[racchabanda] ఉత్పలమాల - కవికంఠభూషణము - శైలశిఖా #utpalamAla - kavikaMThabhUshaNamu - SailaSikhA#

ఉత్పలమాల - కవికంఠభూషణము - శైలశిఖా - 

ఉత్పలమాల - 
రా వనజాక్షి నీవెగద - ప్రాణము నాకిలపై నిజమ్ముగా 
భావనగంగ నీఁదగను - వర్ణమయప్రభలలో రమించగన్ 
రా వనమో వసంతమున - వ్రాసెను జిత్రములన్ సుమమ్ములన్ 
బావన మయ్యె నంద మది - పల్లవితమ్ము సదా మనోజ్ఞమై 

కవికంఠభూషణము - 
వనజాక్షి నీవెగద - ప్రాణము నాకిలపై నిజమ్ముగా 
వనగంగ నీఁదగను - వర్ణమయప్రభలలో రమించగన్ 
వనమో వసంతమున - వ్రాసెను జిత్రములన్ సుమమ్ములన్ 
వన మయ్యె నంద మది - పల్లవితమ్ము సదా మనోజ్ఞమై 

శైలశిఖా - 
రా వనజాక్షి నీవెగద - ప్రాణము నాకిలపై 
భావనగంగ నీఁదగను - వర్ణమయప్రభలలో 
రా వనమో వసంతమున - వ్రాసెను జిత్రములన్ 
బావన మయ్యె నంద మది - పల్లవితమ్ము సదా 

మాతృక - ఉత్పలమాల 
తనయలు - కవికంఠభూషణము, శైలాశిఖా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
utpalamAla - kavikaMThabhUshaNamu - SailaSikhA - 

utpalamAla - 
rA vanajAxi nIvegada - prANamu nAkilapai nijammugA 
bhAvanagaMga nI@Mdaganu - varNamayaprabhalalO ramiMchagan 
rA vanamO vasaMtamuna - vrAsenu jitramulan sumammulan 
bAvana mayye naMda madi - pallavitammu sadA manOj~namai 

kavikaMThabhUshaNamu - 
vanajAxi nIvegada - prANamu nAkilapai nijammugA 
vanagaMga nI@Mdaganu - varNamayaprabhalalO ramiMchagan 
vanamO vasaMtamuna - vrAsenu jitramulan sumammulan 
vana mayye naMda madi - pallavitammu sadA manOj~namai 

SailaSikhA - 
rA vanajAxi nIvegada - prANamu nAkilapai 
bhAvanagaMga nI@Mdaganu - varNamayaprabhalalO 
rA vanamO vasaMtamuna - vrAsenu jitramulan 
bAvana mayye naMda madi - pallavitammu sadA 

mAtRka - utpalamAla 
tanayalu - kavikaMThabhUshaNamu, SailASikhA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

Re: [racchabanda] గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో...

Suprabha gArU: cAlA bAguMdaMDI,
mUrti

On Sat, Jan 26, 2019 at 3:39 AM suprabha u saarada@yahoo.com [racchabanda] <racchabanda@yahoogroups.com> wrote:

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో
-------------------------------------------------

--

రంగుల రంగుల ...
--------------------------

గేయము
మాత్రాబద్ధము (13 /14 )

రంగుల రంగుల మనజెండా 
నింగిని నెగురఁగ గర్వముగా 
బంగరు తల్లికి మోదముగా 
సంగతమొప్పఁగ నిలిచెదమా  

ప్రణతుల నొసఁగుచు మనతలికి
మనమున నిలుపుచు తన మమత 
అనువుగ నుంచుచు మన నడఁత 
పనులను నేర్పుగ సలిపెదమా 

విఱుగఁగ నీయక తన యెడఁద
తరుగఁగఁ జేయక వనరులను 
గురుతర బాధ్యత గురుతించి 
నిరతము తెలివిగ మసలుదమా 

దుష్టుల మాటల వినకుండ 
శిష్టుల స్నేహము విడకుండ 
కష్టము నష్టము లేకుండ 
నిష్టిగ బ్రతుకుల గడుపుదమా
తుష్టిని ఘనముగ వెలిఁగెదమా

జగడము లన్నియు మాపుదమా 
ప్రగతికి దారినిఁ జూపుదమా 
జగతిని శాంతిని నింపుదమా 
అగణిత సౌఖ్యము లందుదమా 

సుప్రభ
1:45 AM
01-26-2019  

__._,_.___

Posted by: Katta Murty <murty@umich.edu>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో...

