[racchabanda] లయగ్రాహి #layagrAhi#

 

లయగ్రాహి - 

సర్వత్రా ప్రాసయతి + అర్ధ పాదములకు అక్షరసామ్య యతి 

శ్యామలము దేహమది - యామనియె నీదు మది
కోమలము గాదె హృది - గోము కన నెందున్ 
నేమమున గొల్తు నిను - నే మదిని దల్తు నిను 
గీమునను గావు నను - క్షేమములు చిందున్ 
వ్యోమమునఁ దార మిస - యోమనెడు శక్తి పస 
ప్రేమ కొక క్రొత్త దెస - శ్రీమధుర ధామా 
రామ యన రాలు సిరి - రామ యనఁ బూయు విరి 
రామ యనఁ దోఁచు దరి - రామ హరి రామా  

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
layagrAhi - 

sarvatrA prAsayati + ardha pAdamulaku axarasAmya yati 

SyAmalamu dEhamadi - yAmaniye nIdu madi
kOmalamu gAde hRdi - gOmu kana neMdun 
nEmamuna goltu ninu - nE madini daltu ninu 
gImunanu gAvu nanu - xEmamulu chiMdun 
vyOmamuna@M dAra misa - yOmaneDu Sakti pasa 
prEma koka krotta desa - SrImadhura dhAmA 
rAma yana rAlu siri - rAma yana@M bUyu viri 
rAma yana@M dO@Mchu dari - rAma hari rAmA  

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] నిశికాంత #niSIkAMta#

 

నిశికాంత - 

ఆధారము - కల్పితము 
స్ఫూర్తి - రామదాసు

నిశికాంత - స/జ/స/జ/స/జ/స/జ IIUIUI IIUIUI IIUIUI IIUIUI
24 సంకృతి 11451116 

సర్వత్రా ప్రాసయతితో 

కరుణాలవాల - కరుణించ వేల - సరసాల లీల - మురిపించ వేల 
నిరతమ్ము నీవె - తెరువందు దీవె - విరబూయు తీవె -  త్వరగాను జూవె 
హరి నిన్ను గాన - హరుసాల గాన - మరుదెంచె రాణఁ -  గురిపించె వాన 
సిరులిచ్చు మ్రాఁకు - వరమిమ్ము నాకు - సరిలేరు నీకు - మఱి మర్వబోకు 

వలపందు నోడి - తలదాచుకొంటిఁ - జలనమ్ము లేని - శిలయైతి నేను 
కల లింకిపోయెఁ - గల లెండిపోయెఁ - దలపందు గ్లాని - తల దించె జ్ఞాని 
చెలి లేని యున్కి - వెలలేని మన్కి - చెలువమ్ము లేదు - ఫలితమ్ము రాదు 
వెలుఁగెందు లేదు - పిలుపొండు రాదు - అలుపందు నేను - మల నెక్కలేను  


అర్ధ పాదములకు ప్రాసయతి, అర్ధ పాదములలో అక్షరసామ్య యతి - 

కను మూయగాను - గల గాంచినాను 
నిను జూచినాను - నిశికాంతుఁగాను 
వనమందు నెమ్మి-వలె నీవు సుమ్మి 
మన మొక్క తమ్మి - మధురమ్ము నెమ్మి 
తనువెల్ల హాయి - తరుణమ్ము రేయి 
స్వనమో రుబాయి - స్వరరాగదాయి 
వనజాస్యమందు - వరహాస మెందు 
నెనలేని విందు - హృదయమ్మునందు 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు 
#
niSikAMta - 

aadhAramu - kalpitamu 
sphUrti - rAmadAsu

niSikAMta - sa/ja/sa/ja/sa/ja/sa/ja #IIUIUI IIUIUI IIUIUI IIUIUI#
24 saMkRti 11451116 

