www.telugubhakti.com Digest Number 4887

6 Messages

Digest #4887
1.1
Satsangam by p_gopi_krishna
1.2
Satsangam by p_gopi_krishna
2.1
Sri Satya Sai Baba by p_gopi_krishna
3.1
Srimad Bhagavad Gita by p_gopi_krishna
4.1
Quotable Quote by p_gopi_krishna
5.1
Sanskrita Slokam by p_gopi_krishna

Messages

Sun Feb 24, 2019 11:06 pm (PST) . Posted by:

p_gopi_krishna

తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం |

దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే సు తరసి తరసే నమః ||
'దుర్గ' అనే పదంలోని 'ద'కారానికి దైత్య నాశనమనీ, 'ఉ'కారానికి విఘ్న నాశనమనీ, 'ర'కారానికి రోగ నాశకమనీ, 'గ'కారానికి పాప పరిహారకమనీ అర్థాలు.
(దుఃఖాత్ గమయతీతి దుర్గా, దుర్గతిం గమయతి, దూరయతి సా దుర్గా, దురాశాంగమయతీతి దూరయతీతి దుర్గా, దురితాని పాపాని గమయతి వినాశయంతి సా దుర్గా, దూరాచారం దోషం వా గమయతీతి దూరం కరోతి సా దుర్గా)
దుఃఖాన్ని పోగొట్టేది దుర్గ, దుర్గతిని దూరంచేసేది దుర్గ, దురాచారాన్ని తొలగించేది దుర్గ, పాపాన్ని పరిహారించేది దుర్గ, దురాచారాలను, దోషాలను దురంగా నెట్టే దుర్గ కాబట్టి, ప్రతిదినమూ ప్రాతఃకాలంలో "దుర్గా" అనే రెండక్షరాలను స్మరించేవారికి ఆపదలన్నీ తొలగిపోతాయి.
(నహి దుర్గా సమం జ్ఞానం, నహి దుర్గా సమో జపహః

నహి దుర్గా సమాపూజా, నహి దుర్గా సమం తపః

దుర్గాశ్చరితం యత్ర తత్ర కైలాస మందిరం)
దుర్గతో సమమైన జ్ఞానం, జపం, పూజ, తపం లేవు. దుర్గానామం, సంకీర్తన జరిగే చోటు సాక్షాత్ కైలాసమే.
"దుర్గ" అనే పరమ మంత్రాన్ని ఎల్లపుఢు జపించేవారికి జీవన్ముక్తి లభిస్తుంది.

డా. శివలెంక ప్రకాశరావు, శ్రీ కనకదుర్గప్రభ, ఫివ్రవరి, 2019

Sun Feb 24, 2019 11:53 pm (PST) . Posted by:

p_gopi_krishna

మధుమతీం వాచముదేయమ్
సకల చరాచర స్రుష్టిలో మానవజన్మ ఒక వరమైతే, మానవునకు మాత్రమే అందిన మరో అమూల్యమైన వరం 'పలుకు'. మనసులోని భావాన్ని ప్రకటించడానికి ఉపయోగపడే అసాధారణ అవకాశానికి మారుపేరు వాక్కు! వాక్కు అమోఘమైనది, శక్తివంతమైనది, పరమ పవిత్రమైనది, దుర్లభమైనది. వాక్కు వాగ్దేవతకు ప్రతిరూపమైనది. వాక్కు పై సంస్క్రుతీ సంస్కారాలు ఆధారపడి ఉంటాయనేది నిర్వివాదం!
ఇయం యా పరమేష్థినీ వాగ్డేవీ బ్రహ్మ సంశితా |

యమైన సస్రుజే ఘోరం తయైవ శాంతి రస్తునః ||

(అధర్వణ వేదం 19-1-3)
వేద విజ్ఞానంతో వాక్కును జోడిస్తే, అది అప్రతిహతమైన వజ్రాయుధంగా మారుతుంది. వాక్కును దుర్వినియోగం చేస్తే కలహాలు చెలరేగుతాయి. వైరము, వైషమ్యాలు అంకురిస్తాయి. అవి చివరకు యుద్ధములతో ముగుస్తాయి. వాక్కును సద్వినియోగం చేసుకుంటే శాంతి లభిస్తుందని అధర్వణ వేదం ప్రవచిస్తుంది.
వాక్ ఏవ ఋక్ (ఛాందోగ్య 1-5-5)
మనస్సు, వాక్కు, శరీరములను మూడింటినీ కలిపి త్రికరణములని పిలుస్తారు. అందుకే 'త్రికరణ శుద్ధిగా' అని వ్యవహరిస్తారు. ఇందులో వాక్కుకున్న స్థానం విశిష్టమైనది. అందుకే పరమేశ్వరుని వాక్కును 'రుక్కు' అని పిలుస్తారు.
శబ్దే శబ్దే వాణీ దైవమ్ వాచో వినయ ద్వహ్నే దైవమ్ |

