[racchabanda] సార్థకనామ గణాక్షర వృత్తము తానా #sArthakanAma gaNAxara vRttamu tAnA#

 

సార్థకనామ గణాక్షర వృత్తము తానా - 

గణములు - త/త - న/న 
ఇది పాదమునకు రెండు ఇంద్రగణములు, రెండు సూర్యగణములు ఉండే సీసకగీతిలోని (గోమేధిక - 13) ఒక ప్రత్యేకత. సీసములోని ద్వితీయార్ధమువలె ఉంటుంది, అందుకే సీసకగీతి అని ఈ గీతులకు పేరు నుంచినాను. 

తానా - త/త - న/న UUI UUI - III III
12 జగతి 4069

రావేల నాట్యాల - రసము లొలుక 
జీవమ్ము పోయంగఁ - జెలువ మలర 
నావైపు చూడంగ - నగవు సిరుల 
భావాల దీపాల - పసలు వెలయ 

నాచింత హెచ్చయ్యె - నలఁత పెఱిగె 
నోచంద్రుఁడా నాకు - నుసురు నొసఁగు  
నాచంద్ర బింబాస్య - హరిణనయన 
నీచూపునందెందు - నిలిచెఁ దెలుపు 

ఈమానసమ్మందు - నెపుడు గలవు 
నీమాట గానమ్ము - నిజము నిజము 
నీమేని యాచాయ - నెలకు సమము 
నీమీన నేత్రాలు - నిమిష సుఖము 

తానా పురస్కార సందర్భముగా వ్రాసినది (అక్కడ చదువలేక పోయాను.)- 

ఈనాఁడు ఛందస్సు - కిటుల గురుతు- 
గానిచ్చి రీకాన్కఁ - గవులకొఱకు 
నానంద మావాణి - కగును నిజము 
తానాన తానాన - తనన తనన

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
sArthakanAma gaNAxara vRttamu tAnA - 

gaNamulu - ta/ta - na/na 
idi pAdamunaku reMDu iMdragaNamulu, reMDu sUryagaNamulu uMDE sIsakagItilOni (gOmEdhika - 13) oka pratyEkata. sIsamulOni dvitIyArdhamuvale uMTuMdi, aMdukE sIsakagIti ani ee gItulaku pEru nuMchinaanu. 

tAnA - ta/ta - na/na #UUI UUI - III III#
12 jagati 4069

rAvEla nATyAla - rasamu loluka 
jIvammu pOyaMga@M - jeluva malara 
nAvaipu chUDaMga - nagavu sirula 
bhAvAla dIpAla - pasalu velaya 

nAchiMta hechchayye - nala@Mta pe~rige 
nOchaMdru@MDA nAku - nusuru nosa@Mgu  
nAchaMdra biMbAsya - hariNanayana 
nIchUpunaMdeMdu - niliche@M delupu 

eemAnasammaMdu - nepuDu galavu 
nImATa gAnammu - nijamu nijamu 
nImEni yAchAya - nelaku samamu 
nImIna nEtrAlu - nimisha sukhamu 

tAnA puraskAra saMdarbhamugA vrAsinadi (akkaDa chaduvalEka pOyAnu.)- 

eenA@MDu ChaMdassu - kiTula gurutu- 
gAnichchi rIkAn&ka@M - gavulako~raku 
nAnaMda mAvANi - kagunu nijamu 
tAnAna tAnAna - tanana tanana

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___