[racchabanda] శివశివ శంకర...

 

శివశివ శంకర...

-----------------------

--
కవిరాజ విరాజితము 

--

శివశివ శంకర శ్రీకర శ్రీధర చేసెద నీపద సేవలనే 
భవహరమౌఁ గద భావన సేయఁగ భవ్య పదంబుల భక్తిమెయిన్
అవగుణ సంతతి యంతనశించఁగ నందఁగ జ్ఞానమె హర్షముగా 

నివటిలకుందునె నిత్యము నేనును నిక్కముగానిల నీలగళా

--
మానిని 

--

మన్నన నిచ్చెద మాతకు నీకును మౌనిగఁ గొల్చుచు మానసమున్ 
సన్నుతి సేయఁగ సాధువచస్సుల శక్తినొసంగుము సాంబశివా
క్రన్నన కోరిన కామ్యమొసంగుము గారము మీరఁగఁ గామరిపూ

విన్నదనంబున వీడఁగనీకుము వేడినదీయక వేదనుతా

--

స్థాణుఁడవీవని సర్వజగత్తును శాస్త్రములన్నను సంతతమున్ 
జ్ఞానము నిచ్చెడి శర్వుడ వీవని సన్మతినెంచెద శక్తియుతా 
మానుగ నీ మహిమంబులఁ బాడఁగ మౌనులు మెచ్చెడి మాటలతో 
వాణియుఁ బొంగదె వాక్పతి తోడుగ వారిజనేత్రుఁడు వల్లెయనన్ 

--

నీ సరి లేరని నెమ్మిని గావఁగ నిత్యనిరంజన నిర్మల భా 
వాసరవాసిని పట్టిగ నేనఁటఁ బాడఁగఁ దీయఁగఁ బ్రస్తుతులన్ 
నీ సుతులిద్దఱు నివ్వెఱపాటున నిల్చి వినంగను నీదరిలో 
హాసములొల్కుచు నంబయు నీయదె యాదరమొప్పఁగ నాశిషముల్

--

సుప్రభ 
1:30 PM
03-07-2019

--

దీనికి ముందు వ్రాయించినది "సోది" యన్నానని :-) వేరే పద్యములిస్తానని రెండు మంచి ఛందములలో వ్రాయించినవి. 
--

కవిరాజవిరాజితము -- గణములు --న, జ,జ,జ,జ,జ,జ,వ . 1,8,14,20 యతులు

మానిని ------------------ గణములు -- 7 భ , గురువు, 1,7,13,19 యతులు

__._,_.___

Posted by: suprabha u <saarada@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] Happy Women's Day! సుందరీ #suMdarI#

 

సుందరీ - 

ఆధారము - ప్రాకృతపైంగలము
నడక - చతురస్రగతి 
ఇతర నామములు - పద్మావతికా, సుందరికా 

సుందరీ - స/స/భ/స/త/జ/జ/లగ IIU IIU UII IIU - UU IIU IIU IIU
23 వికృతి 3590044 

జగమందున స్త్రీలెల్లరు నిజమై - చక్కంగ విరాజిలు సుందరులే 
మొగమందున హాసమ్ముల సొబగుల్ - పుష్పమ్ముల నిండిన మాధురులే 
సుగ మీయఁగ నీ సుందర ధరపై - సొంపారఁగ డిగ్గిన దేవతలే 
మగవారము మేమిత్తుము గొనరే - మాయీ యభినందనలన్ దయతో 

వర భామిను లీభూమికి నగలే - వాసంతగళోద్భవ గీతికలే 
హరుసమ్ములతో శోభిలు సిరులే - యానందపు చిందుల యందములే 
నిరత మ్మిలపై వెల్గెడు దివెలే - నిస్సంశయమై రస వాహినులే 
తరుణీమణు లా భవతారిణులే - తారాపథమందున ఝుల్లికలే 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
suMdarI - 

aadhAramu - prAkRtapaiMgalamu
naDaka - chaturasragati 
itara nAmamulu - padmAvatikA, suMdarikA 

suMdarI - sa/sa/bha/sa/ta/ja/ja/laga #IIU IIU UII IIU - UU IIU IIU IIU#
23 vikRti 3590044 

jagamaMduna strIlellaru nijamai - chakkaMga virAjilu suMdarulE 
mogamaMduna haasammula sobagul - pushpammula niMDina mAdhurulE 
suga mIya@Mga nI suMdara dharapai - soMpAra@Mga Diggina dEvatalE 
magavAramu mEmittumu gonarE - mAyI yabhinaMdanalan dayatO 

vara bhAminu lIbhUmiki nagalE - vAsaMtagaLOdbhava gItikalE 
harusammulatO SObhilu sirulE - yaanaMdapu chiMdula yaMdamulE 
nirata mmilapai velgeDu divelE - nissaMSayamai rasa vAhinulE 
taruNImaNu lA bhavatAriNulE - tArApathamaMduna jhullikalE 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___