[racchabanda] కుందమాల (పొగడసరము) #kuMdamAla (pogaDasaramu)#

 

కుందమాల (పొగడసరము) - 

మాగురువులు శ్రీ వేదం వేంకటకృష్ణ శర్మగారు దిఙ్నాగుని కుందమాలను తెలుగులో అనువాదము చేసినారు. వారికి స్మృత్యంజలిగా ఈ కుందమాల వృత్తమును ఒకప్పుడు కల్పించినాను. చంపకమాలలోని యత్యక్షరమైన గురువు రెండు లఘువులైనవి ఈ వృత్తములో. 

కుందమాల (పొగడసరము) - న/జ/భ/న/స/స/జ/గ  IIII UIU III - IIII UII UIUIU 
22 ఆకృతి 1425328

గురువును వేడెదన్ బగితి - గురువులె పాఠము నేర్పుచుందు రా
గురువులె సానబెట్టెదరు - కుతుకము మీఱఁగ బుద్ధి వెల్గఁగా 
నరుసముతోడి జీవితము - నవనిని వారి వరమ్ము వారి యా  
చరణసరోరుహమ్ములకు - సముదమునిత్తును గుందమాలలన్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
kuMdamAla (pogaDasaramu) - 

mAguruvulu SrI vEdaM vEMkaTakRshNa SarmagAru di~mnAguni kuMdamAlanu telugulO anuvAdamu chEsinAru. vAriki smRtyaMjaligA ee kuMdamAla vRttamunu okappuDu kalpiMchinAnu. chaMpakamAlalOni yatyaxaramaina guruvu reMDu laghuvulainavi ee vRttamulO. 

kuMdamAla (pogaDasaramu) - na/ja/bha/na/sa/sa/ja/ga  #IIII UIU III - IIII UII UIUIU# 
22 aakRti 1425328

guruvunu vEDedan bagiti - guruvule pAThamu nErpuchuMdu rA
guruvule sAnabeTTedaru - kutukamu mI~ra@Mga buddhi velga@MgA 
narusamutODi jIvitamu - navanini vAri varammu vAri yA  
charaNasarOruhammulaku - samudamunittunu guMdamAlalan 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] సార్థకనామ గణాక్షర వృత్తము తమాల #sArthakanAma gaNAxara vRttamu tamAla#

 

సార్థకనామ గణాక్షర వృత్తము తమాల - 

ఆధారము - కల్పితము 

తమాల - త/మ/మ/ల UUI UU - UU UUI
10 పంక్తి 517

హా, యా తమాల - శ్యామాకారమ్ము 
నా యీ యెడందన్ - నాట్యమ్మాడంగఁ 
గాయమ్ము పొంగెన్ - గాలమ్మో నిల్చె 
నాయాశ తీవల్ - నవ్యమ్మై మొల్చె 

తారాశశాంకుల్ - ధ్వాంతమ్మందిట్టు 
లీరాత్రి వెల్గన్ - హృద్య మ్మీవేళ 
వారాశివోలెన్ - భావమ్ముల్ నింగిఁ 
జేరంగ నెంచెన్ - జిత్రమ్మీ నాఁడు 

బాలార్క బింబం - బాకాశమ్మందు 
లీలన్ వెలుంగన్ - శృంగమ్ముల్ నిండె 
శ్రీలన్ శుభమ్మై - చెల్వమ్ముల్ చిందె 
నాలోల మీ నా - యాత్మన్ మోదమ్ము 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
sArthakanAma gaNAxara vRttamu tamAla - 

aadhAramu - kalpitamu 

tamAla - ta/ma/ma/la #UUI UU - UU UUI#
10 paMkti 517

hA, yA tamAla - SyAmAkArammu 
nA yI yeDaMdan - nATyammADaMga@M 
gAyammu poMgen - gAlammO nilche 
nAyASa tIval - navyammai molche 

tArASaSAMkul - dhvAMtammaMdiTTu 
lIrAtri velgan - hRdya mmIvELa 
vArASivOlen - bhAvammul niMgi@M 
jEraMga neMchen - jitrammI nA@MDu 

bAlArka biMbaM - bAkASammaMdu 
lIlan veluMgan - SRMgammul niMDe 
SrIlan Subhammai - chelvammul chiMde 
nAlOla mI nA - yAtman mOdammu 

vidhaeyuDu - jejjAla kRshNa mOhana rAvu
#


__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] శ్యేని (తాల) #SyEni (tAla)#

 

శ్యేని (తాల) -

ఆధారము - పింగళ ఛందస్సు, పురాతన వృత్తము 
ఇతర నామములు - శ్రేణి, నిశ్రేణి, వైతికా, సేనిక 
నడక - త్ర్యస్రగతి - (UI)n U where n = 5

శ్యేని (తాల) - ర/జ/ర/లగ UI UI UI - UI UIU 

ధేనుకాసురున్ వ-ధించ హాలి, యె-
త్తైన తాళవృక్ష - మయ్యె గార్దభ 
శ్రేణికిన్ గతించ - ఋష్టియై, హరీ 
రాణ నొందె నీప-రాక్రమమ్మురా 

నింగిలో వెలింగె - నేత్రపర్వమై 
రంగులీను పెక్కు - రమ్యతారకల్ 
శృంగమందు మంచు - చిత్రశోభతో 
రంగనిన్ గనంగ - రాత్రి నుంటి నేన్ 

రేయి నిండె నోయి - ప్రేమ నింపవా 
తీయనైన వేళ - తేనె చిందవా 
హాయి నీయ రమ్ము - హర్షసింధువై 
గాయమీయబోకు - కాయమోర్వదే 

తొందరేల నమ్మ - తోయజాక్షుఁ డా-
నందవర్ధనుండు - నాకు, గోకుల
మ్మందునుండి వచ్చు - మందహాసుఁడై 
విందు వాని మాట - ప్రేమమాటయే 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
SyEni (tAla) -

aadhAramu - piMgaLa ChaMdassu, purAtana vRttamu 
itara naamamulu - SrENi, niSrENi, vaitikA, sEnika 
naDaka - tryasragati - #(UI)n U where n = 5#

SyEni (tAla) - ra/ja/ra/laga #UI UI UI - UI UIU# 

dhEnukAsurun va-dhiMcha hAli, ye-
ttaina tALavRxa - mayye gArdabha 
SrENikin gatiMcha - RshTiyai, harI 
rANa noMde nIpa-rAkramammurA 

niMgilO veliMge - nEtraparvamai 
raMgulInu pekku - ramyatArakal 
SRMgamaMdu maMchu - chitraSObhatO 
raMganin ganaMga - rAtri nuMTi nEn 

rEyi niMDe nOyi - prEma niMpavA 
tIyanaina vELa - tEne chiMdavA 
hAyi nIya rammu - harshasiMdhuvai 
gAyamIyabOku - kAyamOrvadE 

toMdarEla namma - tOyajAxu@M DA-
naMdavardhanuMDu - nAku, gOkula
mmaMdunuMDi vachchu - maMdahAsu@MDai 
viMdu vAni mATa - prEmamATayE 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___