[racchabanda] రచ్చబండ కవితలు

 

An essay

 

ఏల్చూరి మురళీధర రావు గారు వ్రాసిన శ్రీనాథుని కవితాదర్శం: లక్షణ పరిశీలన అన్న వ్యాసం సిరిమల్లె అను ఈ- తెలుగు పత్రికలో ఈ నెల, ప్రచురించబడింది. వ్యాసం లో ముఖ్యంగా చర్చించబడినది ఈ క్రింది పద్యం.

మ.

హరచూడా హరిణాంక వక్రతయు గాలాంత స్ఫురచ్చండికా

పరుషోద్ఘాడ పయోధర స్ఫుట తటీపర్యంత కాఠిన్యమున్

సరసత్వంబును సంభవించె ననగా సత్కావ్యముల్ దిక్కులం

జిరకాలంబు నటించుచుండు గవిరాజీ గేహ రంగంబులన్.

 

ఈ వ్యాసంలో ఇతర కవులు ఈ పద్యానికి తాత్పర్యం ఎలా చెప్పుకున్నారో ఉన్నది. ఈ పద్యం శ్రీనాథుని కవితా గుణాలనే తెలుపుతున్నట్టు, పద్యం ద్వారా శ్రీనాథుడు తన రచనలో ఎలాటి కవితాలక్షణాలు కనపించబోతాయో ముందుగానే పాఠకులకు సూచించినట్టు, శ్రీనాథుని మీద మునుపు వ్యాసాలు రాసిన కొందరి వ్యాసకర్తల అభిప్రాయమట.

 

మురళీధరరావు గారి ఉద్దేశంలో ఈ పద్యం అంత ససిగా లేదు. ఆయన చెప్పిన కారణాలు వివరంగా వారు రాసిన వ్యాసంలో చదవండి.

బహుశా, తాటి ఆకు పత్రాల తిరగరాతల్లో, శ్రీనాథుని పద్యం అచ్చుతప్పులకు గురి అయ్యుండాలి, అందువల్లనే ఈ పద్యంలో అన్వయం సరిగా కుదరటం లేదు. ఈ పద్యం రాయటానికి పరోక్షంగా కారణమైన ముందటి పద్యాలు ఇవి ఐ ఉంటాయని (తనవి, మరి ఒకరిద్దరి ఇతర కవుల ఉద్దేశాలు, ఊహలు) తెలిపారు. శ్రీనాథుడు మొదటికి ఇలా రాసి ఉండొచ్చు, అని ఊహ చేస్తూ, పైనిచ్చిన తెలుగు పద్యంలోని కొన్ని మాటలను సరిచేస్తూ,  అప్పుడు పద్యంలో వచ్చే అర్థం, ఆయన వ్యాసంలో చూపారు. (ఈ పద్యం గురించిన వారిద్దరి సంభాషణల సందర్భంలో,  తిరుమల దేశికాచార్యులు గారు సూచించిన  సవరణలు కూడా రెండు మూడు ఉన్నవి.)


మురళీధరరావు గారు చేసిన సవరణ, ఎంతో బాగుంది. The revised poem is so romantic. I love it for its own sake. The thoughts of Desikachari garu are equally interesting. వీరు తెలుగులోకి మారుస్తున్న ఇటాలియన్ ఆపెరాలను 'ఈమాట' పత్రికలో చదువుకుని ఆనందిస్తున్నాము గదా. ఏల్చూరి మురళీధరరావు, తిరుమల దేశికాచార్యులు - వీరిద్దరూ సృష్టికి ప్రతిసృష్టి చెయ్యగల పండితులు, కవులు. ఏల్చూరి వ్యాసంలో ఇన్ని అన్ని అని చెప్పలేనన్ని సాహిత్యవిశేషాలున్నవి. ఎన్నోసార్లు చదవవలసిన వ్యాసము. I am reading it with awe. 

 

Meantime;

వ్యాసంలో, శ్రీనాథుని పద్యాన్ని సవరించాల్సిన అవసరం ఉన్నదేమో అని ఏల్చూరి తనను తను ప్రశ్నించుకోవటమే కాక, ఇతరుల అభిప్రాయం ఏమిటీ? అని అడుగుతున్నట్టు నాకు తోచింది. అందుకని; శ్రీనాథుడి రచనలు కొన్ని తిప్పిచూసాక, ఈ పద్యం పై నా ఆలోచనలు, అభిప్రాయాలు రాస్తున్నాను.


నాకైతే, వ్యాసములో ఇవ్వబడిన ముద్రణ లోని పద్యం ఏమీ మార్చకుండానే, అది శ్రీనాథుడు రాసిందే అనుకోటానికి ఏం అభ్యంతరం లేదు. మార్చకుండా అలానే చదువుకోటానికి అభ్యంతరం లేదు.

ఈ పద్యం, శ్రీనాథుడు రచించిన శ్రీభీమేశ్వర పురాణము లో 'ఇష్టదైవతా ప్రార్ధన' తరవాత వచ్చే 'పురాతన కవీంద్ర గుణకీర్తన' పద్యాలలో చివరి పద్యంగా వస్తుంది. ఆ తర్వాత 'కుకవి నిరాకరణం' వస్తుంది.

 

ఇష్టదేవతల్లో వినాయకుని, కృష్ణుడిని, సరస్వతిని ( అందులోనే లక్ష్మి పేరు కూడా తెస్తూ) స్మరించాడు. ఆ పైన పురాతన కవులలో– వాల్మీకి, వ్యాస, కాళిదాసు, బాణభట్ట, ప్రవరసేన, శ్రీహర్ష, భాస, శివభద్ర, సౌమిల్ల, ఓల్ల, మాఘ, బిల్హణ, మల్హణ, భట్టి, చిత్తవ, దండి – అన్న వారందరినీ గౌరవంతో నమస్కరిస్తూ తలిచాడు. కవి పండితుడైన తన తాతగారు కమలనాభామాత్యుడిని కూడా స్మరించాడు. ( ఈ కవుల పేర్లు నాకు సరిగా తెలియక పోతే సందేహించకుండా సరిచేయండి.) ఇక్కడి, మత్తేభ, శార్దూల, కంద, సీస పద్యాలన్నీ చాలా బాగున్నవి.


ఆ తరవాతి ఈ పద్యం ఏం చేస్తున్నదంటే అంతకు ముందు చెప్పినవన్నీ ఒకచోటికి చేర్చి, సమన్వయ పరుస్తున్నది. This poem nicely ties up all that is said so far. And while doing it, I think it does something much more magical.

ఇప్పుడు మనం ఆలోచిస్తున్న పద్యం లో ఎందుకు నాకు, "గాలాంత స్ఫురచ్చండికా పరుషోద్ఘాడ పయోధర స్ఫుట తటీపర్యంత కాఠిన్యమున్" అన్న వాక్యం బాగా ఉన్నదంటే, 'కాలాంత స్ఫురచ్చండికా' లో  కాలాంతకుడు చండిక కలిపిన రూపం కనిపిస్తున్నది కనుక.

 

Grammar, literalistic interpretations of words, questioning the validity of incidents etc., -These don't work in Myth.  Joseph Campbell, an American professor of Literature, an eloquent speaker, world-wide revered scholar for his books on mythology, religion will not have any problem at all, to see Siva in there.

 

అలా కుదరదు, కాలమే ఇందులో మనం తలచాలి -అనుకున్నా కాని ఇది మనుష్యుల లెక్కలుకట్టే కాలం కాదు. దేవతలది.

కాలాంతం is not to be read in a cataclysmic, end of the world sense - like some religious may literally interpret. The entire sentence imparts a sense of fierce/harsh aspects of cosmic Siva-Parvathi. We get a split second, lightening flash visualization of High Mountain Peaks and ranges.

 

ఇవి హిందూ పురాణాలు, వీరు దేవతలు. దేవతల నివాస స్థానాలు చాలా దేశాల mythology లలో పర్వతాలు. Like Mt. Sinai, Mount Olympus, Himalayas) పర్వతపుత్రిగా పార్వతి కఠినత, గౌరీ కైలాసశిఖరాలు, పరిసర ప్రాంత పర్వత శ్రేణుల శిలా కాఠిన్యతలు అలాటి ఊహలు పాఠకులు చెయ్యవచ్చు. 

ఈ పద్యంలో చండిక పరుష స్తనానికి పక్క ప్రాంతంగా కాలాంతకుని కఠిన వక్షస్థలం తోస్తే తప్పు లేదు. అలా అనుకోటానికి బలం, నాకు శ్రీ నాథుని "హరవిలాసము' లోని శివుని ఈ మాటల నుండి వస్తుంది. ( ప్రథమాశ్వాసము. పద్యం 27.)


సీసము.

కమలాక్షి! ఇది ఏమిగా దలచితివిప్పుడర్ధదేహంబు నీయదియ కాదె?

హృదయంబు పొరువున హృదయముండుట లేదె యేకీభవించిన ఇరువురకును?

ఏ భావమైన నీ హృదయంబునకు దాపనేభంగి వచ్చు నా హృదయమునకు? - అన్నాడు శివుడు పార్వతితో.


