[racchabanda] భుజంగవిజృంభితము - విద్యున్మాల - ప్రణతి #bhujangavijRMbhitamu - vidyunmAla - praNati#

 

భుజంగవిజృంభితము - విద్యున్మాల - ప్రణతి - 

భుజంగవిజృంభితము చాల ప్రాచీనమైన వృత్తము. నాట్యశాస్త్రములో పేర్కొనబడినదిది. అంతే కాదు క్రీస్తు శకము మొదటి శతాబ్దపు మథురా శాసనములో ఈ వృత్తములో పద్యము ఉన్నది. పాదమునకు 26 అక్షరాలు ఉండే ఉత్కృతి ఛందములోనిది. ఈ వృత్తపు విఱుపును ఎవరును గమనించినట్లు లేదు. ఇందులో మూడు భాగములు ఉన్నాయి. మొదటి భాగములో ఒక విద్యున్మాల వృత్తము (వరుసగా 8 గురువులు), రెండవ భాగములో పది లఘువులు, మూడవ భాగములో రెండు పంచ మాత్రలు, ఒక గురువు. విద్యున్మాలకు నాలుగు అక్షరాలకు విఱుపును సామాన్యముగా పాటిస్తారు. అందువలన ఈ వృత్తమునకు మూడు యతులను ఉంచాలి. క్రింద నా ఉదాహరణములు - 

భుజంగవిజృంభితము - మ/మ/త/న/న/న/ర/స/లగ 
UUUU - UUUU - IIIII IIIII - UIU IIUIU
26 ఉత్కృతి 23854849 

పూవుల్ నిండెన్ - మోదమ్మెందున్ - బొరలె నది తరఁగలనఁ - బొంగె నా హృది వెల్లువై  
నీవే నాయీ - నేత్రమ్ముల్గా - నిరుపమము నిశి ఘడియ - నిండె నా శశి ఫుల్లమై    
భావాతీతా - ప్రాణమ్మీవే - పరవశపు టలలు పలు  - పర్వె నీ పరువమ్ములో 
నేవే నాకై - నేనే నీకై - నిరత మిలఁ బ్రణయమున - నృత్యమాడుచు నుందమా 

అంద మ్మీవే - హర్ష మ్మీవే - యనవరత మవనిపయి - నాశతో నల పొంగులై 
బంధ మ్మీవే - భావ మ్మివే - వనరుహపు హృదయమున - వాగ్దళమ్ముల రంగులై 
విందుల్ నీవే - వేద మ్మీవే - పెను వెతల నడుమఁ గడు - ప్రేమఁ జూపితి వమ్మగా 
వందింతున్ నా - ప్రాణ మ్మీవే - ప్రణతులను గొను మెపుడు - భవ్య మీ బ్రదు కిప్పుడున్ 
(ఇది మా అమ్మగారి స్మృతి నివాళిగా వ్రాసినది)

ఇందులోని విద్యున్మాల వృత్తములు - 

పూవుల్ నిండెన్ - మోదమ్మెందున్ 
నీవే నాయీ - నేత్రమ్ముల్గా 
భావాతీతా - ప్రాణమ్మీవే 
నేవే నాకై - నేనే నీకై 

అంద మ్మీవే - హర్ష మ్మీవే 
బంధ మ్మీవే - భావ మ్మివే 
విందుల్ నీవే - వేద మ్మీవే 
వందింతున్ నా - ప్రాణ మ్మీవే 

ఇందులోని రెండవ, మూడవ భాగములతో కూడ వృత్తమును కల్పించ వీలగును. వాటిని క్రింద వ్రాద్దామా?

పొరలె నది తరఁగలనఁ - బొంగె నా హృది వెల్లువై  
నిరుపమము నిశి ఘడియ - నిండె నా శశి ఫుల్లమై    
పరవశపు టలలు పలు  - పర్వె నీ పరువమ్ములో 
నిరత మిలఁ బ్రణయమున - నృత్యమాడుచు నుందమా 

అనవరత మవనిపయి - నాశతో నల పొంగులై 
వనరుహపు హృదయమున - వాగ్దళమ్ముల రంగులై 
పెను వెతల నడుమఁ గడు - ప్రేమఁ జూపితి వమ్మగా 
ప్రణతులను గొను మెపుడు - భవ్య మీ బ్రదు కిప్పుడున్ 

దీని అమరిక - IIIII IIIII - UIU IIUIU 
గణములు - న/న/న/జ/భ/ర 
ఈ గణములతో వృత్తము ఉన్నట్లు కనబడలేదు. దానికి ప్రణతి అని పేరు నుంచినాను. 