కంఠే నివసత్ దైవమ్ కవి వాగ్వైభవ పాత్రం దైవమ్ ||

(ఉపాసహస్రము)
కావ్యకంఠ వాసిష్థ గణపతి మునీంద్రులు ప్రతీ శబ్దములోను దైవము కనిపిస్తాడని, శబ్దమునందు ధ్వనించు వాణి దైవమని, 'ఉమాసహస్రము' అను గ్రంథములో ప్రస్తుతిస్తారు. వాక్కులను ప్రసరించు ప్రతీ కంఠము దైవము కొలువున్న స్థానము. అటువంటి వాక్కులను ఉపయోగించు కవి యొక్క వాక్ వైభవము కూడా దైవప్రసాదమని అనుకోమంటారు. ప్రతి శబ్దములోనూ దైవమున్నది అనుకుంటే, అపశబ్దమేదీ ఉత్పత్తికాదు. మంగళకరమైన శబ్దాలు ఆనందాన్ని కలిగిస్తాయి.
తైజసానాం సారంఃవాక్ (ఛాందోగ్య)
మానవులను దీపింపచేయు తేజస్సులన్నింటికి వాక్కు సారమని, తేజస్సు అజ్ఞంధకారాన్ని తొలగించి జ్ఞానకాంతులను వెదజల్లుతుందని, అదే విధంగా వాక్కు వలన అజ్ఞానాలు తొలగి జ్ఞానము పెరుగుతుందని, ఫలితముగా మానవులోని జాడ్యము పోగొట్టబడి చైతన్యం ప్రకాశవంతమౌతుందని ఛాందోగ్యోపనిషత్తు వివరిస్తుంది.
ఎమ్. సూర్య ప్రసాదరావు, శ్రీ కనకదుర్గప్రభ, ఫివ్రవరి, 2019

Mon Feb 25, 2019 3:25 am (PST) . Posted by:

p_gopi_krishna

The love that is concentrated on oneself is as a bulb that illuminates the room alone, without shedding light outside the four walls. It is confined to the senses and never opens out to others, who are your kith and kin in God. There is another type of love, larger and deeper, which expands into the members of one's family. It is like moonlight, not strong enough to make things clear, but enough to move about in. It also undergoes rise and fall, increase and decrease. But the most desirable type of love is like the sunlight - ever engaged in purifying, activating, and illumining without any distinction. This love will make one act ever in the spirit of dedication to the Lord. Then all the acts would be elevating and holy.

Mon Feb 25, 2019 3:26 am (PST) . Posted by:

p_gopi_krishna

Intelligence shows how indulgence is harmful and how harmful indulgence is Less than a century ago, smoking was considered harmless. It took decades of intelligent investigation to reveal that smoking harmed health, and harmed it so much.