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో
-------------------------------------------------

--

రంగుల రంగుల ...
--------------------------

గేయము
మాత్రాబద్ధము (13 /14 )

రంగుల రంగుల మనజెండా 
నింగిని నెగురఁగ గర్వముగా 
బంగరు తల్లికి మోదముగా 
సంగతమొప్పఁగ నిలిచెదమా  

ప్రణతుల నొసఁగుచు మనతలికి
మనమున నిలుపుచు తన మమత 
అనువుగ నుంచుచు మన నడఁత 
పనులను నేర్పుగ సలిపెదమా 

విఱుగఁగ నీయక తన యెడఁద
తరుగఁగఁ జేయక వనరులను 
గురుతర బాధ్యత గురుతించి 
నిరతము తెలివిగ మసలుదమా 

దుష్టుల మాటల వినకుండ 
శిష్టుల స్నేహము విడకుండ 
కష్టము నష్టము లేకుండ 
నిష్టిగ బ్రతుకుల గడుపుదమా
తుష్టిని ఘనముగ వెలిఁగెదమా

జగడము లన్నియు మాపుదమా 
ప్రగతికి దారినిఁ జూపుదమా 
జగతిని శాంతిని నింపుదమా 
అగణిత సౌఖ్యము లందుదమా 

సుప్రభ
1:45 AM
01-26-2019  

__._,_.___

Posted by: suprabha u <saarada@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

www.telugubhakti.com Digest Number 4857

1 Message

Digest #4857
1

Message

Fri Jan 25, 2019 7:55 pm (PST) . Posted by:

telugubhaktipages

*8. హోమ్వర్కు*

సోమూ మొదటసారి స్నేహితుడు రామూతో హొటల్కువెళ్ళాడు. అక్కడ పద్ధతులు, వాతావరణం అంతా సోమూకు కొత్తగా ఉంది. అతను క్యాష్కౌంటరులో ముందే డబ్బులివ్వాలా అని వాకబు చేసాడు. దానికి హోటలు యజమాని 'మీరు తృప్తిగా తినండి తరువాత బిల్లు పే చేయవచ్చు' అన్నాడు. సోమూ, ఆ స్నేహితుడు రామూ కలిసి వడలు చెప్పారు. స్నేహితుడు రామూ ఒకటే వడ తిని 'ఇంక చాలు' అని చెప్పాడు. సోమూ మాత్రం ఏడు వడలు తిన్నాడు.
హోటలు యజమాని సోమూతిన్న ఏడు వడలకు రామూ తిన్న ఒక వడకు సోమ్ము ఇమ్మన్నాడు. సోమూ క్యాష్కౌంటర్దగ్గర యజమానితో పేచీ పెట్టుకున్నాడు. తాను తనకు ఒక వడకే డబ్బిస్తానంటాడు. హొటలు యజమాని ఎందుకు అని పశ్నిస్తే సోమూ ఇలా సమాధానం చెప్పాడు. నా స్నేహితుడు రామూ మీ ఒక్క వడకే తృప్తి చెందాడు. నాకు మాత్రం ఆకలి తీరే వడ ఏడవ వడగా వడ్డించారు. అంటే మీరు వడ్డించిన ముందు ఆరు వడలకు ఆకలితీర్చే గుణం లేదన్నమాట. ఆ ఆరు వడలు పనికి రానివి వాటికి డబ్బు ఇవ్వడం దండగ అన్నాడు. అందుకుని ఆకలితీర్చే గుణం కలిగిన ఆఖరి వడకే డబ్బు అంటూ వాదించాడు. హొటలు యజమాని చిక్కులోపడ్డ్డాడు. ఇప్పుడెలాగా? హొటల్యజమాని సోమూ స్నేహితుడ్ని రామూను అడిగాడు 'అయ్యా హోటల్కు వచ్చే ముందు ఏమైనా తిన్నారా?' అని దానికి ఆ స్నేహితుడు 'ఆరు వడలు ఇంట్లో తినివచ్చా'నని సమాధానం చెప్పాడు. రామూ మా ఆవిడ కూడా వడలు చేసింది సోమూ మా ఇంటికి రాక ముందు మా ఆవిడ పెట్టిన ఆరు వడలు ఇంట్లో తిన్నాను అన్నాడు. అదీ సంగతి! అందుకే అతనికి హొటల్లోని ఏడవ వడ తినగానే కడుపు నిండింది!! అదే మాదిరిగా మనలో కొంతమంది గత జన్మలలో ఆధ్యాత్మిక సాధన చేసి ఉంటారు! వారు ఆధ్యాత్మిక హోమ్వర్కు ముందు జన్మలలో చేసేశారు కనుక వారికి అధ్యాత్మిక ఉన్నతి చాలా త్వరగా ఉంటుంది. ఈ జన్మలో మనం ఆధ్యాత్మిక సాధన ఎక్కడ ఆపామో మరుసటి జన్మలో అక్కడనుంచి మళ్ళీ ఆధ్యాత్మిక సాధన మొదలౌతుంది. చాలా మంది శాస్త్ర అధ్యయనం అవసరమా? రమణమహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి మహాత్ములు ఎందరో ఏ శాస్త్ర అధ్యయనం చేయకుండానే మొక్షం పొందారు కదా! అంటుంటారు. దానికి సమాధానం ఇదే వారు గత జన్మలలో పూర్తిగా శాస్త్ర అధ్యయనం చేసి ఉండవచ్చు. అందుకని యీ జన్మలో శాస్త్ర అధ్యయనం అవసరం లేకపోయింది.
కొంతమందికి జీవన్ముక్తి రాకుండానే మరణిస్తామేమొని సంశయం వస్తుంది? అయితే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఇలా చెపుతారు. సాధకులు ఈ జన్మలో ఆధ్యాత్మిక సాధన ఎక్కడ వదిలారో మరుజన్మలో అక్కడనుంచి ఆధ్యాత్మిక ప్రయాణం మళ్ళీ మొదలౌతుంది.

*ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ఉషిత్వ శాశ్వతీః సమాః|*
*శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో2భిజాయతే|| గీత 6 -41*

యోగభ్రష్టుడు (ఈ జన్మలో ఆధ్యాత్మిక సాధన అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం పూర్తి కాకుండా, జీవన్ముక్తి సాధిóంచకుండా మరణించిన వారిని గీతలో కృష్ణపరమాత్మ యోగభ్రష్టుడు అంటున్నారు.)

పుణ్యాత్ములు పొందు లోకములను అనగా సర్గాది లోకాలను పొంది, ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపిన పిదప పవిత్రులైన సంపన్నులైన సంస్కారవంతులైన వైదికసంప్రదాయ గృహములో జన్మించి తన ఆధ్యాత్మిక సాధనను తిరిగి కొనసాగించును.

www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

Re: Aw: Re: [racchabanda] ప్రశ్నలు

షష్ఠాష్టకము : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
వి.
పగ, విరోధము, దెబ్బలాట.
"ఇట్టి షష్ఠాష్టకమేల పుట్టె నకటా వికటాలపితంబు లేటికిన్‌ భ్రష్ట పొకాలి పొమ్మనుచుఁ బల్కిన నుల్కిన మానసంబునన్‌." [వరాహ-5-15]

నమస్సులతో,
వాడపల్లి శేషతల్పశాయి.

On Saturday, 26 January, 2019, 8:47:10 AM IST, 'Sreenivas Paruchuri' sreeni@gmx.de [racchabanda] <racchabanda@yahoogroups.com> wrote:

Mohanarao gaaru,
 
I did not know that. తగవు అనే అర్థంలో ఈ మాట రాతలో ఎక్కడైనా వాడబడిందా? లేక కేవలం సంభాషణలలో వాడుకునే మాటా? Not that I am looking for some "proof"!
 
Thanks for educating as ever,
Sreenivas
 
Gesendet: Freitag, 25. Januar 2019 um 21:34 Uhr
Von: "'J. K. Mohana Rao' jkmrao@yahoo.com [racchabanda]" <racchabanda@yahoogroups.com>
 
తగవుకు కూడ షష్టాష్టకము అంటారు :-) 

__._,_.___

Posted by: "Sesha Vadapalli (VSTSayee)" <seshavadapalli@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (6)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

Aw: Re: [racchabanda] ప్రశ్నలు

Mohanarao gaaru,
 
I did not know that. తగవు అనే అర్థంలో ఈ మాట రాతలో ఎక్కడైనా వాడబడిందా? లేక కేవలం సంభాషణలలో వాడుకునే మాటా? Not that I am looking for some "proof"!
 
Thanks for educating as ever,
Sreenivas
 
Gesendet: Freitag, 25. Januar 2019 um 21:34 Uhr
Von: "'J. K. Mohana Rao' jkmrao@yahoo.com [racchabanda]" <racchabanda@yahoogroups.com>
 
తగవుకు కూడ షష్టాష్టకము అంటారు :-) 

__._,_.___

Posted by: "Sreenivas Paruchuri" <sreeni@gmx.de>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (5)