[racchabanda] బుద్బుద #budbuda#

బుద్బుద - 

ఆధారము - నాట్యశాస్త్రము

బుద్బుద - న/జ/ర IIII UIUIU 
9 బృహతి 176

బ్రతుకను బుద్బుదమ్ములో 
గత మొక స్వప్నలోకమా 
మతములు మందు మత్తులా 
జత యొక లేమి రూపమా 

వదనము చంద్ర బింబమా 
ముద మొక పుష్పగుచ్ఛమా 
వ్యధ యొక యగ్నికీలయా 
హృదయము గాజు టద్దమా 

లలితుని ప్రేమదీప్తిలో 
శలభమునైతి మండఁగా 
సులభము కాదు వీడఁగా 
మిలనము ముందు జన్మలో 

మణిమయ హార మెందుకో 
తనువిట సోలుచుండఁగా 
వినఁగను బ్రేమగీతమా 
మనసిట మాడుచుండఁగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
budbuda - 

aadhAramu - nATyaSAstramu

budbuda - na/ja/ra #IIII UIUIU# 
9 bRhati 176

bratukanu budbudammulO 
gata moka svapnalOkamA 
matamulu maMdu mattulA 
jata yoka lEmi rUpamA 

vadanamu chamdra biMbamA 
muda moka pushpaguchChamA 
vyadha yoka yagnikIlayA 
hRdayamu gAju TaddamA 

lalituni prEmadIptilO 
Salabhamunaiti maMDa@MgA 
sulabhamu kAdu vIDa@MgA 
milanamu muMdu janmalO 

maNimaya hAra meMdukO 
tanuviTa sOluchuMDa@MgA 
vina@Mganu brEmagItamA 
manasiTa mADuchuMDa@MgA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#
 
__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] Re: [Chandassu] ఛందస్సులో ఒక ఆట - బిందుమతి #ChaMdassulO

అప్పుడు దీనికి వ్రాసికొన్న పూరణ కనబడలేదు. ఇప్పుడు కొత్తగా వ్రాసినది - 

రమ్ము ప్రేమతో వచ్చి నా-కిమ్ము వేగ 
మోవి ముద్దుల వానను - నోవరాంగి 
రమ్ము ప్రేమతో వచ్చి చో-టిమ్ము నీదు 
మానసమ్మందు నవమధు-మాసమందు 

విధేయుడు - మోహన 
#
appuDu dIniki vrAsikonna pUraNa kanabaDalEdu. ippuDu kottagA vrAsinadi - 

rammu praematO vachchi naa-kimmu vaega 
mOvi muddula vaananu - nOvaraaMgi 
rammu praematO vachchi chO-Timmu needu 
maanasammaMdu navamadhu-maasamaMdu 

vidhEyuDu - mOhana 
#
On Wednesday, February 29, 2012, 10:56:08 AM EST, J. K. Mohana Rao <jkmrao@yahoo.com> wrote:

ఛందస్సులో ఒక ఆట - బిందుమతి

ఈ రోజు లీపు దినము, ఆ దినాన్ని ఆచరిస్తూ ఒక కొత్త ఆట ఆడుదామా?

ఈ ఆటలో బిందుయుక్త అక్షరమును ఒకటి తీసికొందామా.  తెలుగులో ఈ అక్షరము ర.  సంస్కృతములో సామాన్యముగా ఇది దేవనాగరి ఠ. పద్యమన్ని ఈ రకారముతో ఉంటుంది, అనుస్వార మున్నచోట అనుస్వారము, అచ్చులున్నచోట అచ్చులు, ఒత్తు లున్న చోట ర-కారపు ఒత్తులు.  ఈ ఒత్తు అదే అక్షరము, లేక వేరే అక్షరము కావచ్చును  ఉదాహరణకు - 

రంరిరోరు రారు రరిరెరైరరు రారు
రరిరెరైర రేరి రరరు రారు 
రర్రి రరురు రూరు రర్రెరైరరు రారు
రిర్రరారిరార రిరుర రేర

ఇది ఈ వేమన పద్యము -
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినుర వేమ

ఇప్పుడు మీకొక తేటగీతి పద్యాన్ని పూరణ కిస్తున్నాను, ప్రయత్నించండి.  ఇద్దరి పూరణలు ఒకే జవాబుగా నుండవలసిన అవసరము లేదు, అదే ఇందులోని చిత్రము. 

