[racchabanda] ధన్యమ్మె సూ .....

ధన్యమ్మె సూ 
=============

--

మత్తేభవిక్రీడితము . 

--

జయమందించఁగ రమ్ము రమ్ము జననీ సర్వార్థదాత్రీ శుభా
శ్రియముం గూర్చెడి విద్యనేర్పి యనువౌ స్నేహార్ద్ర భావమ్ముతోఁ 
బ్రియమైనట్టివి పద్యమాలికలతో వేనోళ్ళఁ గీర్తించఁగా
రయమున్ సాగఁగనిమ్ము లేఖినినిఁకన్ రమ్యాతిరమ్యమ్ముగా  
--
గతినీవేయని కోరుదిట్లు మదిలో గాంధర్వవిద్యాప్రియా  
మతినీవే యిడ నేర్చి కోరువిధిగా మందారమారందమే
ప్రతిపద్యంబునఁ బొంగిపారఁ బ్రియమై, వాగర్థసంపత్తితో
బ్రతుకీ ధారుణిపైన సార్థకముగా, భాసిల్లఁగాఁ దల్చెదన్
--
సుగుణాలయ్యవె వృద్ధి సేసికొనఁగా, శుద్ధాత్మనై వెల్గఁగా 
భగవన్నామమె పాడుకొంచుఁ  దమితో భవ్యంబుగా సర్వదా 
సుగతిం బొందఁగ నెంచుచుందుఁ గనుకన్ జూపించి కారుణ్యమే   
నిగమార్థంబుల గూడఁ దెల్పఁదగునే నిశ్శంకతో నిల్వఁగా 
--
నిగమాంతంబులు భక్తిఁ బాడును గదా నిన్నే పరాశక్తిగా 
జగదోద్ధారిణి దేవదేవి సుభగా సర్వేశ్వరీ శంకరీ 
ఖగరాడ్వాహుఁడు గూడ మెచ్చుగతిలో గానంబులన్ జేసి నీ 
నగుమోముంగని, దీవనందుకొనఁగా నాజన్మ ధన్యమ్మె సూ 
--
తపముం జేయక కాదు సాధ్యమనుచున్ దప్పించుకోకుండ స
త్కృపతోఁ గోరిన జ్ఞానమీయ వడిగా గీర్వాణసంపూజితా
విపులార్థప్రద వీవెయంచు రహితోఁ బృథ్వీ తలమ్మంత నే    
నెపుడున్ నీకథ వ్యాప్తి చేసెదనులే హృద్యమ్ముగాఁ బద్యమున్ 

--
సుప్రభ 
12:39   
03-12-2019

--

సద్గురుదేవులు, శ్రీ స్వామీజీ నిర్వహిస్తున్న "కన్నడ భాగవత సప్తాహము" లో 
వారిది నేటి ప్రవచనము వింటున్నప్పుడు, మధ్యలో ఒక నిముషము 
ప్రజ-పద్యం కూటమిలోకి తొంగి చూడగానే  
"జయము, దాని పర్యాయపదమో ఉండాలి. తేలిక పదాలతో మత్తేభ శార్దూలాలలో 
ఒక పద్యం వ్రాద్దామా ఇవాళ." అని అనంతకృష్ణ గారు పెట్టిన సందేశము కనిపించినది. 
వెంటనే  పొంగిన / పొంగించిన  పలుకులు. 
   
--

గణములు - స,భ,ర,న,మ,య,వ.     యతి- 14 

--

సద్గురుదేవులు శ్రీ స్వామీజీ నిర్వహిస్తున్న "కన్నడ భాగవత సప్తాహము" లో 
వారిది నేటి ప్రవచనము వింటున్నప్పుడు, మధ్యలో ఒక నిముషము 
ప్రజ-పద్యం కూటమిలోకి తొంగి చూడగానే  
"జయము, దాని పర్యాయపదమో ఉండాలి. తేలిక పదాలతో మత్తేభ శార్దూలాలలో 
ఒక పద్యం వ్రాద్దామా ఇవాళ." అని అనంతకృష్ణ గారు పెట్టిన సందేశము కనిపించినది. 
వెంటనే పొంగించిన  పలుకులు. 

__._,_.___

Posted by: suprabha u <saarada@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] క్రొత్త విఱుపుతో రథోద్ధత వృత్తము #krotta vi~ruputO rathOddhata vRttamu#

క్రొత్త విఱుపుతో రథోద్ధత వృత్తము - 

నాకు ఇష్టమైన వృత్తములలో రథోద్ధత వృత్త మొకటి. ఇందులో చతుర్మాత్రలు కాని రెండు అష్టమాత్రలు గలవు - UIU III - UIUIU. దాని అమరికను చూస్తూ ఉంటే దానిని రెండు త్రిమాత్రలుగా, రెండు పంచమాత్రలుగా కూడ విఱిచి వ్రాయ వచ్చును అనే అభిప్రాయము కలిగినది. దాని ఫలితమే ఈ పద్యములు. 

రథోద్ధత - ర/న/ర/లగ UI UI - IIUI UIU
11 త్రిష్టుప్పు 699

రాత్రిలోని - రమణీయ కాంతిలో 
ధాత్రి వెల్గె - ధవళాంశ గోళమై 
గాత్రమందు - గమకాల వంపులో 
చిత్రమైన - చెలువంపు సొంపులే 

నింగియందు - నెల పూచెఁ బువ్వుగా 
రంగు నిండె - రసరాగ దీప్తిలో 
పొంగుచుండు - పులకింత జ్ఞప్తిలో 
సంగమమ్ము - సరసా యదెప్పుడో 

ఆటలాడు - మరుసమ్ము నందగాఁ 
బాట పాడు - వశమౌదు నాగమై 
నీటుగాను - నిశిలోన నిత్తు నీ 
నోటి కొక్క - నునులేఁత ముద్దు నేన్ 

సుందరమ్ము - సుధ చిందు రేయి నీ 
యంద మొక్క - యపురూప దృశ్యమే 
మందహాస - మకరంద మాధురిన్ 
నందసూన - నగుమోము చూపరా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
krotta vi~ruputO rathOddhata vRttamu - 

nAku ishTamaina vRttamulalO rathOddhata vRtta mokaTi. iMdulO chaturmAtralu kAni reMDu ashTamAtralu galavu - #UIU III - UIUIU#. dAni amarikanu chUstU uMTE dAnini reMDu trimAtralugA, reMDu paMchamAtralugA kUDa vi~richi vrAya vachchunu anE abhiprAyamu kaliginadi. dAni phalitamE ee padyamulu. 

rathOddhata - ra/na/ra/laga #UI UI - IIUI UIU#
11 trishTuppu 699

rAtrilOni - ramaNIya kAMtilO 
dhAtri velge - dhavaLAMSa gOLamai 
gAtramaMdu - gamakAla vaMpulO 
chitramaina - cheluvaMpu soMpulE 

niMgiyaMdu - nela pUche@M buvvugA 
raMgu niMDe - rasarAga dIptilO 
poMguchuMDu - pulakiMta j~naptilO 
saMgamammu - sarasA yadeppuDO 

aaTalADu - marusammu naMdagA@M 
bATa pADu - vaSamaudu nAgamai 
nITugAnu - niSilOna nittu nI 
nOTi kokka - nunulE@Mta muddu nEn 

suMdarammu - sudha chiMdu rEyi nI 
yaMda mokka - yapurUpa dRSyamE 
maMdahAsa - makaraMda mAdhurin 
naMdasUna - nagumOmu chUparA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] రచ్చబండ కవితలు

Take Home Message

It is a house of prayer

There is a Golden Organ in the backdrop

There is a ten foot long Fazioli

Concert Grand Piano on the stage.

The Oriental pianist serene and sweet

Slim and slender

Wearing a long floating dress

With swirling skirts around her ankles

Floated onto the stage, takes a preliminary bow

To play the 24 preludes Of Fryderyk Chopin

She plays them ardently, tenderly, briskly,

Longingly, hauntingly, brilliantly; an hour goes by.

When she took her final deep bows

Acknowledging the applause,

Turning to all corners of the audience

The slender waisted she,

O! What a sweet vision she was!

The memory of all twenty four of Chopin

Vanished in a moment;

After all!  Man's Music is ephemeral

But the vision of tops of her two breasts,

Remained, forever in the minds of people

Those are God's sensational art work

And it is the House of God! After All!

Lyla

__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (139)