[racchabanda] గరుడగమన #garuDagamana#

 

గరుడగమన - 

ఆధారము - కల్పితము 
స్ఫూర్తి - రామదాసు 
నడక - 3,3,4 - 4 - 3,3,4 మాత్రలు; యతి, ప్రాసయతి 

గరుడగమన - 

గరుడగమనుఁ డీవే - కనఁగా - నురగశయనుఁ డీవే
సరసలోలుఁ డీవే - స్వామీ - సరసిజాక్షుఁ డీవే
గిరిజ కన్న వీవే - కృష్ణా - కరుణ జలధి వీవే 
హరి యనంగ రావా - హరుసపు - నురుగు చల్లి పోవా 

కనులయందు నీవే - కామిని - మనమునందు నీవే 
ప్రణవమందు నీవే - భామిని - ప్రణయమందు నీవే 
దినమునందు నీవే - తెల్లని - ననలయందు నీవే 
వనమునందు నీవే - వల్లకి - స్వనమునందు నీవే 

వేంకటేశ రావా - వేగము - సంకటమ్ముఁ బాప
బింక మేలనోయీ - ప్రేమకు - టంకసాల నీవే 
పంకజాక్ష నీకై - ప్రార్థన - శంకలేక చేతు 
ఇంక జాల మేలా - యీ నా - వంక జూడరాదా 

పూలు పూచె వనిలో - మోహన - మాల వేతు మెడలో 
నీలవర్ణ గగనము(నం) - నీదో - నీలమైన వదనము(నం) 
బాల కనక చేలా - పాడెద - లీల లిపుడు చాల(లా) 
ఏల నన్ను గనవో - హృదయపు - గోల లేల వినవో 

ఎన్ని పిలుపులోరా - యెందుకు - కన్న వినవె యౌరా 
సన్నుతింతు నిన్నే - స్వామీ - యన్ని జన్మలందు 
వెన్న మనసు వాఁడా - వేదన - నెన్నఁ దరము కాదా 
చెన్నుగాను రావా - శ్రీపతి - నన్ను జేర రావా

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
garuDagamana - 

aadhAramu - kalpitamu 
sphUrti - rAmadAsu 
naDaka - 3,3,4 - 4 - 3,3,4 mAtralu; yati, prAsayati 

garuDagamana - 

garuDagamanu@M DIvE - kana@MgA - nuragaSayanu@M DIvE
sarasalOlu@M DIvE - svAmI - sarasijAxu@M DIvE
girija kanna vIvE - kRshNA - karuNa jaladhi vIvE 
hari yanaMga rAvA - harusapu - nurugu challi pOvA 

kanulayaMdu nIvE - kAmini - manamunaMdu nIvE 
praNavamaMdu nIvE - bhAmini - praNayamaMdu nIvE 
dinamunaMdu nIvE - tellani - nanalayaMdu nIvE 
vanamunaMdu nIvE - vallaki - svanamunaMdu nIvE 

vEMkaTESa rAvA - vEgamu - saMkaTammu@M bApa
biMka mElanOyI - prEmaku - TaMkasAla nIvE 
paMkajAxa nIkai - prArthana - SaMkalEka chEtu 
iMka jAla mElA - yI nA - vaMka jUDarAdA 

pUlu pUche vanilO - mOhana - mAla vEtu meDalO 
nIlavarNa gaganamu(naM) - nIdO - nIlamaina vadanamu(naM) 
bAla kanaka chElA - pADeda - lIla lipuDu chAla(lA) 
Ela nannu ganavO - hRdayapu - gOla lEla vinavO 

enni pilupulOrA - yeMduku - kanna vinave yaurA 
sannutiMtu ninnE - svAmI - yanni janmalaMdu 
venna manasu vA@MDA - vEdana - nenna@M daramu kAdA 
chennugAnu rAvA - SrIpati - nannu jEra rAvA

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

Re: [racchabanda] ద్విపదలో ఒక గాన ప్రయోగము - 2 #dvipadalO oka gAna prayOgamu - 2#

 


One of my favourite songs from the 1982 Tamil film "Ezhavathu Manithan"


Namastey!
Hemantha Kumar Pamarthy 
On Sunday, 26 May, 2019, 4:50:44 am IST, 'J. K. Mohana Rao' jkmrao@yahoo.com [racchabanda] <racchabanda@yahoogroups.com> wrote:


 

ద్విపదలో ఒక గాన ప్రయోగము - 2

నిన్న మీకు పంపిన సందేశములో ద్విపదలోని చివరి సూర్య గణమునకు అంత్యప్రాస నుంచినాను. ఈ రోజు మూడవ గణమునకు అంత్య ప్రాసను ఉంచి వ్రాసినాను.. ఇట్టి వాటిని తమిళములో చిందు అంటారు. ఉదాహరణముగా సుబ్రహ్మణ్య భారతి వ్రాసినది -  

శెందమిళ్ నాడెనుం పోదినిలే - ఇన్బ 
తేన్ వందు పాయుదు కాదినిలే 

క్రింద నా ఉదాహరణములు -  

ఈవసంతమ్ములో - హృదయమ్ము / నమ్ము 
నీవు కావలెననెన్ - నిరతమ్ము / రమ్ము 
జీవనాధార మా - చెలువమ్ము / చిమ్ము 
భావనాంబరములో - భాసమ్ము 

