[racchabanda] రచ్చబండ కవితలు

 

Conundrum

 

ఇన్నేళ్లుగా మోగిస్తున్నాఈ మ్యూజికల్ పీస్!

నువ్వు చెప్పమని అడిగితే,

ఇప్పడు కదా నాకు ఆనందం కలిగింది!

Now I am enjoying!

అని అతడు అలా నవ్వితే నేనేం చెప్పను!

నేనెలా నేర్చుకోను!

ఏ దేశపు ప్రబంధాలు చదువుకు వస్తున్నాడో

ఈ ద్రిమ్మరి!

పాఠం మీదకు నేనతని దృష్టి ఎలా మళ్లించను!

జగమేలే పరమాత్మా!

ఎవరితో మొరలిడుదు! - Lyla


__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (161)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] ద్విపదలో ఒక గానప్రయోగము #dvipadalO oka gAnaprayOgamu#

 

ద్విపదలో ఒక గానప్రయోగము - 

రెండు ద్విపదల మొదటి మూడు పాదములలోని చివరి సూర్య గణపు పదము తఱువాతి పాదముతో అన్వయము చెందుతుంది. పాటలలో ఇది సామాన్యము. చివరి ద్విపద పాదములో సూర్యగణము లేదు. సూర్యగణపు పదములకు అంత్యప్రాస ఒక అదనపు ఆభరణము. 

నాపాలి దైవమా - నను జూడు, నన్ను
కాపాడవేలకో - కరివర్ణ, తెన్ను 
చూపంగ రమ్మిందు - దీపమై, చెన్ను  
రూపమ్ము చూపించు - ప్రోవఁగా 

రాగమ్ము నింపుమా - బ్రతుకులో, శ్రీల 
యోగమ్ము నీయుమా - యొప్పుగా, నీల 
రాగాల కాంతులన్ - గ్రమ్మరా, మ్రోల 
రాగాల మురళితో - రమ్మురా 

అందమై నాట్యమ్ము - నాడరా, దీన
మందార నాతోడ - మసలరా, గాన 
బృందానఁ గేంద్రమై - వెలుఁగరా, తాన 
తందాన తానాన - తాననా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
dvipadalO oka gAnaprayOgamu - 

reMDu dvipadala modaTi mUDu pAdamulalOni chivari sUrya gaNapu padamu ta~ruvAti pAdamutO anvayamu cheMdutuMdi. pATalalO idi sAmAnyamu. chivari dvipada pAdamulO sUryagaNamu lEdu. sUryagaNapu padamulaku aMtyaprAsa oka adanapu aabharaNamu. 

nApAli daivamA - nanu jUDu, nannu
kApADavElakO - karivarNa, tennu 
chUpaMga rammiMdu - dIpamai, chennu  
rUpammu chUpiMchu - prOva@MgA 

rAgammu niMpumA - bratukulO, SrIla 
yOgammu nIyumA - yoppugA, nIla 
rAgAla kAMtulan - grammarA, mrOla 
rAgAla muraLitO - rammurA 

aMdamai nATyammu - nADarA, dIna
maMdAra nAtODa - masalarA, gAna 
bRMdAna@M gEMdramai - velu@MgarA, tAna 
taMdAna tAnAna - tAnanA 

vidhaeyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] నవరోజు #navarOju#

 

నవరోజు - 

ఆధారము - కల్పితము 
స్ఫూర్తి - రామదాసు 
గతి - సంకీర్ణము, 4-5 మాత్రలు 

నవరోజు - భ/స/జ/న/ర/న/జ/గ UII IIUI - UII IIUI - UII IIUIU
22 ఆకృతి 1552223  

ప్రాసయతితో - 
మాధవ మధురేశ - యాదవ యదుదీప - రాదరి రమణీయమై 
నాదపు నవగీతి - వేదనలను బాపి - మోదము గలిగించురా 
చేదుల యనుభూతి - ఖేదము వలదింక - బాధలఁ దొలగించరా 
సాదరముగ నాకు - శ్రీధర సిరులిమ్ము - నీదగు చిఱునవ్వుతో 

అక్షరసామ్య యతితో - 
ఆమని ప్రతిరోజు - అందపు నవరోజు - హర్షములకు మోజుగా 
శ్యామలమగు రాత్రి - చల్లనిదగు ధాత్రి - చంద్రుఁడు చిరయాత్రియా 
కోమలమగు ప్రీతి - కూరిమిగల నాతి - కోరిక యొక గీతియా 
ప్రేమము మది నిండె - వెల్గుల సిరి పండె - వేగము నను జేరవా 

