[racchabanda] రచ్చబండ కవితలు

 

How!

 

నెమలిని చూసి కొన్నేళ్ళాయే

నాట్యం చేసి నెలాళ్లాయే

ఆనందం పురి విప్పేదెలా!

 

కొండల చరియల దండిగ పూసే

జాజులు కోసి చానాళ్లాయే

కోరిక ఘుమ్మనేదెలా!

 

కొలనుల నిండిన కోకనదాలను

కనులారా నువు కనలేదే

కలకంఠీ! కులికేదెలా!

 

Lyla


__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (171)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] కొన్ని కన్నడ త్రిపదులు #konni kannaDa tripadulu#

 

కొన్ని కన్నడ త్రిపదులు - 

పాదము 1 - ఇం/ఇం - ఇం/ఇం (ప్రాసయతి) 
పాదము 2 - ఇం/సూ - ఇం/ఇం 
పాదము 3 - ఇం/సూ/ఇం 

మనమిందు వేగాన - నిను దల్చె రాగాన 
కనవేల నన్ను మనసార - వినవేల
ప్రణయంపు కథను నను జేర

సగ మాశశి పథమ్ము - సగ మీనిశీథమ్ము 
సగమయ్యె మనకు - సరసమ్ము - లిగ రమ్ము
సుగ మింక మనకు సుకరమ్ము

మఱల నదే శశి - మఱలి వచ్చెను నిశి
మఱి నీవు రావు - మనసిందు వాపోవు
హరిహరీ రాదుగా చావు!

ప్రియతమా యెందుకో - దయలేక యుంటివే 
నయముగా రమ్ము - నాచెంత - రయముగాఁ 
బ్రియముగా నిమ్ము పులకింత

శతపత్రసుందరీ - సతతమ్ము నీరూపు 
స్మృతిలోన నిండెఁ - జెలువుతోఁ - ద్రుటిలోన 
మతి నింప రమ్ము మమతతో

దినమందు రజనిలో - నిను జూడఁ గోరినా 
ననయమ్ము చెలియ - యమృతమ్మొ గరళమో 
మనికి యా జూద మయ్యెనో

అందమై నింగిలోఁ - జందమామ వెలింగె 
నిందుబింబమ్ము - గృహములో మాపాప
సుందర మ్మేది రెంటిలో?

మెల్లఁగాఁ జిన్నారి - తెల్లఁగా నవ్వుచు 
నుల్లమ్ము లలర - నూఁగాడి ప్రాకంగఁ 
దల్లి యుప్పొంగెఁ దనివాఱి

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
konni kannaDa tripadulu - 

pAdamu 1 - iM/iM - iM/iM (prAsayati) 
pAdamu 2 - iM/sU - iM/iM 
pAdamu 3 - iM/sU/iM 

manamiMdu vaegaana - ninu dalche raagaana 
kanavaela nannu manasaara - vinavaela
praNayaMpu kathanu nanu jaera

saga maaSaSi pathammu - saga meeniSeethammu 
sagamayye manaku - sarasammu - liga rammu
suga miMka manaku sukarammu

ma~rala nadae SaSi - ma~rali vachchenu niSi
ma~ri neevu raavu - manasiMdu vaapOvu
hariharee raadugaa chaavu!

priyatamaa yeMdukO - dayalaeka yuMTivae 
nayamugaa rammu - naacheMta - rayamugaa@M 
briyamugaa nimmu pulakiMta

SatapatrasuMdaree - satatammu neeroopu 
smRtilOna niMDe@M - jeluvutO@M - druTilOna 
mati niMpa rammu mamatatO

dinamaMdu rajanilO - ninu jooDa@M gOrinaa 
nanayammu cheliya - yamRtammo garaLamO 
maniki yaa jooda mayyenO

aMdamai niMgilO@M - jaMdamaama veliMge 
niMdubiMbammu - gRhamulO maapaapa
suMdara mmaedi reMTilO?

mella@Mgaa@M jinnaari - tella@Mgaa navvuchu 
nullammu lalara - noo@MgaaDi praakaMga@M 
dalli yuppoMge@M danivaa~ri

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] శ్లోకాలలో కొత్త లోకాలు - 27 #SlOkAlalO kotta lOkAlu - 27#

 

శ్లోకాలలో కొత్త లోకాలు - 27  

జీవిత మకరంద మ్మా 
మోవిపయిన తేనెలా 
యీ వసంతపు పుష్పమ్ముల్ 
దేవి కురుల మల్లెలా

నగుమోమెక్కడ హరీ 
సుగ మివ్వఁగఁ జూపవా 
నగధారీ యెఱుఁగవో 
పగబూనిరొ నీజనుల్

రాజశేఖరా నీపై నా 
మోజు తీరుట లేదురా 
రాజసమ్మున నేలన్ రా 
రాజితా జితమన్మథా

చీఁకటిలోన దీపమ్మై 
యాకలివేళ నన్నమై 
వ్యాకులమందు మోదమ్మై 
నాకనువిందుగ రావొకో

నీరాజనము నీకిత్తున్ 
నీరజాక్షా నిరంజనా 
భారములకుఁ జేయూతై 
దారిలో నడిపించరా

ఉన్నాఁడా వానిఁ గన్నావా 
విన్నాఁడా నీదు ప్రార్థనల్ 
ఎన్నాళ్లో నీదు యత్నమ్ముల్ 
కన్నీళ్లే నీకుఁ గాన్కకలా

నిన్న భూతము, రేపయ్యెన్ 
గొన్ని ప్రశ్నల భూతమై! 
యెన్నఁగా నేఁడు జీవించన్ 
వన్నెల హరివిల్లుగా!