sarvatrA prAsayatitO 

karuNAlaVAla - karuNiMcha vEla - sarasAla lIla - muripiMcha vEla 
niratammu nIve - teruvaMdu dIve - virabUyu tIve -  tvaragAnu jUve 
hari ninnu gAna - harusAla gAna - marudeMche rANa@M -  guripiMche vAna 
sirulichchu mrA@Mku - varamimmu nAku - sarilEru nIku - ma~ri marvabOku 

valapaMdu nODi - taladAchukoMTi@M - jalanammu lEni - Silayaiti nEnu 
kala liMkipOye@M - gala leMDipOye@M - dalapaMdu glAni - tala diMche j~nAni 
cheli lEni yun&ki - velalEni man&ki - cheluvammu lEdu - phalitammu rAdu 
velu@MgeMdu lEdu - pilupoMDu rAdu - alupaMdu nEnu - mala nekkalEnu  


ardha pAdamulaku prAsayati, ardha pAdamulalO axarasAmya yati - 

kanu mUyagAnu - gala gAMchinAnu 
ninu jUchinAnu - niSikAMtu@MgAnu 
vanamaMdu nemmi-vale nIvu summi 
mana mokka tammi - madhurammu nemmi 
tanuvella hAyi - taruNammu rEyi 
svanamO rubAyi - svararAgadAyi 
vanajAsyamaMdu - varahAsa meMdu 
nenalEni viMdu - hRdayammunaMdu 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu 
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] సాక్ష్యమీ తల్లియే ..

 

సాక్ష్యమీ తల్లియే ..
----------------------------

--

ద్విపద - ( చతుష్పదలుగా ) 

--

పద్యమాలలు లేవు పంచి పెట్టంగ 
హృద్యమౌ చిత్రాలె యింపుగా నిపుడు 
పద్యమ్ములిడు వారు బాట మార్చితిరి 
బాధ్యతైనటు చేయవలెనంచు జపము 
--
కొన్నాళ్ళు మాత్రమే కూర్పుకీ సెలవు 
అన్నేండ్లు నేర్పించి యమ్మగా విద్య 
చిన్నబుచ్చఁగఁ బోరు చే సాగనీక 
అన్న మాటలఁ దప్పి యలుకనీఁబోరు 
--
జపతపమ్ములతోడ శక్తిమించునట 
కృపతోడనే యందురీరీతి మార్పు 
కపటమేమియులేదు కష్టమీఁబోను 
విపులమౌ శ్రేయమే విధిగ నీకంద్రు 
--
లక్షలాదిగఁ జేయ లక్ష్యమ్ము నిడిరి
దక్షపుత్రికనెంచి దండమ్ము లొసఁగి  
శిక్షగా ననుకోక చేయుచుంటినటె 
యక్షరాకృతియైన యంబ సాయమిడ 
--
విసువు గూర్చదు నాకుఁ  బ్రీతియే సలుప
వశమౌను మది గూడ బ్రతిమాలఁ బోకె
అసిధార యైనట్టు లారాటపడదు 
పసలేని పనియంచు బలుకాడఁబోదు 
--
గురువాక్యములనెంచి కుదురుగా నుండు 
నిరతమ్ము  జపియించ నిరతియుంజూపు  
హరుసమే నాకైన నరయనా మార్పు 
సరియైన త్రోవలో సాగ నా జపము 
--
సకలజ్ఞుఁడైనట్టి సచ్చిదానందుఁ  
డకలంకమౌ ప్రేమ మందించు తలిగ
నొకదాని తరువాత నొకటి చెప్పెదరు
బ్రకటించు మంత్రమ్ము భావింపమనుచు 
--
వక్ష్యమాణము పల్కు వాణివాక్కవఁగ
లక్ష్యముం దలపోసి రహిని నిత్యమును  
లక్ష్యసిద్ధినిఁ బొందు రామనే యగుదు 
సాక్ష్యమీ తల్లియే జగతికందించు

--

సుప్రభ 
11:00 AM 
05-23-2019
  
--

ఎప్పటి మాదిరిగా, పై పద్యములు కూడా పలికించేవారు వ్రాయించినవే .
   
     

 

__._,_.___

Posted by: suprabha u <saarada@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___