[racchabanda] విజయశంఖము #vijayaSaMkhamu#

విజయశంఖము - 

పొత్తపివేంకటరమణకవి కల్పించిన వృత్తము విజయశంఖము. 

విజయశంఖము - న/భ/భ/న/న/న/న/లగ III UII UI IIII - III IIII IIIU
23 వికృతి 4194132

ఋజువుగా నడయాడ జగమున - హితవు దెలిపిన వరదుఁడా 
యజయుఁ డవ్యయుఁ డాత్మ సఖుఁడవు - హరుస మొసగెడు తరువు నీ  
విజయశంఖము చక్ర మడిదము - విపులమగు గద కరములన్ 
సుజనకోటికి రక్ష నిడుఁగద - సులభముగ నరిఁ దునుముచున్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
vijayaSaMkhamu - 

pottapivEMkaTaramaNakavi kalpiMchina vRttamu vijayaSaMkhamu. 

vijayaSaMkhamu - na/bha/bha/na/na/na/na/laga #III UII UI IIII - III IIII IIIU#
23 vikRti 4194132

Rjuvugaa naDayaaDa jagamuna - hitavu delipina varadu@MDaa 
yajayu@M Davyayu@M Daatma sakhu@MDavu - harusa mosageDu taruvu nee  
vijayaSaMkhamu chakra maDidamu - vipulamagu gada karamulan^ 
sujanakOTiki raksha niDu@Mgada - sulabhamuga nari@M dunumuchun^ 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] రచ్చబండ కవితలు

His Consiglieri

అతని భవిష్య పదవి గూర్చిన

ఆంతరంగిక సంప్రదింపులు,

ఆమె తేనీటి లో కరిగే ఐస్ క్యూబ్ లు.

ఆ పదవి బాగోగులపై, మధ్య మధ్య

ఆమె నిదానపు స్తిమితపు యోచనలు,

అతని ఏపిల్ మార్టీనీ ల లో ఆలివ్ లు.

"సో సారీ, 'మన సాయంత్రం' మాటలన్నీ

నా గురించే జరిపాను," -అని

నడిరాత్రి అతని సిన్సియర్ పశ్చాత్తాపపు టెక్స్ట్;  

"డోంట్ వర్రీ! నేనదెప్పుడో మర్చిపోయి,    

కంఫర్టర్ కింద కంఫీగా "Sacred Passions"

చదువుకుంటున్నాను." -ఆమె విచ్ క్రాఫ్ట్.

-Lyla

__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (178)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] Re: [Chandassu] లీలామయ #lIlAmaya#

> లీలామానుష విగ్రహము
లీలామానుష విగ్రహుఁడు
#
> lIlAmAnusha vigrahamu
lIlAmAnusha vigrahu@MDu
#
__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] మయూరీ #mayUrI#

మయూరీ - 

ఆధారము - వాగ్వల్లభ 

మయూరీ - య/ర/ల 
11 ఉష్ణిక్కు 82

యశోదా, వత్సలుండు 
నిశీథమ్మందు నన్ను  
స్పృశించెన్ వెన్న పూసి 
హసించెన్ వద్దనంగ 

ప్రియమ్మై వర్షమందు 
నయమ్మై నర్తనమ్ము 
మయూరీ యాడవేల 
లయింతున్ మోదమొంది 

ఇదేనా వెల్గురేక 
ఇదేనా స్వర్గసీమ 
ఇదేనా భావి యన్న 
దిదేనా జీవితమ్ము 

మనమ్మో నిన్ను బిల్చె 
ధనమ్మో వద్దు నాకు 
స్వనమ్మో నీది చాలు 
కనంగా రమ్ము నీవు 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
mayUrI - 

aadhAramu - vAgvallabha 

mayUrii - ya/ra/la 
11 ushNikku 82

yaSOdA, vatsaluMDu 
niSIthammaMdu nannu  
spRSiMchen venna pUsi 
hasiMchen vaddanaMga 

priyammai varshamaMdu 
nayammai nartanammu 
mayUrI yADavEla 
layiMtun mOdamoMdi 

idEnA velgurEka 
idEnA svargasIma 
idEnA bhAvi yanna 
didEnA jIvitammu 

manammO ninnu bilche 
dhanammO vaddu nAku 
svanammO nIdi chAlu 
kanaMgA rammu nIvu 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] లీలామయ #lIlAmaya#

లీలామయ - 

ఆధారము - హేమచంద్రుడు
బేసి పాదములు - 17 మాత్రలు
సమ పాదములు - 7 మాత్రలు 
సమపాదములకు అంత్యప్రాస