ప్రణతి - న/న/న/జ/భ/ర IIIII IIIII - UIU IIUIU 
18 ధృతి 93184

ప్రణతులను గొను మమర - భారతీ వర మందిరా 
వినతులను గొనుము కడు - ప్రేమతో స్వర సుందరా 
మనవి విని చదువులను - మాత నా కొసగంగ రా 
దినము నిశిఁ గొలుతు నిను - దేవి వాగ్రసగంగ రా 

కలలనెడు భువనమునఁ - గల్పవృక్షపు నీడలో 
తెలి నుడుల పదములను - దీయఁగా నిఁక పాడనా 
చెలువములు నన లిడఁగఁ - జిత్రరంగపు మేడలో 
వలపులకు పురి నిడుచు - భావ నాట్యము నాడనా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
bhujangavijRMbhitamu - vidyunmAla - praNati - 

bhujaMgavijRMbhitamu chAla prAchInamaina vRttamu. nATyaSAstramulO pErkonabaDinadidi. aMtE kAdu krIstu Sakamu modaTi SatAbdapu mathurA SAsanamulO ee vRttamulO padyamu unnadi. pAdamunaku 26 axarAlu uMDE utkRti ChaMdamulOnidi. ee vRttapu vi~rupunu evarunu gamaniMchinaTlu lEdu. iMdulO mUDu bhAgamulu unnAyi. modaTi bhAgamulO oka vidyunmAla vRttamu (varusagA 8 guruvulu), reMDava bhAgamulO padi laghuvulu, mUDava bhAgamulO reMDu paMcha mAtralu, oka guruvu. vidyunmAlaku nAlugu axarAlaku vi~rupunu sAmAnyamugA pATistAru. amduvalana ee vRttamunaku mUDu yatulanu uMchAli. kriMda nA udAharaNamulu - 

bhujaMgavijRMbhitamu - ma/ma/ta/na/na/na/ra/sa/laga 
#UUUU - UUUU - IIIII IIIII - UIU IIUIU#
26 utkRti 23854849 

pUvul niMDen - mOdammeMdun - borale nadi tara@Mgalana@M - boMge nA hRdi velluvai  
nIvE nAyI - nEtrammulgA - nirupamamu niSi ghaDiya - niMDe nA SaSi phullamai    
bhAvAtItA - prANammIvE - paravaSapu Talalu palu  - parve nI paruvammulO 
nEvE nAkai - nEnE nIkai - nirata mila@M braNayamuna - nRtyamADuchu nuMdamA 

aMda mmIvE - harsha mmIvE - yanavarata mavanipayi - nASatO nala poMgulai 
baMdha mmIvE - bhAva mmivE - vanaruhapu hRdayamuna - vAgdaLammula raMgulai 
viMdul nIvE - vEda mmIvE - penu vetala naDuma@M gaDu - prEma@M jUpiti vammagA 
vaMdiMtun nA - prANa mmIvE - praNatulanu gonu mepuDu - bhavya mI bradu kippuDun 
(idi mA ammagAri smRti nivALigA vrAsinadi)

iMdulOni vidyunmAla vRttamulu - 

pUvul niMDen - mOdammeMdun 
nIvE nAyI - nEtrammulgA 
bhAvAtItA - prANammIvE 
nEvE nAkai - nEnE nIkai 

aMda mmIvE - harsha mmIvE 
baMdha mmIvE - bhAva mmivE 
viMdul nIvE - vEda mmIvE 
vaMdiMtun nA - prANa mmIvE 

iMdulOni reMDava, mUDava bhAgamulatO kUDa vRttamunu kalpiMcha vIlagunu. vATini kriMda vrAddAmA?

porale nadi tara@Mgalana@M - boMge nA hRdi velluvai  
nirupamamu niSi ghaDiya - niMDe nA SaSi phullamai    
paravaSapu Talalu palu  - parve nI paruvammulO 
nirata mila@M braNayamuna - nRtyamADuchu nuMdamA 

anavarata mavanipayi - nASatO nala poMgulai 
vanaruhapu hRdayamuna - vAgdaLammula raMgulai 
penu vetala naDuma@M gaDu - prEma@M jUpiti vammagA 
praNatulanu gonu mepuDu - bhavya mI bradu kippuDun 

dIni amarika - #IIIII IIIII - UIU IIUIU# 
gaNamulu - na/na/na/ja/bha/ra 
ee gaNamulatO vRttamu unnaTlu kanabaDalEdu. dAniki praNati ani pEru nuMchinAnu. 

praNati - na/na/na/ja/bha/ra #IIIII IIIII - UIU IIUIU# 
18 dhRti 93184

praNatulanu gonu mamara - bhAratI vara maMdirA 
vinatulanu gonumu kaDu - prEmatO svara suMdarA 
manavi vini chaduvulanu - mAta nA kosagaMga rA 
dinamu niSi@M golutu ninu - dEvi vAgrasagaMga rA 

kalalaneDu bhuvanamuna@M - galpavRxapu nIDalO 
teli nuDula padamulanu - dIya@MgA ni@Mka pADanA 
cheluvamulu nana liDa@Mga@M - jitraraMgapu mEDalO 
valapulaku puri niDuchu - bhAva nATyamu nADanA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___