[racchabanda] వందనము ..

 

వందనము ..
---------------


మాత్రాబద్ధము ( 13 )


భగవతి రూపా వందనము 
నిగమారాధ్యా వందనము
--
సుమేరు సంస్థా వందనము
త్రిమూర్తి వంద్యా  వందనము 
--
త్రిగుణాతీతా వందనము 
జగతీ వంద్యా వందనము 
--
యోగారూఢా వందనము
భాగవతప్రియ  వందనము 
--
గాన సుతోషా వందనము 
దీన సురక్షా వందనము 
--
పురాణ పురుషా వందనము
కరుణా వరుణా వందనము 
--
పంకజనేత్రా  వందనము
సంకట మోచన వందనము 
--
ప్రణవాకారా వందనము
గణపతి దేవా వందనము 
--
మునిగణార్చితా వందనము
అనఘాస్వామీ వందనము
--
పరాత్మ రూపా వందనము
వరప్రదాతా వందనము
--
విధుసమ హాసా వందనము 
బుధగణ వినుతా వందనము 
--
వందనమయ్యా వందనము
అందుకొ సుప్రభ వందనము

--

సుప్రభ
12:19 PM
03-11-2019

--

సద్గురు దేవులు శ్రీ స్వామీజీ  "కన్నడ భాగవత సప్తాహము" లో భాగముగా నేడు చేసిన
ప్రవచనము వింటున్నప్పుడు పొంగిన పలుకులు.

__._,_.___

Posted by: suprabha u <saarada@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] కనకలతా #kanakalatA#

 

కనకలతా - 

ఆధారము - నాట్యశాస్త్రము (మకరశీర్షా) 

ఇతర నామములు - ముకుళితా (రత్నమంజూష), కనకలతా (జయకీర్తి), శశివదనా (హేమచంద్రుడు), చతురంశా (ప్రాకృత పైంగళము), ఉదాత్త (నాగవర్మ), సురలతా (రేచన, నంది ఛందస్సు), విజయశుభ (కవితాసాగరము), కలకంఠ (మదనతిలకం)

నడక - చతురస్రగతి 

కనకలతా - న/య IIII UU
6 గాయత్రి 16

మనసున నీవే 
మనుగడ నీవే 
తనరెడు వెల్గై 
తనువున నీవే 

వినఁగను రావా 
పిన మృదు గీతిన్ 
గనఁగను నన్నో 
కనకలతా రా 

సెలవలె రా నీ 
చెలువముతోడన్ 
కలవలె రా నా 
కలిమికి రూపై 

నిలిచితి నీకై 
నెల వెలుఁగందున్ 
నళిన సునేత్రీ 
నలువ సుపుత్రీ 

రెండు కనకలత పాదములను ప్రక్కప్రక్కన ఉంచితే మనకు కుసుమవిచిత్రా లేక గజలలితా అనే వృత్తము లభిస్తుంది. ఈ వృత్తము పాదమునకు పండ్రెండు అక్షరములు ఉండే జగతి ఛందములో 976వ వృత్తము. పైన ఇవ్వబడిన ఉదాహరణములతో రెండు కుసుమవిచిత్ర వృత్తములను నిర్మించ వీలగును. అవి - 

కుసుమవిచిత్రా (గజలలితా) - న/య/న/య 
12 జగతి 976 

మనసున నీవే - మనుగడ నీవే 
తనరెడు వెల్గై - తనువున నీవే 
వినఁగను రావా - పిన మృదు గీతిన్ 
గనఁగను నన్నో - కనకలతా రా 

సెలవలె రా నీ - చెలువముతోడన్ 
కలవలె రా నా - కలిమికి రూపై 
నిలిచితి నీకై - నెల వెలుఁగందున్ 
నళిన సునేత్రీ - నలువ సుపుత్రీ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
kanakalatA - 

aadhAramu - nATyaSAstramu (makaraSIrshA) 

itara nAmamulu - mukuLitA (ratnamaMjUsha), kanakalatA (jayakIrti), SaSivadanA (hEmachaMdruDu), chaturaMSA (prAkRta paiMgaLamu), udAtta (nAgavarma), suralatA (rEchana, naMdi ChaMdassu), vijayaSubha (kavitAsAgaramu), kalakaMTha (madanatilakaM)

naDaka - chaturasragati 

kanakalatA - na/ya #IIII UU#
6 gAyatri 16

manasuna nIvE 
manugaDa nIvE 
tanareDu velgai 
tanuvuna nIvE 

vina@mganu rAvA 
pina mRdu gItin 
gana@Mganu nannO 
kanakalatA rA 

selavale rA nI 
cheluvamutODan 
kalavale rA nA 
kalimiki rUpai 

nilichiti nIkai 
nela velu@MgaMdun 
naLina sunEtrI 
naluva suputrI 

reMDu kanakalata pAdamulanu prakkaprakkana uMchitE manaku kusumavichitrA lEka gajalalitA anE vRttamu labhistuMdi. ee vRttamu pAdamunaku paMDreMDu axaramulu uMDE jagati ChaMdamulO 976va vRttamu. paina ivvabaDina udAharaNamulatO reMDu kusumavichitra vRttamulanu nirmiMcha vIlagunu. avi - 

kusumavichitrA (gajalalitA) - na/ya/na/ya 
12 jagati 976 

manasuna nIvE - manugaDa nIvE 
tanareDu velgai - tanuvuna nIvE 
vina@mganu rAvA - pina mRdu gItin 
gana@Mganu nannO - kanakalatA rA 

selavale rA nI - cheluvamutODan 
kalavale rA nA - kalimiki rUpai 
nilichiti nIkai - nela velu@MgaMdun 
naLina sunEtrI - naluva suputrI 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___