[racchabanda] ఎంత భాగ్యమగునొ ...

 

ఎంత భాగ్యమగునొ ...

===================

--

ఉత్సాహభేదము

--
గణములు--6 సూ. 1 ఇం. ( భ/నల )
యతి - ఐదవ గణము మొదటి యక్షరము.
--

పచ్చనైన గడ్డిలోనఁ బరిమళించె నొక్కటి 
విచ్చుకొన్న పూవుఁ జూడ వేడుకాయె మనసుకు 
తెచ్చిపెట్టినట్టులెవరొ తీరుగాను నాకయి 
సొచ్చెమైన నవ్వుతోడఁ జూపెఁ జెలువ మయ్యది 
--
రకరకాల పూలతోడ రమ్యమగుచు నున్నది 
ప్రకృతిలోని శోభలన్ని పరవశమ్ము గూర్చును
ఒకట? రెండ?సెప్ప వాని నుర్వినేరి తరమగు
ప్రకటమగును ఋతువు మారి రాగ మరల యామని
--
కాలచక్రమేగుచుండ గతినిఁ దప్పకుండఁగ 
నేల నింగి రెండు వెలుఁగ నీరజాప్తు కాంతులఁ 
దేలియాడు నామనమ్ము తీపితీపి యూహల 
నాలపించు గానమేదొ యరసి ప్రకృతి శోభల 
--
కాని ఖర్చు లేదు నాకుఁ గాంచ దాని యందము 
వేనవేల చిత్రములవి వేగ వేగ మారుచుఁ 
గానుపించునబ్బురముగఁ గనులముందు నిత్యము 
మౌనముగనె మ్రొక్కులిడఁగ మాతసృష్టి నెంచుచు 
--
ఎంత నేర్పు కలదొ తనకు నిట్టి సృష్టి చేయఁగ
ఎంత యోర్పు కలదొ తనకు నిన్ని కృతుల సలుపఁగ 
ఎంత ప్రేమ కలదొ తనకు నిట్టి కాన్క లీయఁగ 
ఎంత కొలుచుకున్నఁ దనకు నీయఁగలమ తగినది 
--
మొగము సూపకున్నఁగాని ముందు నిలిచి పుడమిని 
యుగయుగమ్ములిటులఁ బ్రజల నుల్లసిల్లఁ జేయుచు 
జగతి పాలనమును సలుపు శక్తి యుక్తు లొప్పఁగ 
తగవు లేక యెవరితోడఁ దనరుచుండి మిన్నఁ గ 
--
యుక్తమైన దారిలోన నొప్పుగాను నడపుచు 
రిక్తహస్త కాక యెపుడుఁ బ్రీతి నొసఁగి కామ్యము
భక్తకోటి కిచ్చుఁ దానె వలయునట్టి ప్రేరణ 
ముక్తి పథము పైన నేఁగఁ బూన్కి నెపుడు వీడక 
--
చింతలన్ని తొలఁగఁజేసి చేయుచుండు సాయము
శాంతినింపి గుండెలందు సౌఖ్యమిచ్చు ననయము
కాంతి తానె పంచు మనకుఁ గాన లోని రూపము 
ఎంత భాగ్యమగునొ మనది యిట్టి తల్లినందఁగ

--

సుప్రభ 
1:47 AM 
04-17-2019__._,_.___

Posted by: suprabha u <saarada@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] కన్నడ త్రిపదిలో ఒక క్రొత్త పంథా #kannaDa tripadilO oka krotta paMthA#

 

కన్నడ త్రిపదిలో ఒక క్రొత్త పంథా - 

త్రిపదికి గణములు - 
మొదటి పాదము - ఇం/ఇం - ఇం/ఇం (ప్రాస యతి)
రెండవ పాదము - ఇం/సూ - ఇం/ఇం 
మూడవ పాదము - ఇం/సూ/ఇం

రెండవ పాదములో చివరి ఇంద్ర గణమును వదలితే . రెండవ, మూడవ పాదములకు భేదము లేదు. ఆ అదనపు ఇంద్ర గణమును ఒక ప్రత్యేకమైన ఊత పదముగా వాడితే త్రిపదికి ఒక లయ సిద్ధిస్తుంది. క్రింద నేను త్రిపదిని ఐదు పాదములుగా వ్రాసినాను. అవి - 
1. ఇం/ఇం
2. ఇం/ఇం
3. ఇం/సూ/ఇం
4. ఇం
5. ఇం/సూ/ఇం 

నాలుగవ ఇంద్రగణపు పాదము లేకున్నను, పద్యము అర్థవంతముగా నుంటుంది. 

క్రింద కొన్ని ఉదాహరణములు - 

ఎందుకో యీరోజు
సుందరీ నిను జూడ 
డెందమ్ము గోరె నిజముగా 
విందుగా 
మందహాసాన ముందు రా 

ఆకాశవీథిలో 
రాకాసుధాకరుం
డేకారణాన రాకుండె  
నాకిందుఁ 
జీకట్లలోన నిశ్వాస 

ఆడుమా నృత్యమ్ము
పాడుమా గీతమ్ము 
తోడుగా రమ్ము నేనుందు 
నీడగా 
వీడఁగా లేను నేనెందు 

మోదముల కలలో 
నాదముల సెలలో 
నీఁదంగ రమ్ము హృదిలోని 
వేదాల 
నాదమ్ము ప్రేమ ఘోషలే 

మురళిని మ్రోఁగించు 
స్వరములఁ బలికించు 
మరుదైన గీతి వినిపించు 
హరి నన్ను 
మురిపించు సుధను జిలికించు 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
kannaDa tripadilO oka krotta paMthA - 

tripadiki gaNamulu - 
modaTi pAdamu - iM/iM - iM/iM (prAsa yati)
reMDava pAdamu - iM/sU - iM/iM 
mUDava pAdamu - iM/sU/iM

reMDava pAdamulO chivari iMdra gaNamunu vadalitE . reMDava, mUDava pAdamulaku bhEdamu lEdu. aa adanapu iMdra gaNamunu oka pratyEkamaina oota padamugA vADitE tripadiki oka laya siddhistuMdi. kriMda nEnu tripadini aidu pAdamulugA vrAsinAnu. avi - 
1. iM/iM
2. iM/iM
3. iM/sU/iM
4. iM
5. iM/sU/iM 

nAlugava iMdragaNapu pAdamu lEkunnanu, padyamu arthavaMtamugA nuMTuMdi. 

kriMda konni udAharaNamulu - 

eMdukO yIrOju
suMdarI ninu jUDa 
DeMdammu gOre nijamugA 
viMdugA 
maMdahAsAna muMdu rA 

aakASavIthilO 
rAkAsudhAkaruM
DEkAraNAna rAkuMDe  
nAkiMdu@M 
jIkaTlalOna niSvAsa 

aaDumA nRtyammu
pADumA gItammu 
tODugA rammu nEnuMdu 
nIDagA 
vIDa@MgA lEnu nEneMdu 

mOdamula kalalO 
nAdamula selalO 
nI@MdaMga rammu hRdilOni 
vEdAla 
nAdammu prEma ghOshalE 

muraLini mrO@MgiMchu 
svaramula@M balikiMchu 
marudaina gIti vinipiMcu 
hari nannu 
muripiMchu sudhanu jilikiMchu 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___