ఆ పైన, అంత కఠినత్వంలోనూ, పార్వతీ పరమేశ్వరులు సదా కలిసి ఉండటంలో 'సరసత్వము,' ఉంది. శివుడు వెన్నెల రేకను ధరించటం లోనూ సరసత్వము ఉంది. పార్వతీ పరమేశ్వరుల కలయికను శబ్దార్థాల కలయికకు అన్వయించి అంతకు ముందే కాళిదాసు చెప్పే ఉన్నాడు. శ్రీ నాథుడి చిత్రణలో అదనంగా, సత్కావ్యంలో ఉండే వక్రోక్తికి చిహ్నంగా చంద్రుడు ఉన్నాడు.  చంద్రుని ప్రసక్తి ఇంక మరోసారి తేవలసిన అవసరం లేదు. 


(ఏల్చూరి ప్రస్తావించిన శృంగార నైషధం లోని - సరసత్వము, నిగూఢ కార్యఘటనా సంపత్తి, పురుషార్ధైక పరాయణత్వము, అభ్యుత్థాన లీలా ధురంధరతా ప్రౌఢి, కృతజ్ఞత, వాత్సల్యము, సద్భావము కల ఓ హంసా! - అని శ్రీనాథుడు చెప్పిన పద్యం లోని 'హంస' నిజానికి శివుడే కదా!  Ref: పీఠిక. విశ్వనాథ సత్యనారాయణ, శ్రీనాథుని శృంగార నైషధము, publishers, Emesco Books, Eluru Road, Vijayawada -2)


Yeah! I like all of that long phrase.  "కాలాంత స్ఫురచ్చండికా పరుషోద్ఘాడ పయోధర స్ఫుట తటీపర్యంత కాఠిన్యమున్." 


భాగవతంలో, గజేంద్ర మోక్షణలో బమ్మెర పోతన తన పద్యంలో-మందారవనాంతరామృతసర:ప్రాంతేందుకాంతోపలోత్పలపర్యంక రమావినోది – అని ఎందుకు ఆ సాగతీత! But we all love it.

Potana is taking us into the inner private gardens of Vishnu in వైకుంఠపురి. Here in, Srinatha is taking us into Kailasa heavenly mountain ranges.

 

మరి ఈ పద్యం లోని సత్కావ్యాలు ఎక్కడ ఉన్నయ్యి అంటే స్వర్గంలో ఉన్నయ్యి. దిక్కులు -నలుదిక్కులు, లేకుంటే ఎనిమిది కాపోతే పది దిక్కులనుకోండి. అవి స్వర్గంలోనే ఉన్నవి.  (దిక్కులు పిక్కటిల్లగా = while heavens resounded. Ref: ఆంధ్రభారతి నిఘంటువు.) దిక్కుల పాలకులంతా దేవతలు. దిక్పట్టణాలున్నయ్యి. (అష్టదిక్పాలకులు, వారి భార్యలు, నగరాల గురించి ఆంధ్రభారతి నిఘంటువు చూడండి.) ఆ పట్టణాల్లోనే సుకవులు ఎందరో ఉంటారు. సత్కావ్యాలు వారి గృహరంగాలలో నాట్యమాడుతుంటాయి. ఇంతకు ముందు పద్యాలలో శ్రీనాథుడు మెచ్చిన మహాకవులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వారంతా స్వర్గంలో ఉన్నారు.


కవిరాజీగేహ రంగమ్ములన్  - sounds good to me in this poem. I totally reject కవి రాజ్జిహ్వాగ్ర రంగంబులన్, కవిరాజీ వక్త్రరంగంబులన్. ఈ పద్యం లో సత్కావ్యాలు - కవుల నాలుకల మీద నటించటం  ప్రసక్తి శ్రీనాథుడు చెయ్యలేదు, ఇక్కడ చెయ్యడు. అటువంటి మార్పు ఈ పద్యంలో చెయ్యరాదు అనిపిస్తున్నది. ఎందుకంటే దీని తరువాత చెప్పిన కుకవులు గురించిన పద్యంలో వారి 'నాలుకలను, ముఖాలు/నోళ్లను ' చులకన చేసాడు. వారి మెదడులోని మసిలాటి సిరా, వారి నాలుకలనే గంటాలతో తాటాకుల మీద రాయటం చెప్పినాడు కదా! ఈ కుకవులు ఎక్కడ ఉన్నారు. భూమ్మీద ఉన్నారని చెప్పాడు స్పష్టంగా. సుకవులు స్వర్గంలో ఉన్నారు. 


Essentially, Srinatha conferred immortality on good poets and their Literary works. That is what he did in this poem.

I don't think changes are necessary. Suggested changes make the poem incompatible with rest of his poems right around it.

 

Lyla


PS: Thanks to K.V.S. Ramarao garu for giving link to a digitized version of Bhimeswara puranam. I am still reading. Thanks to Sayee garu, (for providing such links many times before, making me read Telugu classics, and) for giving us andhra bharathi, dictionary.


__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (151)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___