We need similar intelligent investigation to expose another glamorized activity: indiscriminate sensual indulgence. Gita wisdom exposes the harms of sensual indulgence in two ways:
How indulgence is harmful: The Bhagavad-gita (18.38) stresses that, though sensual indulgence initially appears enjoyable, it ends up becoming miserable. The pleasure of indulgence is preceded by hankering and succeeded by lamenting. Hankering means that we want the pleasure, immediately and irresistibly. Lamenting means we resent why the pleasure ended so soon. Over time, the hankering and lamenting increase, whereas the pleasure decreases. Eventually, the pleasure becomes just a short-lived relief from the self-inflicted torment of constant hankering and lamenting.
However, the indulgence is usually physical and visible, whereas the hankering and lamenting are psychological and invisible. So, we hardly ever realize that indulgence is hurting us, unless we intelligently analyze our experiences.
How harmful indulgence is: The Gita (03.39) warns that self-destructive desire is an eternal enemy. Indulgence stains our psyche with indelible impressions that haunt us far beyond our present lifespans. Apart from such psychological torment, indulgence can also sentence us to other karmic consequences, based on the specific nature and quantity of our indulgence.
Most damagingly, indiscriminate indulgence gives rise to a material obsession that distracts us from spiritual absorption (02.44). And we stay deprived of the lasting happiness that is our right as blissful parts of the blissful whole.
When we thus understand how indulgence is harmful and how harmful indulgence is, we can wisely desist from indiscriminate indulgence (05.22). And by firmly turning our backs toward sensuality, we can determinedly practice bhakti-yoga to connect with the all-attractive whole, thereby accessing imperishable happiness (05.21).
Think it over:
How can we understand that indiscriminate sensual indulgence is harmful? How can we understand how harmful such indulgence is? When we understand the harms of such indulgence, what can we do? https://www.facebook.com/sharer/sharer.php?u=https%3A%2F%2Fwww.gitadaily.com%2F%3Fp%3D20124&picture=http://www.gitadaily.com/wp-content/images/Bhagavad-Gita-Chapter-05-Text-22.jpg http://twitter.com/share?text=Intelligence%20shows%20how%20indulgence%20is%20harmful%20and%20how%20harmful%20indulgence%20is&url=https%3A%2F%2Fwww.gitadaily.com%2F%3Fp%3D20124&hashtags= https://plus.google.com/share?url=https%3A%2F%2Fwww.gitadaily.com%2F%3Fp%3D20124 http://pinterest.com/pin/create/button/?url=https%3A%2F%2Fwww.gitadaily.com%2F%3Fp%3D20124&media=http://www.gitadaily.com/wp-content/images/Bhagavad-Gita-Chapter-05-Text-22.jpg&description=Less%20than%20a%20century%20ago%2C%20smoking%20was%20considered%20harmless.%20It%20took%20decades%20of%20intelligent%20investigation%20to%20reveal%20that%20smoking%20harmed%20health%2C%20and%20harmed%20it%20so%20much.We%20need%20similar%20intelligent%20investigation%20to%20expose%20another%20glamorized%20activity%3A%20indiscriminate%20sensual%20indulgence.%20Gita%20wisdom... http://bhagavadgitaclass.com/bhagavad-gita-chapter-05-text-22
http://bhagavadgitaclass.com/bhagavad-gita-chapter-05-text-22

Read more https://www.gitadaily.com/intelligence-shows-how-indulgence-is-harmful-and-how-harmful-indulgence-is/ https://www.gitadaily.com/intelligence-shows-how-indulgence-is-harmful-and-how-harmful-indulgence-is/

Mon Feb 25, 2019 6:28 am (PST) . Posted by:

p_gopi_krishna

ONE SHOULD PATIENTLY HEAR THE WORDS OF OTHERS EVEN THOUGH THEY ARE NOT INTERESTING AND CHARMING. HE SHOULD NOT FRET AND FUME. PATIENT HEARING DEVELOPS WILL AND WINS THE HEARTS OF OTHERS. (Swami Sivananda ji)

Mon Feb 25, 2019 7:27 am (PST) . Posted by:

p_gopi_krishna

వనే రణే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకే వ |

సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షన్తి పుణ్యాన్ని పురాకృతని ||
దారుణమైన నిర్జనారణ్యములో ఉన్నను కానీ, భీకరమైన యుద్ధములో ఉన్నను కానీ, పరమ కిరాతకులైన శత్రువుల చేజిక్కిననుగాని, ఎలాంటి బీభత్సమైన వరదలలో చిక్కుకున్నను గాని, ఎంత పెద్ద బడబాగ్నిలో ఉన్నను కానీ, ఎటువంటి మహాసముద్ర ప్రవాహములో అంతు చిక్కక కొట్టుమిట్టాడుచున్నను గాని, ఉన్నతమైనటువంటి పర్వత శిఖరాగ్రమున ఉన్నను గాని, గాఢమైన నిద్ర కమ్ముకొచ్చినను గాని, స్పృహతప్పి మూర్ఛవస్థలో ఉన్నను గాని, లేక మరింకేవిధమైన విపత్కర పరిస్థితులలో ఉన్నను గాని, మనము గతంలో చేసుకున్న సత్కర్మలే తప్పక మనలను రక్షించును.
మన సత్కర్మలు మనలను ఎలా రక్షించునో అలాగే మనమే బ్రహ్మండములోనైనా దాగియున్ననూ మన యొక్క దుష్కర్మల పాపా ఫలములు మనయందు ఫలించక తప్పవు. సర్వ వ్యాపకుడైనటువంటి పరమేశ్వరుని యొక్క న్యాయ వ్యవస్థ మరియు నిష్పక్ష న్యాయ హస్తములు చాల పెద్దవి.
ఈ శ్లోకం కర్మ ఫల దాతృత్వాన్ని, పరమేశ్వరుని యొక్క న్యాయ వ్యవస్థను సమస్త మానవాళికి తెలియజేస్తుంది.

శ్రీ ఎస్ రామతిరుమలరెడ్డి, యథార్థ భారతి, ఫిబ్రవరి 2019

www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.