[racchabanda] రచ్చబండ కవితలు

 

 

Prayer

 

ప్రత్యూషమిది రామ!

ప్రజ్వలుడాదిత్యుడరుదెంచె

ప్రాగ్దిశ అరుణిమలు పూయించె

ప్రాణుల ప్రాణాలు తిరిగొచ్చె.ప్రాప్తసంతోషివని, సత్యసంభాషివని

ప్రాజ్ఞుడవని, పరమాత్ముడవని 

ప్రధమంగ నీ నగుమోము చూడంగా

ప్రజలు వేచేరు, పడక దిగవయ్యా!

Lyla


__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (136)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] భవ, వందిత #bhava, vaMdita#

 

భవ, వందిత - 

భవ ఆధారము - హేమచంద్రుడు, జయకీర్తి 
ఇతర నామములు - రతి, శర్మ 
సార్థక నామ గణాక్షర వృత్తము - భ, వ గణములు UII IU

భవ (రతి, శర్మ) - భ/లగ UIIIU
5 సుప్రతిష్ఠ 15

హారతిఁ గొనన్ 
గౌరిసతితో 
మారహర యోం-
కారవర రా 

తల్చుచు నినున్ 
బిల్చితి భవా 
నిల్చెద నిలన్ 
గొల్చెద శివా 

నందహృదయా
సుందరమయా 
యందుకొనుమా 
వందనములన్ 

రెండు భ/లగ గణముల అమరికను చేర్చినప్పుడు జనించిన వృత్తము వందిత. 

ఆధారము - కల్పితము

వందిత - భ/య/న/గ UIIIU - UIIIU
10 పంక్తి 463

సంకట మహా-సాగరములోఁ 
గ్రుంకితిని నన్ - బ్రోవఁగను రా 
శంకర హరా - చంద్రధర నీ
కింకరుఁడ శం-కించకు ప్రభూ 

ఇందుధరునిన్ - నృత్యలయునిన్ 
సుందరముఖున్ - శూలకరునిన్ 
వందితుని స-ర్వజ్ఞుని హరున్ 
ముందు గొలుతున్ - మోదమయునిన్ 

ప్రాసయతితో UI IIU - UI IIU విఱుపుతో - 

నీలగళుఁడా - వ్యాళధరుఁడా 
కాలముఖుఁడా - జ్వాలి వరదా 
మ్రోల నిడెదన్ - బూల సరముల్ 
జాలిఁ గనరా - లాలనలతో 

UIII UUI IIU విఱుపుతో (యతి లేదు) - 

మంచుమల యల్లుండ భవుఁడా 
కొంచె మిటు మావైపు గనరా 
కుంచితము మాజీవ మిలపై 
ద్రుంచుమయ పాపమ్ము లభవా 

UIII - UU - IIIU విఱుపుతో  

ఈశ్వరుఁడ - వీవే జగములో 
నశ్వరము - నాయీ బ్రతు కిలన్ 
శాశ్వతము - స్వామీ హర యనన్ 
విశ్వముఖ - వేగన్ గను ననున్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
bhava, vaMdita - 

bhava aadhAramu - hEmachaMdruDu, jayakIrti 
itara nAmamulu - rati, Sarma 
sArthaka nAma gaNAxara vRttamu - bha, va gaNamulu #UII IU#

bhava (rati, Sarma) - bha/laga #UIIIU#
5 supratishTha 15

hArati@M gonan 
gaurisatitO 
mArahara yOM-
kAravara rA 

talchuchu ninun^ 
bilchiti bhavaa 
nilcheda nilan^ 
golcheda SivA 

naMdahRdayaa
suMdaramayaa 
yaMdukonumaa 
vaMdanamulan^ 

reMDu bha/laga gaNamula amarikanu chErchinappuDu janiMchina vRttamu vaMdita. 

aadhAramu - kalpitamu

vaMdita - bha/ya/na/ga #UIIIU - UIIIU#
10 paMkti 463

saMkaTa mahaa-saagaramulO@M 
gruMkitini nan^ - brOva@Mganu raa 
SaMkara haraa - chaMdradhara nee
kiMkaru@MDa SaM-kiMchaku prabhoo 

iMdudharunin^ - nRtyalayunin^ 
suMdaramukhun^ - Soolakarunin^ 
vaMdituni sa-rvaj~nuni harun^ 
muMdu golutun^ - mOdamayunin^ 

prAsayatitO #UI IIU - UI IIU# vi~ruputO - 

neelagaLu@MDaa - vyaaLadharu@MDaa 
kaalamukhu@MDaa - jvaali varadaa 
mrOla niDedan^ - boola saramul^ 
jaali@M ganaraa - laalanalatO 

#UIII UUI IIU# vi~ruputO (yati lEdu) - 

maMchumala yalluMDa bhavu@MDA 
koMche miTu mAvaipu ganarA 
kuMchitamu mAjIva milapai 
druMchumaya pApammu labhavA 

#UIII - UU - IIIU# vi~ruputO  

eeSvaru@MDa - vIvE jagamulO 
naSvaramu - nAyI bratu kilan 
SASvatamu - svAmI hara yanan 
viSvamukha - vEgan ganu nanun 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___