[racchabanda] వృత్తములతో షట్పది #vRttamulatO shaTpadi#

 

వృత్తములతో షట్పది - 

షట్పది అనగా ఏమి? ఆఱు పాదములు గలదానిని షట్పది అంటారు. అది తుమ్మెద కావచ్చు, పద్యము కావచ్చు! షట్పది కన్నడములో అతి ప్రాచుర్యమును పొందిన ఛందస్సు. భారతమువంటి కావ్యములు ఈ ఛందస్సులో వ్రాయబడినవి. షట్పదిలో మొదటి మూడు పాదములవలె చివరి మూడు పాదములు ఉంటాయి. మొట్టమొదట ఈ షట్పది అంశ లేక ఉపగణములపైన ఆధారపడి ఉండినవి. కాని తఱువాతి కాలములో ఇది పూర్తిగా మాత్రాబద్ధము. అందువలన ఇందులో తాళము ప్రధానాంశము. ముఖ్యముగా మూడు, నాలుగు, ఐదు, ఏడు మాత్రలపైన ఆధారపడినవి ఇవి; అనగా త్ర్యస్ర, చతురస్ర, ఖండ, మిశ్రగతులను ఇందులో మనము చూడవచ్చును. 

1,2,4,5 పాదములలో n మాత్రల సంఖ్య
3,6 - పాదములలో n + (n/2) + 2 మాత్రలు
3,6 పాదములలో చివరి లఘువు గురు తుల్యము. అందువలన రెండు మాత్రలకు రెండు లఘువులు నిషిద్ధము, 

n - 3+3+3+3 మత్రలు - భోగ షట్పది
n - 4 + 4 మాత్రలు - శర షట్పది 
n - 5 + 5 మాత్రలు - కుసుమ షట్పది
n - 3+4 + 3+4 మాత్రలు - భామినీ షట్పది 

ఈ ఆలోచనను మనము తాళ వృత్తములకు కూడ కొనసాగించ వీలగును. అలా చేస్తే మనకు వృత్తములతో షట్పది లభిస్తుంది. ఇలాటిది నాకు తెలిసి ఇంతవఱకు ఎవ్వరు చేయలేదు. ఉదాహరణముగా సురస లేక మధూళిక అనే వృత్తమును తీసికొందామా? ఇది రథోద్ధత వర్గమునకు చెందినది. దీనికి గణములు న/ర/న/ర. క్రింద ఒక ఉదాహరణము - 

సురస లేక మధూళిక - న/ర - న/ర III UIU - III UIU
12 జగతి 1496

మధుర నర్తనా - మధు మురాంతకా 
మదనమోహనా - మధుర చిత్స్వరా 
యదుకులోత్తమా - వ్యధలఁ బాపరా 
హృదయ మీవెరా - మృదుల సుందరా 

దీనిని n = 8 మాత్రలుగా ఉండే వసు షట్పదిగా చేద్దామా?

మధుర నర్తనా  
మధు మురాంతకా 
మదనమోహనా - మధుర రా 
యదుకులోత్తమా  
వ్యధలఁ బాపరా 
హృదయ మీవెరా - మృదుల రా 

క్రింద n = 16 మాత్రలతో ఒక పాదమును తీసికొని వ్రాసిన షట్పది - 

తెలుఁగుతోటలోఁ - దియని గీతికల్ 
చెలువ మొప్పఁగాఁ - జెలఁగి పాడఁగా 
నలరె మానసం - బమితమై ముదం - బలల తీరుగా నెగయఁగా 
పలు సుమ్మము లీ - వనములోఁ సదా 
వెలిఁగె నందమై - విధవిధమ్ముగాఁ 
గలల చిత్ర సం-కలనమో యనన్ - గలిమి వద్దు నా కితరమై 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
vRttamulatO shaTpadi - 

shaTpadi anagA Emi? aa~ru paadamulu galadAnini shaTpadi aMTAru. adi tummeda kAvachchu, padyamu kAvachchu! shaTpadi kannaDamulO ati prAchuryamunu poMdina ChaMdassu. bhAratamuvaMTi kAvyamulu ee ChaMdassulO vrAyabaDinavi. shaTpadilO modaTi mUDu pAdamulavale chivari mUDu pAdamulu uMTAyi. moTTamodaTa ee shaTpadi aMSa lEka upagaNamulapaina aadhArapaDi uMDinavi. kAni ta~ruvAti kAlamulO idi pUrtigA mAtrAbaddhamu. aMduvalana iMdulO tALamu pradhAnAMSamu. mukhyamugA mUDu, nAlugu, aidu, EDu mAtralapaina aadhArapaDinavi ivi; anagA tryasra, chaturasra, khaMDa, miSragatulanu iMdulO manamu chUDavachchunu. 

1,2,4,5 pAdamulalO #n# mAtrala saMkhya
3,6 - pAdamulalO #n + (n/2)# + 2 mAtralu
3,6 pAdamulalO chivari laghuvu guru tulyamu. aMduvalana reMDu mAtralaku reMDu laghuvulu nishiddhamu, 

#n# - 3+3+3+3 matralu - bhOga shaTpadi
#n# - 4 + 4 mAtralu - Sara shaTpadi 
#n# - 5 + 5 mAtralu - kusuma shaTpadi
#n# - 3+4 + 3+4 mAtralu - bhAminI shaTpadi 

ee aalOchananu manamu tALa vRttamulaku kUDa konasAgiMcha vIlagunu. alA chEstE manaku vRttamulatO shaTpadi labhistuMdi. ilATidi nAku telisi iMtava~raku evvaru chEyalEdu. udAharaNamugA surasa lEka madhULika anE vRttamunu tIsikoMdAmA? idi rathOddhata vargamunaku cheMdinadi. dIniki gaNamulu na/ra/na/ra. kriMda oka udAharaNamu - 

surasa lEka madhULika - na/ra - na/ra #III UIU - III UIU#
12 jagati 1496

madhura nartanA - madhu murAMtakA 
madanamOhanA - madhura chitsvarA 
yadukulOttamA - vyadhala@M bAparA 
hRdaya mIverA - mRdula suMdarA 

dInini #n = 8# mAtralugA uMDE vasu shaTpadigA chEddAmA?

madhura nartanA  
madhu murAMtakA 
madanamOhanA - madhura rA 
yadukulOttamA  
vyadhala@M bAparA 
hRdaya mIverA - mRdula rA 

kriMda #n = 16# mAtralatO oka pAdamunu tIsikoni vrAsina shaTpadi - 

telu@MgutOTalO@M - diyani gItikal 
cheluva moppa@MgA@M - jela@Mgi pADa@MgA 
nalare mAnasaM - bamitamai mudaM - balala tIrugA negaya@MgA 
palu summamu lI - vanamulO@M sadA 
veli@Mge naMdamai - vidhavidhammugA@M 
galala chitra saM-kalanamO yanan - galimi vaddu nA kitaramai 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: