[racchabanda] మఱి కొన్ని గీతిరవములు #ma~ri konni gItiravamulu#

 

మఱి కొన్ని గీతిరవములు - 

గీతిరవము - సూ/సూ - ర/లగ // ఇం/ఇం - ర/లగ

వదన మొక్క - పంకజమ్మొ స-
మ్ముదమున నూఁగెడు - మోహడోలయో 
సదమలమగు - చంద్రబింబమో 
నిదురను నిండిన - నెమ్మి మైకమో 

చంచలములు - చారు కేశముల్ 
కాంచన భూషలు - గాంచ నందముల్ 
ముంచితి నను - మోద వార్ధిలో 
నెంచఁగ వెలుపలి - కెట్లు వత్తునో 

మింటను బలు - మేఘమాలికల్ 
కంటిని గత్తుల - కాంతి పుంజముల్ 
వింటిని గడు - పెద్ద గర్జనల్ 
వెంటను వచ్చెను - వేగ వర్షముల్ 

పాయకుండఁ - బాడుమా సకీ 
కోయిలల్ నిద్రలోఁ - గూయవే చెలీ 
రేయిలోనఁ - బ్రేమగీతికన్ 
హాయిగాఁ దీయఁగా - హర్షమీయఁగా 

ప్రేమ యనఁగఁ - బెద్ద గుండెయో 
కోమలమ్మగు నీదు - కొంటె చూపులో 
ఏమి మాయ - లేమి మాయలో 
నామనమ్మున జల్లు - నవ్వు పువ్వులో 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ma~ri konni gItiravamulu - 

gItiravamu - sU/sU - ra/laga // iM/iM - ra/laga

vadana mokka - paMkajammo sa-
mmudamuna nU@MgeDu - mOhaDOlayO 
sadamalamagu - chaMdrabiMbamO 
niduranu niMDina - nemmi maikamO 

chaMchalamulu - chAru kESamul 
kAMchana bhUshalu - gAMcha naMdamul 
muMchiti nanu - mOda vArdhilO 
neMcha@Mga velupali - keTlu vattunO 

miMTanu balu - mEghamAlikal 
kaMTini gattula - kAMti puMjamul 
viMTini gaDu - pedda garjanal 
veMTanu vachchenu - vEga varshamul 

pAyakuMDa@M - bADumA sakI 
kOyilal nidralO@M - gUyavE chelI 
rEyilOna@M - brEmagItikan 
hAyigA@M dIya@MgA - harshamIya@MgA 

prEma yana@Mga@M - bedda guMDeyO 
kOmalammagu nIdu - koMTe chUpulO 
Emi mAya - lEmi mAyalO 
nAmanammuna jallu - navvu puvvulO 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

www.telugubhakti.com Digest Number 4894

1 Message

Digest #4894

Message

Wed Mar 13, 2019 9:32 pm (PDT) . Posted by:

Hey,

I just signed the petition "Defence Minister : Boing Max Grounded after 2
crashes not MiGs after dozens Are IAF pilots expendable ?" and wanted to
see if you could help by adding your name.

Our goal is to reach 100 signatures and we need more support. You can read
more and sign the petition here:

http://chng.it/8rMm4K65G9

Thanks!
Krishnaiah V
www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

[racchabanda] గీతిరవము #gItiravamu#

 

గీతిరవము - 

ఆధారము - కల్పితము 
ఇది ఒక అర్ధసమ గీతి. మొదటి భాగములో అంశ లేక ఉపగణములు దీనికి. రెండవ  భాగములో ర/లగ గణములు, అనగా UIUIU. ఇది సంస్కృతములోని వైతాళీయమువంటిది. 

బేసి పాదములు - రెండు సూర్య గణములు - ర/లగ 
సరి పాదములు - రెండు ఇంద్ర గణములు - ర/లగ 

గీతితో ర/వ గణములు ఉండడము వలన దీనికి గీతిరవము అని పేరు నుంచినాను. క్రింద నా ఉదాహరణములు - 

గీతిరవము - సూ/సూ - ర/లగ // ఇ/ఇం - ర/లగ

రమ్ము వేగ - రాగమాలికా 
నమ్మితి నిన్నెద - నన్ను జూడవా 
కమ్మనైన - కావ్యగీతికా 
చిమ్ముచు మాధురిఁ - జెన్ను పాడవా 

మనసు పిలిచె - మంజులమ్ముగాఁ 
గన నిన్ను రమ్మంచుఁ - గామినీమణీ 
ప్రణయ సరసి - పంకజమ్ముతో 
దినమెల్లఁ గొలువనా - తెల్పు మోచెలీ 

గీతి రవము - గీములో సదా 
ప్రీతితో విన రమ్ము - ప్రేమ పొంగఁగాఁ 
బ్రాత కాని - పంథమందు సం-
గీతమ్ము సరసమ్ము - కృష్ణమోహనా 

వందనముల - వాణి కిత్తు నా-
నందమ్ము మాఱఁగా - నాదబిందువై 
సుందరంపు - సోమకాంతిలో 
మంద గీతిరవాల - మార్దవమ్ముతో 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
gItiravamu - 

aadhAramu - kalpitamu 
idi oka ardhasama gIti. modaTi bhAgamulO aMSa lEka upagaNamulu dIniki. reMDava bhAgamulO ra/laga gaNamulu, anagA #UIUIU#. idi saMskRtamulOni vaitALIyamuvaMTidi. 

bEsi pAdamulu - reMDu sUrya gaNamulu - ra/laga 
sari pAdamulu - reMDu iMdra gaNamulu - ra/laga 

gItitO ra/va gaNamulu uMDaDamu valana dIniki gItiravamu ani pEru nuMchinAnu. kriMda nA udAharaNamulu - 

gItiravamu - sU/sU - ra/laga // i/iM - ra/laga

rammu vEga - rAgamAlikA 
nammiti ninneda - nannu jUDavA 
kammanaina - kAvyagItikA 
chimmuchu mAdhuri@M - jennu pADavA 

manasu piliche - maMjulammugA@M 
gana ninnu rammaMchu@M - gAminImaNI 
praNaya sarasi - paMkajammutO 
dinamella@M goluvanA - telpu mOchelI 

gIti ravamu - gImulO sadA 
prItitO vina rammu - prEma poMga@MgA@M 
brAta kAni - paMthamaMdu saM-
gItammu sarasammu - kRshNamOhanA 

vaMdanamula - vANi kittu nA-
naMdammu mA~ra@MgA - nAdabiMduvai 
suMdaraMpu - sOmakAMtilO 
maMda gItiravAla - mArdavammutO 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___