తేటగీతి -
రర్రు ర్రేరరో రర్రి రారిర్రు రేర
రోరి రుర్రుర రారరు రోరరాంరి
రర్రు ర్రేరరో రర్రి రోరిర్రు రీరు
రారరర్రంరు రరరరురారరంరు

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ChaMdassulO oka aaTa - biMdumati

ee rOju lIpu dinamu, aa dinAnni aacaristU oka kotta aaTa aaDudAmA?

ee aaTalO biMduyukta aksharamunu okaTi tIsikoMdAmA.  telugulO ee aksharamu ra.  saMskRtamulO sAmAnyamugA idi dEvanAgari Tha. padyamanni ee rakaaramutO uMTuMdi, anusvAra munnacOTa anusvAramu, acculunnacOTa acculu, ottu lunna cOTa ra-kArapu ottulu.  ee ottu adE aksharamu, lEka vErE aksharamu kAvaccunu  udAharaNaku - 

raMrirOru rAru rarirerairaru rAru
rarireraira rEri rararu rAru 
rarri raruru rUru rarrerairaru rAru
rirrarArirAra rirura rEra

idi ee vEmana padyamu -
gaMgigOvu pAlu gariTeDainanu cAlu
kaDiveDaina nEmi kharamu pAlu
bhakti galugu kUDu paTTeDainanu cAlu
viSvadAbhirAma vinura vEma

ippuDu mIkoka tETagIti padyAnni pUraNa kistunnAnu, prayatniMcaMDi.  iddari pUraNalu okE javAbugA nuMDavalasina avasaramu lEdu, adE iMdulOni chitramu. 

tETagIti -
rarru rrErarO rarri rArirru rEra
rOri rurrura rAraru rOrarAMri
rarru rrErarO rarri rOrirru rIru
rArararraMru rarararurAraraMru

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] గౌ #gau#

గౌ - 

ఆధారము - హేమచంద్రుడు 

గౌ - న/న/భ/ర/ర IIII IIU - IIUII UIU
15 అతిశక్వరి 11712

అనుపమమగు గౌ-ల్యము నిండె మనమ్ములోఁ 
దనరుచుఁ బశువుల్ - దరుణారుణ కాంతిలోఁ 
గనఁబడి యెదుటన్ - గడు మెల్లఁగ నాడఁగా 
వినఁబడఁ జెవులన్ - బినగంటల నాదముల్ 

పశువుల పతియే - వరవేణువు నూఁదఁగా 
రసమయ రవముల్ - ప్రవహించెను సొంపుగా 
హసితము జగమం - దరుసమ్మున నింపుగా 
మెసలెను హృదిలో - మృదు మంజుల గీతమై 

ముదమును గనుమా - పువులన్ బులకించఁగా 
మధురతరముగా - మదనోత్సవ వేళలో 
మది యొక విరిగా - మసృణమ్ముగఁ బూచెనే 
వదలను దరి రా - వరదా నను జేరఁగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
gau - 

aadhAramu - hEmachaMdruDu 

gau - na/na/bha/ra/ra #IIII IIU - IIUII UIU#
15 atiSakvari 11712

anupamamagu gau-lyamu niMDe manammulO@M 
danaruchu@M baSuvul - daruNAruNa kAMtilO@M 
gana@MbaDi yeduTan - gaDu mella@Mga nADa@MgA 
vina@MbaDa@M jevulan - binagaMTala nAdamul 

paSuvula patiyE - varavENuvu nU@Mda@MgA 
rasamaya ravamul - pravahiMchenu soMpugA 
hasitamu jagamaM - darusammuna niMpugA 
mesalenu hRdilO - mRdu maMjula gItamai 

mudamunu ganumA - puvulan bulakiMcha@MgA 
madhurataramugA - madanOtsava vELalO 
madi yoka virigA - masRNammuga@M bUchenE 
vadalanu dari rA - varadA nanu jEra@MgA 