[racchabanda] విమలా #vimalA#

 

విమలా - 

ఆధారము - నాట్యశాస్త్రము, హేమచంద్రుడు 
నడక - చతురస్రగతి 

విమలా - స/మ/న/లగ IIU UU - UII IIU 
11 త్రిష్టుప్పు 964 

అనఘా నీవే - యందఱి వరమై 
కనరావా నా - కన్నుల కెదురై 
వినవా హెచ్చెన్ - వేదన తమిలా 
మనికిన్ లేదే - మాధురి విమలా 

వదనమ్మయ్యెన్ - బాధల కిరవై 
ముదమే యయ్యెన్ - మోహన కరువై 
మదిలో నిండెన్ - మాటలు బరువై 
కదిలెన్ నీళ్లే - కన్నుల చెరువై 

విరిమాలల్ నీ - వేణికి సిరిగా 
చిఱునవ్వుల్ నీ - చెల్మికి సిరిగా 
సరసమ్ముల్ నీ - సౌరుకు సిరిగా 
వరవీణారా-వమ్ముల దరి రా  

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
vimalA - 

aadhAramu - nATyaSAstramu, hEmachaMdruDu 
naDaka - chaturasragati 

vimalA - sa/ma/na/laga #IIU UU - UII IIU# 
11 trishTuppu 964 

anaghA nIvE - yaMda~ri varamai 
kanarAvA nA - kannula kedurai 
vinavA hechchen - vEdana tamilA 
manikin lEdE - mAdhuri vimalA 

vadanammayyen - bAdhala kiravai 
mudamE yayyen - mOhana karuvai 
madilO niMDen - mATalu baruvai 
kadilen nILlE - kannula cheruvai 

virimAlal nI - vENiki sirigA 
chi~runavvul nI - chelmiki sirigA 
sarasammul nI - sauruku sirigA 
varavINArA-vammula dari rA  

vidhEyud'u - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] కనకమంజరీ #kanakamaMjarI#

 

కనకమంజరీ - 

ఆధారము - వృత్తజాతిసముచ్చయము, మందారమరందచంపూ 
రెండు పాదార్ధములలో రెండు నాలుగు మాత్రలు కాని ఎనిమిది మాత్రలు ఉంటాయి దీనికి. ఇది రథోద్ధత వర్గమునకు చెందిన వృత్తము. 

కనకమంజరీ, రాజహంసీ, విభూషణా - న/ర/ర/లగ IIIUIU - UIUIU
11 త్రిష్టుప్పు 664 

కనఁగ సచ్చిదా-నంద విగ్రహున్ 
మనము తా జగ-న్మాధవా యనెన్ 
దినము రాత్రిలో - దేవదేవుఁడే 
వినును దప్పకన్ - బ్రేమ గాథలన్ 

రమణుఁ డెక్కడే - రాజహంసమా 
నమన మిత్తునే - నాకుఁ జెప్పవే 
భ్రమల మున్గితిన్ - వాఁడు లేక నేఁ  
డమృత మయ్యెనే - యది విసమ్ముగా 

కలల కావ్యమో - కామ శాస్త్రమో 
పలు కటారులో - భామ చూపులో 
సొలయు నిద్రలో - సోమకాంతులో 
వలపు రంగులో -  వైమస్యమో

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
kanakamaMjarI - 

aadhAramu - vRttajAtisamuchchayamu, maMdAramaraMdachaMpU 
reMDu pAdArdhamulalO reMDu nAlugu mAtralu kaani enimidi mAtralu uMTAyi dIniki. idi rathOddhata vargamunaku cheMdina vRttamu. 

kanakamaMjaree, raajahaMsee, vibhooshaNaa - na/ra/ra/laga #IIIUIU - UIUIU#
11 trishTuppu 664 

kana@Mga sachchidA-naMda vigrahun 
manamu tA jaga-nmAdhavA yanen 
dinamu rAtrilO - dEvadEvu@MDE 
vinunu dappakan - brEma gAthalan 

ramaNu@M DekkaDE - rAjahaMsamA 
namana mittunE - nAku@M jeppavE 
bhramala mun&gitin - vA@MDu lEka nE@M  
DamRta mayyenE - yadi visammugA 

kalala kAvyamO - kAma SAstramO 
palu kaTArulO - bhAma chUpulO 
solayu nidralO - sOmakAMtulO 
valapu raMgulO -  vaimasyamO

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___