[racchabanda] ఆనందమధు #aanaMdamadhu#

 

ఆనందమధు - 

ఆధారము - కల్పితము 
నడక - 4,5 - 5,4 లేక 4,5 - 4,5 మాత్రలు 

ఆనందమధు - మ/ర/భ/లగ UU UUI - UUI IIU
11 త్రిష్టుప్పు 913 

అందమ్మీవేళ - ఆనంద మధువో
ఛందమ్మీవేళ - సంగీత రవమో 
బంధమ్మీవేళ - భావాల రసమో 
నందానందుండు - నాకిచ్చు వరమో 

నందాత్మా పూత-నాజీవితహరా 
సందేహమ్మేల - సంపూర్ణ విభవా 
చిందించన్ రమ్ము - శ్రీరాశిఁ ద్వరగా 
వందింతున్ నిన్ను - బద్మాలయపతీ 

వేణూనాదమ్ము - ప్రేమార్ద్ర పదమో 
గానానందమ్ము - గంగా సలిలమో 
ఈ నాజీవమ్ము - హిందోళ మగునో 
ప్రాణమ్మౌనో వి-రాజిల్లు దివెగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
aanaMdamadhu - 

aadhAramu - kalpitamu 
naDaka - 4,5 - 5,4 lEka 4,5 - 4,5 mAtralu 

aanaMdamadhu - ma/ra/bha/laga #UU UUI - UUI IIU#
11 trishTuppu 913 

aMdammIvELa - aanaMda madhuvO
ChaMdammIvELa - saMgIta ravamO 
baMdhammIvELa - bhAvAla rasamO 
naMdAnaMduMDu - nAkichchu varamO 

naMdAtmA pUta-nAjIvitaharA 
saMdEhammEla - saMpUrNa vibhavA 
chiMdiMchan rammu - SrIrASi@M dvaragA 
vaMdiMtun ninnu - badmAlayapatI 

vENUnAdammu - prEmArdra padamO 
gAnAnaMdammu - gaMgA salilamO 
ee nAjIvammu - hiMdOLa magunO 
prANammaunO vi-rAjillu divegA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAVu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] సార్థకనామ గణాక్షర వృత్తము సీరి #sArthakanAma gaNAxara vRttamu sIri#

 

సార్థకనామ గణాక్షర వృత్తము సీరి - 

ఆధారము - కల్పితము 
గణములు - నాలుగు స-గణములు, మూడు ర-గణములు 
సీరి అనగా బలరాముడు అని అర్థము 

సీరి - (స)4/(ర)3 IIUIIU IIUIIU - UIUUI UUIU
21 ప్రకృతి 599772 

కలవేణురవమ్ముల గీతులతోఁ - గమ్మఁగా నిండె వాతమ్ములే 
తెలతెల్లని మంచుల కాంతులతో - దివ్యమై తోఁచె నాశృంగముల్ 
మెలమెల్లఁగ రమ్మిట సుందరమౌ - మేఘమాలాతతిన్ గానఁగా 
నిల యయ్యె వసంతములో నిరవై - హృద్యమౌ ప్రేమ కాగారమై 

బలవంతుఁడు సీరికిఁ దమ్ముఁడుగా - బాలగోపాలుఁ డుండెన్ గదా 
హలితోఁ బలు కేళిక లాడెనుగా - హారి నందవ్రజమ్మున్ సదా 
తలిదండ్రుల బంధనమున్ మధురన్ - దాను ముక్తమ్ము జేసెన్ గదా 
చెలిమిన్ కలిమిన్ బలిమిన్ సరియే - చిన్మయానందుఁడౌ వానికిన్ 

చలిలో యమునానదిలో రజనిన్ - జక్కఁగాఁ జెంత రావా హరీ 
తెలివెన్నెలలోఁ జెలువమ్ములతోఁ - దీయఁగాఁ బాడ రావా దరిన్ 
బలు రీతుల రాసవినోదములన్ - భావనాతీతమై యాడవా 
కలలన్ నిజమై యిల సేయఁగ స-త్కావ్యమై తీర్చి దిద్దంగ రా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
sArthakanAma gaNAxara vRttamu sIri - 

aadhAramu - kalpitamu 
gaNamulu - nAlugu sa-gaNamulu, mUDu ra-gaNamulu 
sIri anagA balarAmuDu ani arthamu 

sIri - (sa)4/(ra)3 #IIUIIU IIUIIU - UIUUI UUIU#
21 prakRti 599772 

kalavENuravammula gItulatO@M - gamma@MgA nimDe vAtammulE 
telatellani maMchula kAMtulatO - divyamai tO@Mche nASRMgamul 
melamella@Mga rammiTa suMdaramau - mEghamAlAtatin gAna@MgA 
nila yayye vasaMtamulO niravai - hRdyamau prEma kAgAramai 

balavaMtu@MDu sIriki@M dammu@MDugA - bAlagOpAlu@M DuMDen gadA 
halitO@M balu kELika lADenugA - hAri naMdavrajammun sadA 
talidaMDrula baMdhanamun madhuran - dAnu muktammu jEsen gadA 
chelimin kalimin balimin sariyE - chinmayAnaMdu@MDau vAnikin 

chalilO yamunAnadilO rajanin - jakka@MgA@M jeMta rAvA harI 
telivennelalO@M jeluvammulatO@M - dIya@MgA@M bADa rAvA darin 
balu rItula rAsavinOdamulan - bhAvanAtItamai yADavA 
kalalan nijamai yila sEya@Mga sa-tkAvyamai tIrchi diddaMga rA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___