[racchabanda] జహ్నుకన్య #jahnukanya#

 

జహ్నుకన్య - 

ఆధారము - కల్పితము 
ఉత్పలమాలను cyclic permutation చేయగా లభించిన వృత్తము 

ఉత్పలమాల - UII UIU | IIIU - IIU IIUI UIU
జహ్నుకన్య - IIIU IIU IIUI - UIU | UII UIU

క్రింద నా ఉదాహరణములు - 

జహ్నుకన్య - న/భ/భ/ర/య/స/లగ IIIU IIU IIUI - UIU UII UIU 
20 కృతి 366008 

మనసులో నెపుడున్ నిను దల్తు - మాధవా సత్యము చెప్పితిన్ 
కనఁగ నీ మొగమున్ గనులిందుఁ - గాచెరా నిత్యము నీకునై 
వనజ మీ హృది యో వనజాక్ష - వాడెరా రేకులు వీడెరా 
తనువు దాఁ దపమే యొనరించెఁ - దాళఁగా లేనిట నమ్మురా 

విరహమా యిటులన్ నను నీవు - ప్రేమతోఁ జంపుట న్యాయమా 
సరసుఁడా యిటులన్ నను నీవు - చల్లఁగాఁ దాఁకుట ధ్యేయమా 
హరుసమా యిటులన్ నను నీవు - హాస్యమున్ గిచ్చుట మోడియా 
పరువమా యిటులన్ నను నీవు - పక్కలో గ్రుచ్చుట పాడియా 

జనకజా నిను నే మనమందు - జహ్నుకన్యకగా నుంచెదన్ 
దినములో రజనిన్ బ్రతిరోజు - తెల్విలో నిద్దుర నెంచెదన్ 
కనులతో నిను నేఁ గన నౌనె - కామినీ యావిధి చిత్తమే 
వినినచోఁ బలుకుల్ వనజాక్షి - ప్రేమతోఁ బొంగుదువందు నేన్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
jahnukanya - 

aadhAramu - kalpitamu 
utpalamAlanu #cyclic permutation# chEyagA labhiMchina vRttamu 

utpalamAla - #UII UIU | IIIU - IIU IIUI UIU#
jahnukanya - #IIIU IIU IIUI - UIU | UII UIU#

kriMda nA udAharaNamulu - 

jahnukanya - na/bha/bha/ra/ya/sa/laga #IIIU IIU IIUI - UIU UII UIU# 
20 kRti 366008 

manasulO nepuDun ninu daltu - mAdhavA satyamu cheppitin 
kana@Mga nI mogamun ganuliMdu@M - gAcherA nityamu nIkunai 
vanaja mI hRdi yO vanajAxa - vADerA rEkulu vIDerA 
tanuvu dA@M dapamE yonariMche@M - dALa@MgA lEniTa nammurA 

virahamA yiTulan nanu nIvu - prEmatO@M jaMpuTa nyAyamA 
sarasu@MDA yiTulan nanu nIvu - challa@MgA@M dA@MkuTa dhyEyamA 
harusamA yiTulan nanu nIvu - hAsyamun gichchuTa mODiyA 
paruvamA yiTulan nanu nIvu - pakkalO gruchchuTa pADiyA 

janakajA ninu nE manamaMdu - jahnukanyakagA nuMchedan 
dinamulO rajanin bratirOju - telvilO niddura neMchedan 
kanulatO ninu nE@M gana naune - kAminI yAvidhi chittamE 
vininachO@M balukul vanajAxi - prEmatO@M boMguduvaMdu nEn 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] రచ్చబండ కవితలు

 

 

Amaretto

 

ఎందుకు నిద్రించటం, నేనెందుకు నిద్రించటం

ఎఱ్ఱని మధువు తాగుతూ, ఎంతో ఏకాంతంలో

ఇంతైనా అంతరాయం లేని ప్రాయంలో

ఎంతెంతో వాంఛతో

నేనాతని

పుంభావాన్నీ, పరిరంభాన్నీ  

మరిమరి ఆహ్వానిస్తూ, పరిపరి జ్వలిస్తూ

ఎనలేని సుఖాన్ని పొందే ఈ పరువపు రాత్రిలో  

ఊరందరిలాగా ఉద్రేకరహితంగా ఎందుకు నిద్రించటం?

 

Lyla





__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (181)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___