[racchabanda] పుట (ప్రహేయము) #puTa (prahEyamu)#

 

పుట (ప్రహేయము) - 

ఆధారము - నాట్యశాస్త్రము, రత్నమంజూష

యతి - తెలుగులో ఏడవ అక్షరము, సంస్కృతములో పాదము 8,4 అక్షరాలుగా  విఱుగుతుంది.. నా ఉద్దేశములో పాదము 8,9 మాత్రలుగా విఱగాలి. అన్నిటికి క్రింద ఉదాహరణములు - 

పుట (ప్రహేయము) - న/న/మ/య 
12 జగతి 576 

IIIIII - UUUIUU విఱుపుతో - 

లలిత కుసుమ - లావణ్యమ్ము నీవా 
కలల కలిమి - కైవల్యమ్ముఁ దేవా 
వెలుఁగు ఝరుల - వేగమ్మందు నావా 
తెలుగు సుడుల - తేనెల్ సింద రావా 

శిలలు పలికె - శిల్పారామమందున్ 
జెలువ మొలికెఁ - జిత్రమ్మైన రీతిన్ 
గలిగె రవము - గమ్మంగాను నాకై 
వెలిఁగె నిచట - ప్రేమజ్యోతి కాంతుల్ 

IIII IIU - UUI UU విఱుపుతో - 

హృదయ సరసిలో - హేమాబ్జ మీవా 
ముదపు నగరిలోఁ - బూదోట నీవా 
మదిర నురువులో - మైకమ్ము నీవా 
మధుర కవితలో - మాధుర్య మీవా 

హరుసపు నదిలో - నానంద నౌకా 
నెఱ గగనములో - నీ వెల్గు నాకా 
సరసపు సడిలో - ఛందమ్ము నేనా 
చిఱు నగవులలోఁ - జెల్వమ్ము నీవా 

III III UU - UIUU విఱుపుతో (మాలినిలా) - 

రసరహితము నాయీ - ప్రాణ మిందున్ 
విసిగి విసిగి నీకై - వేగియుంటిన్ 
విసముఁ గుడువనా నీ - ప్రేమకై నేన్  
హసిత ముఖము చూపన్ - హారి రావా 

కలల వెలుఁగు రంగుల్ - గాంచుచుంటిన్ 
మెలకువ యిఁక వద్దే - మిథ్య యౌనే 
సలలితము రవమ్ముల్ - చాలు నాకీ  
కలయు నిజమె యెప్డున్ - గాడుచుండున్ 

సూచన - 
న/న/మ/య - పుట
న/న/మ/య/య - మాలిని
న/న/మ/య/య/య - నీలశార్దూలము

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
puTa (prahEyamu) - 

aadhAramu - nATyaSAstramu, ratnamaMjUsha

yati - telugulO EDava axaramu, saMskRtamulO pAdamu 8,4 axarAlugaa vi~rugutuMdi. nA uddESamulO pAdamu 8,9 mAtralugA vi~ragAli. anniTiki kriMda udAharan'amulu - 

puTa (prahEyamu) - na/na/ma/ya 
12 jagati 576 

#IIIIII - UUUIUU# vi~ruputO - 

lalita kusuma - lAvaNyammu nIvA 
kalala kalimi - kaivalyammu@M dEvA 
velu@Mgu jharula - vEgammaMdu nAvA 
telugu suDula - tEnel siMda rAvA 

Silalu palike - SilpArAmamaMdun 
jeluva molike@M - jitrammaina rItin 
galige ravamu - gammaMgAnu nAkai 
veli@Mge nichaTa - prEmajyOti kAMtul 

#IIII IIU - UUI UU# vi~ruputO - 

hRdaya sarasilO - hEmAbja mIvA 
mudapu nagarilO@M - bUdOTa nIvA 
madira nuruvulO - maikammu nIvA 
madhura kavitalO - mAdhurya mIvA 

harusapu nadilO - nAnaMda naukA 
ne~ra gaganamulO - nI velgu nAkA 
sarasapu saDilO - ChaMdammu nEnA 
chi~ru nagavulalO@M - jelvammu nIvA 

#III III UU - UIUU# vi~ruputO (mAlinilA) - 

rasarahitamu nAyI - prANa miMdun 
visigi visigi nIkai - vEgiyuMTin 
visamu@M guDuvanA nI - prEmakai nEn  
hasita mukhamu chUpan - hAri rAvA 

kalala velu@Mgu raMgul - gAMchuchuMTin 
melakuva yi@Mka vaddE - mithya yaunE 
salalitamu ravammul - chAlu nAkI  
kalayu nijame yepDun - gADuchuMDun 

sUchana - 
na/na/ma/ya - puTa
na/na/ma/ya/ya - mAlini
na/na/ma/ya/ya/ya - nIlaSArdUlamu

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] మణిరంగ #maNiraMga#

 

మణిరంగ - 

ఆధారము - నాగవర్మ, హేమచంద్రుడు, కేదారభట్టు

మణిరంగ (మణిరాగ) - ర/స/స/గ UIUII - UIIUU
10 పంక్తి 219

మానసమ్మొక - మాయల గూడే 
ధ్యానమందున - దాఁగెను వాఁడే 
గానమందున - గంగగ రాఁడా 
వేణురావముఁ - బ్రేమగ నీఁడా 

పజ్జఁ జేరితిఁ - బ్రాణము నీదే 
ఒజ్జ నీవె ప్ర-భూ మణిరంగా 
గజ్జఁ గట్టుము - గానము నిమ్మో 
ముజ్జగమ్ముల - మోహనమూర్తీ 
(రెండవ పాదములో ప్లుతములోని ఊకారమునకు యతి)

రాగమందను-రాగము నీవే 
భోగమందను-భోగము నీవే 
యోగమందు సు-యోగము నీవే 
వేగ మీయుము - ప్రేమము నాకై 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
maNiraMga - 

aadhAramu - nAgavarma, hEmachaMdruDu, kEdArabhaTTu

maNiraMga (maNirAga) - ra/sa/sa/ga #UIUII - UIIUU#
10 paMkti 219

mAnasammoka - mAyala gUDE 
dhyAnamaMduna - dA@Mgenu vA@MDE 
gAnamaMduna - gaMgaga rA@MDA 
vENurAvamu@M - brEmaga nI@MDA 

pajja@M jEriti@M - brANamu nIdE 
ojja nIve pra-bhU maNiraMgA 
gajja@M gaTTumu - gAnamu nimmO 
mujjagammula - mOhanamUrtI 
(reMDava pAdamulO plutamulOni UkAramunaku yati)

rAgamaMdanu-rAgamu nIvE 
bhOgamaMdanu-bhOgamu nIvE 
yOgamaMdu su-yOgamu nIvE 
vEga mIyumu - prEmamu nAkai 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___