రెండింటితో - 
రాముఁడె భువనమ్ము - రాముఁడె చలనమ్ము - రాముఁడె కవనమ్ముగా 
రాముఁడె కదలించు - రాముఁడె కరగించు - రాముఁడె మురిపించుఁగా 
రాముఁడె యొక త్రోవ - రాముఁడె యొక నావ - రాముఁడె 
నవజీవ మా 
రాముఁడె మదియందు - రాముఁడె బ్రతుకందు - రాముఁడె కనువిందుగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
navarOju - 

aadhAramu - kalpitamu 
sphUrti - rAmadAsu 
gati - saMkIrNamu, 4-5 mAtralu 

navarOju - bha/sa/ja/na/ra/na/ja/ga #UII IIUI - UII IIUI - UII IIUIU#
22 aakRti 1552223  

prAsayatitO - 
mAdhava madhurESa - yAdava yadudIpa - rAdari ramaNIyamai 
nAdapu navagIti - vEdanalanu bApi - mOdamu galigiMchurA 
chEdula yanubhUti - khEdamu valadiMka - bAdhala@M dolagiMcharA 
sAdaramuga nAku - SrIdhara sirulimmu - nIdagu chi~runavvutO 

axarasAmya yatitO - 
aamani pratirOju - aMdapu navarOju - harshamulaku mOjugA 
SyAmalamagu rAtri - challanidagu dhAtri - chaMdru@MDu chirayAtriyA 
kOmalamagu prIti - kUrimigala nAti - kOrika yoka gItiyA 
prEmamu madi niMDe - velgula siri paMDe - vEgamu nanu jEravA 

reMDiMTitO - 
rAmu@MDe bhuvanammu - rAmu@MDe chalanammu - rAmu@MDe kavanammugA 
rAmu@MDe kadaliMchu - rAmu@MDe karagiMchu - rAmu@MDe muripiMchu@MgA 
rAmu@MDe yoka trOva - rAmu@MDe yoka nAva - rAmu@MDe 
navajIva mA 
rAmu@MDe madiyaMdu - rAmu@MDe bratukaMdu - rAmu@MDe kanuviMdugA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] రచ్చబండ కవితలు

 

Poetic forecasts

 

'అమ్మల దినం' దగ్గర్లోకొచ్చి ఉండటం మూలానేమో, ఆ రోజు ప్లేన్లో ఒక్క సీట్ ఖాళీ లేదు. 'ఫోర్ట్ మాయర్స్' లో దింపాల్సిన ప్లేన్ ఆకస్మికంగా అక్కడ తుఫాను వచ్చిందంటూ, 'సరసోటా' లో దింపాడు కెప్టెన్.

బతికి బాగున్నందుకు సంతోషించి, సగం మంది, సరసోటాలో, సూట్కేస్ లు దింపుకుని సర్దుకున్నారు. మిగతా మూర్ఖులం మమ్మల్ని మళ్లా ప్లేన్ ఎక్కించినప్పటికి, తుఫాను సరసోటాకి విచ్చేసింది. మళ్లీ టేకాఫ్ ఆలస్యం.

ఎంతైనా దివ్యంగా ఉంది ఇక వెనక్కు ప్రయాణం.

ఫ్లారిడా దీవులు, దీపాలు, చుట్టూతా అనంతమైన నీరు, ఆ పైన ఆకాశం, ఇంకా పైన మెరుపులు. ఉద్గాఢమైన తెల్లని మబ్బుల్లో విమానయానం.

మళ్లీ, కెప్టెన్ ఆ ప్లేన్ ఇక ఎప్పుడు లాండ్ అయ్యేదీ చెప్పలేం అని మరోసారి అన్నాడు. ఐనా చేసేదేముంది?

స్వర్గంలో నేగా ఉంది. ఆ స్వర్గం గురించే గా, కొన్ని వందల ఏళ్లుగా భూమ్మీద మనుషులు ఆలోచించి చించి ఎంతైనా పొయెట్రీ రాసారు. ఉద్గ్రంథాలు రాసారు. ఎన్నైనా యుద్ధాలు చేసారు. ఎంతైనా ఆశలు చూపి, ఎన్నైనా నీతులు చెప్పారు. ఇంకా ఇప్పటికీ పద్యాలు/కవిత్వం రాసేవాళ్లు, దేవుళ్లు, దేవతలు, పుణ్యం, పాపం అంటూ -తాము రాసే విషయాల గురించి వాళ్లకి ఇంత కూడా తెలియక పోయినా తెలిసినట్టు రాస్తూనే ఉన్నారు.

ఆ పుణ్య స్వర్గంలో ఎగురుతూ, ప్లేన్ ఆ పరుషమైన మబ్బులకు కొట్టుకుంటం సంభవించి, కఠినమైన ఆ బంప్ లు అంతూపొంతూ లేకుండినపుడు, నల్లని అంతం, నా అంత్యకాలం స్ఫురించి,

'కాలాంత స్ఫురచ్చండికా పరుషోద్గాఢ పయోధర స్ఫుటతటీపర్యంత కాఠిన్యమున్!' లో వంకరటింకరగా పొయెట్ గారు ఏమంటున్నారో, నాకు ఇంకోలాగా మహా సరసంగా అర్థమైంది.


Lyla__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (160)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___