamu = tIyadanamu)

saki 
varusammu niMDa 
parusammulatO@M 
barusammu nIvegA 
(chivari parusamu = parusavEdi)

saki
jalajammu mOmu 
valajammuna nA
kuTajammu dAlchi rA 
(valajamu = vAkili)

saki 
nimishammulOna@M 
darishammuvalen 
harushammu niMpavA 
(tarishamu = samudramu) 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: