Re: [racchabanda] Cloud No. 9 :-)

adbhutam gA   umdi  Suprabha    gArU.
Katta  G.     Murty.

On Mon, Apr 8, 2019 at 12:20 PM suprabha u saarada@yahoo.com [racchabanda] <racchabanda@yahoogroups.com> wrote:

Cloud No. 9 :-)
=============

మాత్రాబద్ధము (19)

అల నీలి గగనాన ... తేలేటి మేఘం
పైపైన హాయిగా సాగేటి విహగం

అవనిపై ఠీవిగా ఊగేటి వృక్షం
తరువుపై తీయగా సాగేటి గానం

దోబూచు లాడుతూ దాగేటి అందం
మేఘాల మధ్యగా ప్రసరించు పుంజం

తనువునే వెచ్చగా తాకేటి కిరణం
మెల్లగా చల్లగా వీచేటి పవనం

కొలనులో చిన్నగా నవ్వేటి కమలం
పూవులో తేనెకై వ్రాలేటి భ్రమరం 

అలలపై తెల్లన్ని రాయంచ పయనం
తళతళా మెరిసేటి కెరటాల విభవం

కన్నులకు పండుగగ దోచేటి దృశ్యం
ఎదలోన కమ్మగా రేపేను భావం
ఎదలోన కమ్మగా రేపేను భావం

ఊహలను తేలేను ఈ వనిత హృదయం
పరుగులను తీసేను పాటగా కవనం...#

సుప్రభ

--

some one asked me that day,long time ago :-).."what it means to be on
cloud no.9 ?"

one look at the blue skies..passing clouds..an ordinary scene.. during
lunch break...gaeyaM started rolling..That's how it feels to be on
cloud no.9

---

వాడుక భాషలో వ్రాయబడిన గేయము. 
మే 12, 1999 న "తెలుసా" యాహూ కూటమిలో ప్రచురించినది.
ఒకటి రెండు అతిస్వల్పమైన సవరణలతో మరల  మిత్రులతో పంచుకొనబడుతున్నది. 
__._,_.___

Posted by: Katta Murty <murty@umich.edu>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] Cloud No. 9 :-)

Cloud No. 9 :-)
=============

మాత్రాబద్ధము (19)

అల నీలి గగనాన ... తేలేటి మేఘం
పైపైన హాయిగా సాగేటి విహగం

అవనిపై ఠీవిగా ఊగేటి వృక్షం
తరువుపై తీయగా సాగేటి గానం

దోబూచు లాడుతూ దాగేటి అందం
మేఘాల మధ్యగా ప్రసరించు పుంజం

తనువునే వెచ్చగా తాకేటి కిరణం
మెల్లగా చల్లగా వీచేటి పవనం

కొలనులో చిన్నగా నవ్వేటి కమలం
పూవులో తేనెకై వ్రాలేటి భ్రమరం 

అలలపై తెల్లన్ని రాయంచ పయనం
తళతళా మెరిసేటి కెరటాల విభవం

కన్నులకు పండుగగ దోచేటి దృశ్యం
ఎదలోన కమ్మగా రేపేను భావం
ఎదలోన కమ్మగా రేపేను భావం

ఊహలను తేలేను ఈ వనిత హృదయం
పరుగులను తీసేను పాటగా కవనం...#

సుప్రభ

--

some one asked me that day,long time ago :-).."what it means to be on
cloud no.9 ?"

one look at the blue skies..passing clouds..an ordinary scene.. during
lunch break...gaeyaM started rolling..That's how it feels to be on
cloud no.9

---

వాడుక భాషలో వ్రాయబడిన గేయము. 
మే 12, 1999 న "తెలుసా" యాహూ కూటమిలో ప్రచురించినది.
ఒకటి రెండు అతిస్వల్పమైన సవరణలతో మరల  మిత్రులతో పంచుకొనబడుతున్నది. 

__._,_.___

Posted by: suprabha u <saarada@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] కల -- కాదు .....

కల -- కాదు ..

=============

--

కల- కాదు, కాబోదు కల్ల యెటు 
తలి కౌగిలింతలోఁ దన్మయము 
తలి దీవనే యౌను దథ్యముగ 
అలరించ నరుదెంచె నావిధిగ
--
అపురూపమైనదౌ నా కాన్క
కృపతోడ నిచ్చెలే గిరికన్య
విపరీతమవఁ బోదు విధి వ్రాత 
తపసివై జీవించఁ దగు నీకు

--

ద్విపద (చతుష్పదలుగా )

--

కలలోన నీకందె ఘనమైన శక్తి 
కలమింక సాగంగఁ గడువేగ వేగ 
కలుగవే శంకలున్ గలమాడ నింక 
పలుకుటే యిఁకపైన బ్రతిరోజు నలరి 
--
చిత్త శుద్ధిని మెచ్చి చేర్చి కౌగిలిని
బత్తితోఁ బాటుగా భాగ్యమ్ము మిగుల 
మెత్తనౌ నవ్వుతో మేలుగాఁ బలికి
క్రొత్త వత్సరమందుఁ గూర్మి దెల్పినది 
--
కానవచ్చును మార్పు క్రమముగా నీకు 
మానసంబున నిల్పి మాత రూపమదె 
ధ్యానమగ్నవు గాఁగఁ దలఁపులో నందు 
మౌని వందిత మాట మధురమై సతము 
--
అబ్బురంబగుచుండు నందువన్నియును 
దబ్బరల్ గాకుండ దనివి గూర్చువయి 
నిబ్బరంబుగ నీవు నీదారి నేఁగఁ 
గబ్బంబులవియెన్నొ కాన్కలై కూరు

ఆరోగ్యమును గూడ నంబ సత్కృపను
జేరువై యే నాఁడు సేవించుకొనుచు 
ధీరవై కయికొన్న దీక్ష పాటించి 
పారమంటెదవీవు భవములున్ బాయ

1:10 PM
04-05-2019

--

కవిత వెనుక కథ 
-----------------------

నిన్న దినమంతా కుదరక, సాయంకాలము పూజ చేసికొంటున్నప్పుడు చివరగా లలితా సహస్రనామము చదువమని చెప్పారు.ఈ రోజు అనుకున్నవి పూర్తికావాలంటే యింకా చాలా సమయము కావాలి. ఎక్కువ టైమ్ కూడా లేదు. ఇప్పటికి త్రిశతి తొమ్మిది సార్లు చదివాను. దానితో తృప్తి పడవచ్చు. తప్పనిసరి యయితే అనుకున్నవి పూర్తియయిన తరువాత చదువుతాను అని నమస్కారము జేసి లేచి నాపనులు మొదలుబెట్టాను. తరువాత అవీ ఇవీ అన్నీ పూర్తియయి, హైదరాబాద్ నుండి ప్రసారమయిన యుగాది కార్యక్రమము జూచేసరికి 
దాదాపు తెల్లవారు ఝామున నాలుగున్నర దాటినది. అయినా లలితాసహస్రనామము చదువుకొనుట ప్రారంభించాను. ఇప్పుడు మొదలుబెట్టున్నావెందుకు అని అడిగారు.
"చెప్పాను గదా! అనుకున్నవి యన్నీ యయిన తరువాత తప్పక చదువుతానని." యని పూర్తి చేసేటప్పటికీ దాదాపు ఐదు గంటలయినది. పుస్తకము మూసి, లైట్ దీసి 
"అన్న మాట నిలుపుకున్నాను. పోస్ట్ చేయవలసినది గూడ చేసేశాను. ఇక పడుకోబోతున్నాను.మీకు గుడ్ మార్నింగ్. నాకు గుడ్ నైట్" :-) అని కళ్ళు మూసికొన్నాను.
ఎప్పుడు నిద్ర పట్టినదో. కలలోకి వచ్చి చిరునవ్వుతో నేవో నాలుగు మాటలు మాట్లాడి అక్కున జేర్చుకొని గాఢమైన కౌగిలినిచ్చి అలాగే ఒక పదినిముషాలున్నారు. (అలా అనిపించింది కలలో) లేచిన తరువాత ఆశ్చర్యము /ఆనందము కలగాపులగమైన స్థితిలో మామూలు కలా లేక యేదైనా అంతరార్థమున్నదా అని అనుకుంటూ వేరే పనిలోకి జారుకున్నాను. అది నిజముగానే జరిగినదని,కారణమున్నదని నిర్ధారణ చేస్తూ, అందరితో పంచుకునేలా కవితగా తానే మరల యీవిధిగా పలికారు.

2002/3 లో ఒకసారి యిలాగే అయినది.. అప్పటికి కొన్ని యేండ్లుగా సరస్వతీ రూపములో మాట్లాడుతూ కలము నడిపించి, సరియైన సమయమనుకొని ప్రత్యక్షంగా, గురురూపములో, స్వామీజీ గా నా జీవితములోనికి వచ్చిన క్రొత్తలో, నేనే అమ్మను అని మాట్లాడుతూ, కవితలల్లిస్తుంటే నమ్మలేక, బాధతో వాదించానొకరోజు." అమ్మను అమ్మను అంటావు. ఇంత ఆలస్యముగా ఎందుకొచ్చావు నా జీవితములోనికి? ఎన్నో సార్లు నేనుండే చోటికి దగ్గరగా వచ్చి కూడా నీ ముఖము జూపించలేదు, దగ్గరకు రప్పించలేదు, కూతురినని నీ ప్రేమ తెలుపలేదు. అమ్మగా ఒక చీర బెట్టలేదు . కానుకీయలేదు. ఏ అమ్మ కూతురిని దగ్గరకు జేర్చకుండా ఉంటుంది? ప్రేమ బంచకుండా ఉంటుంది? నువ్వు అమ్మవూ కాదు. బొమ్మవూ కాదు. మరల అమ్మనని యింకెప్పుడూ మాట్లాడకు" అని. తరువాత కొన్ని రోజులకిలాగే కలలోకి వచ్చి కౌగిలినిచ్చి అడిగారు. ఇప్పుడు తృప్తి గలిగినదా? అమ్మనే యని నమ్ముతావా? అని.

ఈ రోజు అలాటి వాదనేమీ జరుగ లేదు కానీ, అన్న మాట నిలుపుకొని అంత ఆలస్యముగా నయినా లలితాసహస్రము చదివానని సంతోషము కలిగినదో లేక ఈ యుగాదికిటువంటి బహుమతి నివ్వాలని ముందే నిర్ణయించుకున్నారో తెలియదు. ఇచ్చిన శక్తి గురించి ,జరుగబోయే వానిని గురించి నాకేమీ తెలియదు. కానీ కలలో జరిగినది మాత్రము వారన్న రీతిగానే ఒక అపూర్వమైన కానుక. యుగాది బహుమతి/దీవన నందించి వికారి నామ వత్సరమునిలా ప్రారంభింపజేసిన శ్రీ సద్గురు/ శారదాంబ/శ్రీమాత కృపకు, ప్రేమకు అంజలి ఘటించి, వారి పాదారవిందయుగళికి భక్తిపూర్వక ప్రణామాలు సమర్పించుకొంటున్నాను.

__._,_.___

Posted by: suprabha u <saarada@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] రచ్చబండ కవితలు

Self-Indulgenceఆ చూసొచ్చిన చుట్టాల ఉద్యానం మోజులో

అవ్వాలనిపించింది ఆమెకూ ఎర్రని పువ్వులా.

అన్ని గోళ్లకూ తాజా ఎఱుపు రంగులు వేసి

క్షణాల్లో సృష్టించింది సొంతంగా ఎర్ర మొగ్గలు!

పెదాలపై మెఱుపు ఛాకలెట్ ఎఱుపు

కన్నులపై ఎన్నో ఛాయల నీలాలు,

కపోలాలపై తళుకు పసుపు, ఊదాలు.

చెంపలపై చేతివేళ్లు చేర్చి, మీటుతూ

అద్దంలో ఆలోకించినప్పుడు 

మరుక్షణంలో విరియబోయే ఇక్సోరా మొగ్గల భ్రమ

ఆదిలో కలిగినా;

విడివడి అంతలో ముఖాన్ని కమ్మిన కేశం

ఉత్తేజితం, ఘనం ఐనందున

మోహంతో గాజుఫలకాలలో ప్రతిబింబాలలో

ఆ పిమ్మట ఆమె వీక్షించింది

చటుకు చటుకూ తళుక్కని అంతర్హితమౌతున్న

విబ్జియార్మెఱుపుల నర్తనాలు.

Lyla

Bryan Kelly, A publisher of a small 'North Naples Neighbors' exclusive magazine says about April:

"There is uncertainty on how this month got its name. It has been suggested that it came from the Roman word "Aprilis" which means "to open." Other historians believe it came from Aphrodite, the Greek name for Goddess of Love.

__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (145)