గానమందాకినిన్ - గలహంస / నీవె 
జ్ఞానగంగోత్రిలోఁ - గవితాంశ / నీవె 
యానంద హృదయమం - దాశంస / నీవె 
మానసమ్ములో నుండు - మధురాంశ 

వెతలలో నుండగాఁ - బ్రేమమ్ము / నాకు 
బ్రతుకులో విశ్వాస - భావమ్ము / నాదు 
కృతులలో నవరాగ - గీతమ్ము / నాకు  
సతతమ్ము నీవె సం-చలనమ్ము 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
dvipadalO oka gAna prayOgamu - 2

ninna mIku paMpina saMdESamulO dvipadalOni chivari sUrya gaNamunaku aMtyaprAsa nuMchinAnu. ee rOju mUDava gaNamunaku aMtya prAsanu uMchi vrAsinAnu. iTTi vATini tamiLamulO chiMdu aMTAru. udAharaNamugA subrahmaNya bhArati vrAsinadi -  

SeMdamiL nADenuM pOdinilE - in&ba 
tEn vaMdu pAyudu kAdinilE 

kriMda nA udAharaNamulu -  

eevasaMtammulO - hRdayammu / nammu 
nIvu kAvalenanen - niratammu / rammu 
jIvanAdhAra mA - cheluvammu / chimmu 
bhAvanAMbaramulO - bhAsammu 

gAnamaMdAkinin - galahaMsa / nIve 
j~nAnagaMgOtrilO@M - gavitAMSa / nIve 
yAnaMda hRdayamaM - dASaMsa / nIve 
mAnasammulO nuMDu - madhurAMSa 

vetalalO nuMDagA@M - brEmammu / nAku 
bratukulO viSvAsa - bhAvammu / nAdu 
kRtulalO navarAga - gItammu / nAku  
satatammu nIve saM-chalanammu 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: Hemantha Kumar Pamarthy <andhraputhra@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] ద్విపదలో ఒక గాన ప్రయోగము - 2 #dvipadalO oka gAna prayOgamu - 2#

 

ద్విపదలో ఒక గాన ప్రయోగము - 2

నిన్న మీకు పంపిన సందేశములో ద్విపదలోని చివరి సూర్య గణమునకు అంత్యప్రాస నుంచినాను. ఈ రోజు మూడవ గణమునకు అంత్య ప్రాసను ఉంచి వ్రాసినాను. ఇట్టి వాటిని తమిళములో చిందు అంటారు. ఉదాహరణముగా సుబ్రహ్మణ్య భారతి వ్రాసినది -  

శెందమిళ్ నాడెనుం పోదినిలే - ఇన్బ 
తేన్ వందు పాయుదు కాదినిలే 

క్రింద నా ఉదాహరణములు -  

ఈవసంతమ్ములో - హృదయమ్ము / నమ్ము 
నీవు కావలెననెన్ - నిరతమ్ము / రమ్ము 
జీవనాధార మా - చెలువమ్ము / చిమ్ము 
భావనాంబరములో - భాసమ్ము 

గానమందాకినిన్ - గలహంస / నీవె 
జ్ఞానగంగోత్రిలోఁ - గవితాంశ / నీవె 
యానంద హృదయమం - దాశంస / నీవె 
మానసమ్ములో నుండు - మధురాంశ 

వెతలలో నుండగాఁ - బ్రేమమ్ము / నాకు 
బ్రతుకులో విశ్వాస - భావమ్ము / నాదు 
కృతులలో నవరాగ - గీతమ్ము / నాకు  
సతతమ్ము నీవె సం-చలనమ్ము 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
dvipadalO oka gAna prayOgamu - 2

ninna mIku paMpina saMdESamulO dvipadalOni chivari sUrya gaNamunaku aMtyaprAsa nuMchinAnu. ee rOju mUDava gaNamunaku aMtya prAsanu uMchi vrAsinAnu. iTTi vATini tamiLamulO chiMdu aMTAru. udAharaNamugA subrahmaNya bhArati vrAsinadi -  

SeMdamiL nADenuM pOdinilE - in&ba 
tEn vaMdu pAyudu kAdinilE 

kriMda nA udAharaNamulu -  

eevasaMtammulO - hRdayammu / nammu 
nIvu kAvalenanen - niratammu / rammu 
jIvanAdhAra mA - cheluvammu / chimmu 
bhAvanAMbaramulO - bhAsammu 

gAnamaMdAkinin - galahaMsa / nIve 
j~nAnagaMgOtrilO@M - gavitAMSa / nIve 
yAnaMda hRdayamaM - dASaMsa / nIve 
mAnasammulO nuMDu - madhurAMSa 

vetalalO nuMDagA@M - brEmammu / nAku 
bratukulO viSvAsa - bhAvammu / nAdu 
kRtulalO navarAga - gItammu / nAku  
satatammu nIve saM-chalanammu 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___