లీలామయ - 17 / 7 మాత్రలు

ఈ వర లీలామానుష విగ్రహము / దైవ మేమో 
శ్రీవిష్ణువొ యీ బాలకుఁ డితఁడు నా / జీవమేమో  

రాగములో రాగమై పలుకవేల / యోగమగునే 
యోగములో నాగమై కులుకవేల / భోగమగునే 

వాని లీలామయ మీజగమంతా / మానసమ్మా 
వాని కరుణామయ మీబ్రతుకంతా / జ్ఞానమిమ్మా 

విరులిచ్చిన వాఁడే ముండ్ల నిచ్చును / స్మరించు హరిని 
కరుణామయ మీజగన్నాటకమే / తరించు మవని 

నిన్ను జూచిన నిముసమందున నేను / నన్ను మఱతున్ 
గన్నులందున గామధనువుగ రమ్ము / నిన్ను దలఁతున్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
lIlAmaya - 

aadhAramu - hEmachaMdruDu
bEsi pAdamulu - 17 mAtralu
sama pAdamulu - 7 mAtralu 
samapAdamulaku aMtyaprAsa

lIlAmaya - 17 / 7 mAtralu

ee vara lIlAmAnusha vigrahamu / daiva mEmO 
SrIvishNuvo yI bAlaku@M Dita@MDu nA / jIvamEmO  

rAgamulO rAgamai palukavEla / yOgamagunE 
yOgamulO nAgamai kulukavEla / bhOgamagunE 

vAni lIlAmaya mIjagamaMtA / mAnasammA 
vAni karuNAmaya mIbratukaMtA / j~nAnamimmA 

virulichchina vA@MDE muMDla nichchunu / smariMchu harini 
karuNAmaya mIjagannATakamE / tariMchu mavani 

ninnu jUchina nimusamaMduna nEnu / nannu ma~ratun 
gannulaMduna gAmadhanuvuga rammu / ninnu dala@Mtun 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] పుణ్య (పుష్ప, సమృద్ధి, ఋద్ధి) #puNya (pushpa, samRddhi, Rddhi)#

పుణ్య (పుష్ప, సమృద్ధి, ఋద్ధి) - 

ఆధారము - నాట్యశాస్త్రము

పుణ్య (పుష్ప, సమృద్ధి, ఋద్ధి) - ర/గ UIUU
4 ప్రతిష్ఠ 3

వర్ణిరూపా 
తూర్ణవేగా 
పూర్ణపుణ్యా 
పూర్ణ మీవే 

వంద పుష్పా 
లెందుఁ జూడన్ 
సుందరీ క-
న్విందు గాదా 

భూసతీ నీ 
యీ సమృధ్హిన్ 
హాసముల్ నేఁ 
జూసికొంటిన్ 

ఈవసంత 
మ్మీవనమ్ముల్ 
కావి రంగుల్ 
భావ దీప్తుల్ 

రామ లాలీ 
శ్యామ లాలీ 
ప్రేమతో నా 
స్వామి లాలీ 

శ్రీశ్రీ ఓమహాత్మా ఓమహర్షీ కవితలో ఈ వృత్తమునకు సరిపోయే కొన్ని పంక్తులు - 

ఏది పుణ్యం 
ఏది పాపం 
ఏది సత్యం 
ఏదసత్యం 
ఏదనిత్యం 
ఏది నిత్యం 
ఏది యేకం 
ఏదనేకం 
ఏది గానం 
ఏది మౌనం 
ఏది నాదీ 
ఏది నీదీ 
ఏది నీతీ 
ఏదనీతీ

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
puNya (pushpa, samRddhi, Rddhi) - 

aadhAramu - nATyaSAstramu

puNya (pushpa, samRddhi, Rddhi) - ra/ga #UIUU#
4 pratishTha 3

varNirUpA 
tUrNavEgA 
pUrNapuNyA 
pUrNa mIvE 

vaMda pushpA 
leMdu@M jUDan 
suMdarI ka-
nviMdu gAdA 

bhUsatI nI 
yI samRdhhin 
hAsamul nE@M 
jUsikoMTin 

eevasaMta 
mmIvanammul 
kAvi raMgul 
bhAva dIptul 

rAma lAlI 
SyAma lAlI 
prEmatO nA 
svAmi lAlI 

SrISrI OmahAtmA OmaharshI kavitalO ee vRttamunaku saripOyE konni paMktulu - 

Edi puNyaM 
Edi pApaM 
Edi satyaM 
EdasatyaM 
EdanityaM 
Edi nityaM 
Edi yEkaM 
EdanEkaM 
Edi gAnaM 
Edi maunaM 
Edi nAdI 
Edi nIdI 
Edi nItI 
EdanItI

vidhaeyud'u - jejjAla kRshNa mOhana rAvu