[racchabanda] గీతి ఛందములతో పాట - 3 #gIti ChaMdamulatO pATa - 3#

గీతి ఛందములతో పాట - 3

పల్లవి - గోమేధిక - 11 ఇం/సూ - ఇం/సూ కూరిమిగీతి లేక మంజులగీతి 
చరణము - గోమేధిక - 9 ఇం/ఇం - ఇం/సూ ద్విపదగీతి లేక ఆందోళికా 

కొలువున నుండెఁ - గోదండపాణి 
యెడమన నుండె - హృదయేశి రాణి 
సలలిత మదియు - సర్వమ్ము కాంతి 
మలవలె వాఁడు - మనకిచ్చు శాంతి

మందార మకరంద - మధురమ్ము వాఁడు 
సౌందర్య గగనానఁ - జంద్రుండు వాఁడు 
ఇందీవరాక్షుండు - హృదయాల ఱేఁడు 
కందర్పరూపుండు - కౌసల్య సుతుఁడు 

కొలువున నుండెఁ - గోదండపాణి 
యెడమన నుండె - హృదయేశి రాణి 

ఒక మాట యది సత్య - ముర్వినే నింపు 
ఒక బాణ మది యెప్పు - డోగులన్ జంపు 
ఒక భార్య సీత యా - యోర్మికే పేరు 
ఒక దేవుఁ డతని కీ - యుల్లమే యూరు

కొలువున నుండెఁ - గోదండపాణి 
యెడమన నుండె - హృదయేశి రాణి 

శ్రీరామ యని తల్వ - సిరుల నందిచ్చు 
శ్రీరామునిన్ గొల్వఁ - బ్రేమతో మెచ్చు 
శ్రీరామ యని పాడఁ - జిత్తమందాడు 
శ్రీరాముఁడే త్రాడు - శ్రీరాముఁడే తోడు 

కొలువున నుండెఁ - గోదండపాణి 
యెడమన నుండె - హృదయేశి రాణి 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
gIti ChaMdamulatO pATa - 3

pallavi - gOmEdhika - 11 iM/sU - iM/sU kUrimigIti lEka maMjulagIti 
charaNamu - gOmEdhika - 9 iM/iM - iM/sU dvipadagIti lEka AMdOLikA 

koluvuna nuMDe@M - gOdaMDapANi 
yeDamana nuMDe - hRdayESi rANi 
salalita madiyu - sarvammu kAMti 
malavale vA@MDu - manakichchu SAMti

maMdAra makaraMda - madhurammu vA@MDu 
sauMdarya gaganAna@M - jaMdruMDu vA@MDu 
iMdIvarAxuMDu - hRdayAla ~rE@MDu 
kaMdarparUpuMDu - kausalya sutu@MDu 

koluvuna nuMDe@M - gOdaMDapANi 
yeDamana nuMDe - hRdayESi rANi 

oka mATa yadi satya - murvinE niMpu 
oka bANa madi yeppu - DOgulan jaMpu 
oka bhArya sIta yA - yOrmikE pEru 
oka dEvu@M Datani kI - yullamE yUru

koluvuna nuMDe@M - gOdaMDapANi 
yeDamana nuMDe - hRdayESi rANi 

SrIrAma yani talva - sirula naMdichchu 
SrIrAmunin golva@M - brEmatoe mechchu 
SrIrAma yani pADa@M - jittamaMdADu 
SrIrAmu@MDE trADu - SrIrAmu@MDE tODu 

koluvuna nuMDe@M - gOdaMDapANi 
yeDamana nuMDe - hRdayESi rANi 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] రచ్చబండ కవితలు

Pink Full Moon Song

సంగమించ తగునోయి

అంగన అందాల ప్రోవోయి ఈ రేయి.

రోమరోమంబున రతికాంక్ష రగిలి

అంగాంగముల అగ్గి కదిలేను

సారంగాంకుని చలువన

చెంగల్వ విరిసేను.

వినువీధి గమించు ఈ రాసి పూర్ణచంద్రుడు

విశుద్ధజ్యోత్సల రాజస్వి,

యుగయుగాల

బహువిధ తత్త్వజిజ్ఞాసుల తలపుల వెలుగిడిన

మాయామయ మోహన తేజస్వి.

అధిగమించి పోనీయనీ పర్వఘడియలు

ప్రణయ తాత్త్వికా! తనువున తనువై

తరింతుమోయీ.

Lyla

__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (305)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] గీతి ఛందములతో ఒక పాట #gIti ChaMdamulatO oka pATa#

గీతి ఛందములతో ఒక పాట - 

పల్లవి - ఇం/సూ/ఇం గణములు - నీల 3-3
చరణము - ఇం/సూ/ఇం/సూ గణములు - గోమేధిక 4-11 కూరిమిగీతి లేక మంజులగీతి 

తలచఁగా నామెఁ దలచఁగా 
నిలుచునా మనసు నిలుచునా 
యెడదలో నెంత వలపులో 
వలపులో నెన్ని మలుపులో 

పున్నమీ నాకుఁ - బున్నెమే లేదు 
వెన్నెలా యామె - ప్రీతితో రాదు 
బన్నమే నాదు - బ్రతుకులోఁ బాటు 
యెన్నడో యామె - యెడదలోఁ జోటు 

తలచఁగా నామెఁ దలచఁగా 
నిలుచునా మనసు నిలుచునా 

మొగములో బమ్మ - మొండిగా వ్రాసె 
సుగములన్ సంఖ్య - సున్నగాఁ జేసె 
నిగముగా మారు - హృదయమ్ము రేయి 
సగము నే మనిషి - సగము నే ఱాయి 

తలచఁగా నామెఁ దలచఁగా 
నిలుచునా మనసు నిలుచునా 

ఆ వెలుం గెందు - హర్షమ్ము లెందు 
భావనాదీప - భాసమ్ము లెందు
నావలోఁ జిల్లి - నడిసంద్రమందు 
దేవుఁడా చెప్పు - తీర మ్మదెందు 

తలచఁగా నామెఁ దలచఁగా 
నిలుచునా మనసు నిలుచునా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
gIti ChaMdamulatO oka pATa - 

pallavi - iM/sU/iM gaNamulu - nIla 3-3
charaNamu - iM/sU/iM/sU gaNamulu - gOmEdhika 4-11 kUrimigIti lEka maMjulagIti 

talacha@MgA nAme@M dalacha@MgA 
niluchunA manasu niluchunA 
yeDadalO neMta valapulO 
valapulO nenni malupulO 

punnamI nAku@M - bunnemE lEdu 
vennelA yAme - prItitO rAdu 
bannamE nAdu - bratukulO@M bATu 
yennaDO yAme - yeDadalO@M jOTu 

talacha@MgA nAme@M dalacha@MgA 
niluchunA manasu niluchunA 

mogamulO bamma - moMDigA vrAse 
sugamulan saMkhya - sunnagA@M jEse 
nigamugA mAru - hRdayammu rEyi 
sagamu nE manishi - sagamu nE ~rAyi 

talacha@MgA nAme@M dalacha@MgA 
niluchunA manasu niluchunA 

A veluM geMdu - harshammu leMdu 
bhAvanAdIpa - bhAsammu leMdu
nAvalO@M jilli - naDisaMdramaMdu 
dEvu@MDA cheppu - tIra mmadeMdu 