[racchabanda] చంపకు చంపకు ....

 

చంపకు చంపకు ..

----------------------------

--

మాత్రాబద్ధము (13/14)

--

చంపకు చంపకు నా తల్లి

కంపరమొసఁగెడు పదములతో

బంపఁగఁ జేయకు పద్యాలు

సొంపుగ నుండెడి పలుకులనే

నింపుము తల్లీ కావ్యాల

--

వలసిన యొత్తులఁ బెట్టించు

తెలుఁగును సరిగా నేర్పించు

తెలియఁగఁ బ్రేరణ గలిగించు

అలరెడి రీతినిఁ బలికించు

--

సలిపెడి తప్పుల మాన్పించు

లలితపదమ్ముల వర్షించు

పలుపలు రీతుల దీవించు

తెలుఁగును జిరముగ వెలిఁగించు

--

చంపక సౌరభ మొలికెడివి

యెంపికఁ జేసుక భాషణల

బెంపునుఁ జేయఁగ నెయ్యముల

నింపుము వెలుఁగుల గుండెలను

--

అలుగకుమీగతి నడిగితని

తెలుఁగనఁ బ్రీతినిఁ బలికితిని

పలుకుల నొసఁగెడు విధిసతివి

తెలుపక యెట్టుల నా మతిని

--

సుప్రభ

2:59 PM

06-04-2019

--

"తెలుగు యువత మేలుకో" అనే ముఖపుస్తక కూటమిలో

సత్య రామ ప్రసాద్ కల్లూరి గారు నిన్న పంచిన

"భాషను ఎంతగా సరళీకృతంచేసేసినా - "#బాష"/"#మాత్రుబాష" అంటూ

వ్రాయద్దు "#భాషా-#ప్రియులారా!" చదవలేక-చస్తున్నాం!"

అనే సందేశమును జూడగానే పొంగించినది. :-)


__._,_.___

Posted by: suprabha u <saarada@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] రచ్చబండ కవితలు

 

Sultry

 

ఏదీ చాందినీ

ఏదా చలువల కాంతీ

ఇవేళా

అలలమిలమిలలవేవీ!

 

ఏదీ సంపగీ

ఏదా కుసుమపు భ్రాంతీ

ఇవేళా

సుఖపరిమళములవేవీ!

 

ఏదీ తెమ్మెరా

ఏలా నిమురదు చెక్కిలీ

ఇవేళా

తనువులపులకలవేవీ!

 

Lyla


__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (169)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___