[racchabanda] హనుమ #hanuma#

 

హనుమ - 

ఆధారము - కల్పితము, సార్థకనామ గణాక్షర వృత్తము 
నడక - చతురస్రగతి, షణ్మాత్రల గతి
గణములు - హ, ఐదు న-గణములు, ఒక మ-గణము.

హనుమజ్జయంతి సందర్భముగా వ్రాసినది - 

హనుమ - భ/న/న/న/న/స/గగ 
20 కృతి 131071 

UII IIII IIII - IIII IIU UU విఱుపుతో - 

రాముని పనుపున నవనిజ - రయమున గనె నాలంకన్ 
బ్రేమము బగితిని హనుమయు - వెతలను వినె నిశ్శంకన్ 
స్వామియు నొసఁగిన బటువును - సతికిని బ్రియమై యిచ్చెన్ 
శ్రీమతి యొసఁగిన రతనము - చెరచెర సిరిగాఁ దెచ్చెన్ 

రాముని ప్రతిమయె మనమున - రహి నిడి గొలిచెన్ గాదా 
నేమము వదలక ననఘుని - నెనరున దలఁచెన్ గాదా 
కామపుటరి మది గెలిచెను - గరుణకుఁ బ్రతిగా నుండెన్ 
కోమలమగు హృది యతనిది - గురుతరబలుఁడై నిండెన్ 

UIIII IIIIII - IIIIII UUU విఱుపుతో - 

అంజని కొక ప్రియపు నిసుఁగు - హనుమ యెగిరె నానింగిన్ 
భంజనునిగ కుజనులకును - వఱలు నతఁడు సద్భంగిన్ 
రంజనమగు హృదయ మెపుడు - లలితహృదయుఁ గానంగా 
నంజనమయమగు మనికియు - నలరు వెలుఁగు లీనంగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
hanuma - 

aadhAramu - kalpitamu, sArthakanAma gaNAxara vRttamu 
naDaka - chaturasragati, shaNmAtrala gati
gaNamulu - ha, aidu na-gan'amulu, oka ma-gaNamu.

hanumajjayaMti saMdarbhamugA vrAsinadi - 

hanuma - bha/na/na/na/na/sa/gaga 
20 kRti 131071 

#UII IIII IIII - IIII IIU UU# vi~ruputO - 

rAmuni panupuna navanija - rayamuna gane nAlaMkan 
brEmamu bagitini hanumayu - vetalanu vine niSSaMkan 
svAmiyu nosa@Mgina baTuvunu - satikini briyamai yichchen 
SrImati yosa@Mgina ratanamu - cherachera sirigA@M dechchen 

rAmuni pratimaye manamuna - rahi niDi golichen gAdA 
nEmamu vadalaka nanaghuni - nenaruna dala@Mchen gAdA 
kAmapuTari madi gelichenu - garuNaku@M bratigA nuMDen 
kOmalamagu hRdi yatanidi - gurutarabalu@MDai niMDen 

#UIIII IIIIII - IIIIII UUU# vi~ruputO - 

aMjani koka priyapu nisu@Mgu - hanuma yegire nAniMgin 
bhaMjanuniga kujanulakunu - va~ralu nata@MDu sadbhaMgin 
raMjanamagu hRdaya mepuDu - lalitahRdayu@M gAnaMgA 
naMjanamayamagu manikiyu - nalaru velu@Mgu lInaMgA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___