[racchabanda] పంచమాత్రల సీసము, తేటగీతి #paMchamAtrala sIsamu, tETagIti#

 

పంచమాత్రల సీసము, తేటగీతి - 

శ్రీరామ రఘురామ - శృంగార రామ నా 
ఆరాధ్య దైవమా - అంబుజాక్ష 
వారములు వర్షములు - బ్రతుకులోఁ బూర్తి యయె 
నేరమ్ము లెన్నియో - నేను జేయ 
వారాశి జీవనము - భంగము లభంగముగఁ 
దీరమ్ము గనఁబడదు - దేవదేవ 
ఘోర పాపిని నేను - గోరిక యదొక్కటే 
నీరమ్య రూపమును - నీవు జూపు 

హారములు నాతలంపులే - అమలహృదయ 
మేరలేనట్టి ప్రేమతో - మేనిఁ దాఁకు 
భారములు తగ్గఁ బులకింతు - వ్యధలు లేక 
ధారుణీతనయ చెప్పుమా - ధవునితోడ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
paMchamAtrala sIsamu, tETagIti - 

SrIrAma raghurAma - SRMgAra rAma nA 
aarAdhya daivamA - aMbujAxa 
vAramulu varshamulu - bratukulO@M bUrti yaye 
nErammu lenniyO - nEnu jEya 
vArASi jIvanamu - bhaMgamu labhaMgamuga@M 
dIrammu gana@MbaDadu - dEvadEva 
ghOra pApini nEnu - gOrika yadokkaTE 
nIramya rUpamunu - nIvu jUpu 

hAramulu nAtalaMpulE - amalahRdaya 
mEralEnaTTi prEmatO - mEni@M dA@Mku 
bhAramulu tagga@M bulakiMtu - vyadhalu lEka 
dhAruNItanaya cheppumA - dhavunitODa 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] రచ్చబండ కవితలు

 

 

Release

 

ఇంత స్వాతంత్ర్యం, శరీరంలో

ఆలోచనలో, పలుకులో, నేనింతకు ముందు

అనుభవించలేదు.

ఇంత చొరవ ఎవరికీ నేనెప్పుడూ

ఇవ్వలేదు.

ఇంత తరచుగా ఇంత మనమోహనంగా ఇదివరలో

నేను నవ్వలేదు.

చందమామ మీది సాలెగూడు

తొలగించింది అది నీవా? నీవా? అని ఎందరు

వికాసహృదయులను

అడగను!

 

Lyla


__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (175)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___