[racchabanda] సారిణీ #sAriNI#

 

సారిణీ - 

ఆధారము - రత్నమంజూష 
నడక - చతురస్రగతి 

ఈ వృత్తము ఒక విధముగా మాలతీవర్గమునకు చెందినది. మొదటి భాగములో రెండు చతుర్మాత్రలు, రెండవ భాగములో ఒక అష్టమాత్ర. కాని రెండు భాగములలో లగారంభమైన, అనగా ఎదురునడకతో ఉండే, గణములు. క్రింద నా ఉదాహరణములు - 

సారిణీ - జ/స/య/లగ IUI IIU - IUUIU
11 త్రిష్టుప్పు 606

విరించి హృదయా - విరాడ్రూపిణీ 
సురాసురనుతా - సుధాసారిణీ 
వరప్రదవుగా - వరాంగీ ప్రభా 
స్మరింతు నెపుడున్ - సరోజాక్షి నిన్ 

విలాసములలో - వినోదమ్ముగాఁ 
గళామయముగాఁ - గవిత్వమ్ము నీ 
గళ మ్మొసఁగ నా - కలల్ నిండె సం-
చలించె ముదమై - శరద్రాత్రిలో 

అనంత జగమం - దనూహ్యమ్ముగాఁ 
గనంగ వెలిఁగెన్ - గళాదీపముల్ 
వినంగ మొరసెన్ - బ్రియ ధ్వానముల్ 
మనమ్ము విరిసెన్ - మనోజ్ఞమ్ముగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
sAriNI - 

aadhAramu - ratnamaMjUsha 
naDaka - chaturasragati 

ee vRttamu oka vidhamugA maalatIvargamunaku cheMdinadi. modaTi bhAgamulO reMDu chaturmaatralu, reMDava bhAgamulO oka ashTamaatra. kAni reMDu bhAgamulalO lagaaraMbhamaina, anagA edurunaDakatO uMDE, gaNamulu. kriMda nA udAharaNamulu - 

sAriNI - ja/sa/ya/laga #IUI IIU - IUUIU#
11 trishTuppu 606

viriMchi hRdayA - virADrUpiNI 
surAsuranutA - sudhAsAriNI 
varapradavugA - varAMgI prabhA 
smariMtu nepuDun - sarOjAxi nin 

vilAsamulalO - vinOdammugA@M 
gaLaamayamugA@M - gavitvammu nI 
gaLa mmosa@Mga nA - kalal niMDe saM-
chaliMche mudamai - SaradrAtrilO 

anaMta jagamaM - danUhyammugA@M 
ganaMga veli@Mgen - gaLAdIpamul 
vinaMga morasen - briya dhvAnamul 
manammu virisen - manOj~nammugA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#


__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___