ఈకుండ నొనరించంగా 
నాకుమ్మరికి నేలకో 
హా, కంపించఁగ హస్తమ్ముల్ 
వైకృతరూప మొందెనే!

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
SlOkAlalO kotta lOkAlu - 27  

jeevita makaraMda mmaa 
mOvipayina taenelaa 
yee vasaMtapu pushpammul^ 
daevi kurula mallelaa

nagumOmekkaDa haree 
suga mivva@Mga@M joopavaa 
nagadhaaree ye~ru@MgavO 
pagabooniro neejanul^

raajaSaekharaa neepai naa 
mOju teeruTa laeduraa 
raajasammuna naelan^ raa 
raajitaa jitamanmathaa

chee@MkaTilOna deepammai 
yaakalivaeLa nannamai 
vyaakulamaMdu mOdammai 
naakanuviMduga raavokO

neeraajanamu neekittun^ 
neerajaakshaa niraMjanaa 
bhaaramulaku@M jaeyootai 
daarilO naDipiMcharaa

unnaa@MDaa vaani@M gannaavaa 
vinnaa@MDaa needu praarthanal^ 
ennaaLlO needu yatnammul^ 
kanneeLlae neeku@M gaan&kalaa

ninna bhootamu, raepayyen^ 
gonni praSnala bhootamai! 
yenna@Mgaa nae@MDu jeeviMchan^ 
vannela harivillugaa!

eekuMDa nonariMchaMgaa 
naakummariki naelakO 
haa, kaMpiMcha@Mga hastammul^ 
vaikRtaroopa moMdenae!

vidhaeyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] శ్లోకాలలో కొత్త లోకాలు - 26 #SlOkAlalO kotta lOkAlu - 26#

 

శ్లోకాలలో కొత్త లోకాలు - 26 

నీవె హృదయ సరసిన్ 
భావపంకజ పుష్పముల్ 
జీవమందున రసముల్ 
నీవె భువన మోహినీ

వసంత ఋతువున రా 
ప్రసూనరాశితోడ రా 
రసమ్ము లొలుకఁగ రా 
అసీమ మోదమీయ రా

నీవే నా భూషణముగా 
నీవే నా జీవనమ్ముగా
నీవే భవజలధిలో 
నా వన్నియల పూసగా
(త్వమసి మమ భూషణం త్వమసి మమ జీవనం
త్వమసి మమ భవజలధి రత్నం - శ్రీజయదేవకవి)

నను బాలింప రావేలా 
యనఘా ప్రాణనాథుఁడా 
మనమందున నిన్నేగా 
వినుతింతును మోహనా

చరణాంభోరుహములే 
శరణమ్ములురా హరీ 
కరుణించుము త్వరగా 
విరబూసిన నవ్వుతో

చూడుమా శశికళ నీ 
యేఁడు కన్బడె నింగిలో 
వేడుకలె మనకు నీ 
నాఁడీదు ముదమొందఁగా

రాగమా యనురాగమ్మా 
యూఁగించు జీవితమ్ములన్ 
యోగమ్మదియు గమ్యమ్మా 
యోగమున వియోగమా

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
SlOkAlalO kotta lOkAlu - 26 

neeve hRdaya sarasin^ 
bhaavapaMkaja pushpamul^ 
jeevamaMduna rasamul^ 
neeve bhuvana mOhinee

vasaMta Rtuvuna raa 
prasoonaraaSitODa raa 
rasammu loluka@Mga raa 
aseema mOdameeya raa

neevae naa bhooshaNamugaa 
neevae naa jeevanammugaa
neevae bhavajaladhilO 
naa vanniyala poosagaa
(tvamasi mama bhooshaNaM tvamasi mama jeevanaM
tvamasi mama bhavajaladhi ratnaM - Sreejayadaevakavi)

nanu baaliMpa raavaelaa 
yanaghaa praaNanaathu@MDaa 
manamaMduna ninnaegaa 
vinutiMtunu mOhanaa

charaNaaMbhOruhamulae 
SaraNammuluraa haree 
karuNiMchumu tvaragaa 
viraboosina navvutO

chooDumaa SaSikaLa nee 
yae@MDu kan&baDe niMgilO 
vaeDukale manaku nee 
naa@MDeedu mudamoMda@Mgaa

raagamaa yanuraagammaa 
yoo@MgiMchu jeevitammulan^ 
yOgammadiyu gamyammaa 
yOgamuna viyOgamaa

vidhaeyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___